webnovel
avataravatar

9

మేజిక్ కార్ప్కి మనుషుల మీదున్న ద్వేషం, కోపం వల్ల ఎలాగయినా ఓడించి తనను తాను నిరూపించుకోవాలనే ఆత్మ విశ్వాసం పట్టుదలతో మేజిక్ కార్ప్ నుంచి గ్యారడోస్గా రూపాంత్రం చెందుతుంది.

రూపాంత్రం చెందిన వెంటనే ఓటమికి గురి కావడం వల్ల గ్యారడోస్ మనోభావాలు దెబ్బతింటాయి.

తనలోని ఆత్మ విశ్వాసం పూర్తిగా పోతుంది. తనకు పోకిమాన్లా బ్రతికే హక్కు లేదని భావించి చావు కోసం నేల మీద, కళ్ళు మూసుకొని పనుకుంటుంది.

మహేంద్ర: ఓయ్... హలో?... హలో?..... నా గొంతు వినిపిస్తుందా?....

అని మహేంద్ర గ్యారడోస్ని పిలుస్తాడు.

గ్యారడోస్ అతని గొంతు విని కళ్ళు తెరుస్తుంది.

మహేంద్ర: నా పేరు మహేంద్ర. నిన్ను కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది.

అని నవ్వుతూ గ్యారడోస్ను పలకరిస్తాడు.

గ్యారడోస్ అశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తుంది. తన లాంటి పనికిరాని పోకిమాన్ని ఒక బాలమైన పోకిమాన్ ట్రైనర్ అయిన మహేంద్ర మర్యాదగా పలకరించడం ఇదే మొదటిసారి.

గ్యారడోస్ మనసులో మహేంద్ర మీద మంచి అభిప్రాయం కలుగుతుంది.

గ్యారడోస్: గ్యార!.... గ్యార!... గ్యారడోస్.... (నాకు.. కూడా.. నిన్ను కలిసినందుకు... సంతోషంగా ఉంది...)

అని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంది.

మహేంద్ర: హహహ...

@@@

మహేంద్ర దుస్తులు తొడుక్కొని, ఓహో వీపు మీదకు ఎక్కి అక్కడి నుంచి బయలుదేరబోతారు.

మహేంద్ర: గుడ్ బై! గ్యారడోస్! అవకాశం దొరికితే మరోసారి కలుద్దాం.

అని చెప్పి, ఓహో తో గాల్లో ఎగురుతూ బయలుదేరుతాడు.

గ్యారడోస్: గ్యార! గ్యార! గ్యారడోస్... (....)

వాళ్ళు ఎగురి వెళుతుండగా గ్యారడోస్ వాళ్ళను కింద నుంచి వెంబడిస్తూ ఏదో చెబుతుంది. ఎత్తులో ఉండటం వల్ల మహేంద్రకు వినిపించదు. గ్యారడోస్ కూడా గుడ్ బై చెప్తోందని అనుకుంటాడు.

ఓహో వేగానికి గ్యారడోస్ అనుసరించలేక పోతుంది.

గ్యారడోస్: గ్యార! గ్యార!... గ్యారడోస్... (....)

అని గట్టిగా పిలుస్తుంది.

@@@@

అలా వాళ్ళు నెస్ట్కి తిరిగి వచ్చేస్తారు.

కాసేపు వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు.

####

మహేంద్ర: మనం మన జర్నీని ముందుకు కొనసాగించలంటే మన దెగ్గర డబ్బులు కచ్చితంగా ఉండాలి. కానీ....

మన దెగ్గర ఒక్క పైసా లేదు.. దారి ఖర్చులు ఎలా ఇపుడు?

ఓహో: క్యూ?! (దారి ఖర్చులు ఎందుకు? నేను నిన్ను గాల్లో ఎగురుకుంటూ తీసుకోని వెళతాను. సింపుల్!)

మహేంద్ర: అలా కుదరదుగా~

నువ్వేమో పోకిమాన్వి. నేనేమో మనిషిని.

నీలా రోజూ పండ్లు గింజలు మాత్రమే తింటూ బ్రతకలేను కదా?

మనుషులు తినే ఆహారం కొనాలంటే నాకు డబ్బు అవసరం ఉంటుంది.

అంతెందుకు, మనం ప్రయాణం చేయాలంటే ఒక్కో ప్రదేశంలో టాక్స్ అని, చెక్ పోస్ట్ అని, లైసెన్స్ అని,... ఇలా చాలా ఖర్చులే ఉంటాయి.

డబ్బులు కట్టకుండా పాస్పోర్ట్, ఐడి కార్డు లేకుండా ఎక్కడికి కూడా రానివ్వరు.

సిటీల్లో చెట్లు, అడవులు తక్కువగా ఉంటాయి. అక్కడ ఉన్నంత కాలం ఆకలిని ఓర్చుకుంటూ ఉండాల్సిందే..

విశ్రాంతి తీసుకోడానికి ఫ్రీగా ఎక్కడా చోటుని ఇవ్వరు.. రోడ్డులోనూ నిలపడనివ్వరు...

ఓహో: క్యూ!!!... క్యూ!!!.... (సరే! సరే!!... ఆపు! నీ ఏడుపు అర్థమువుతోంది! ఇప్పుడు డబ్బులే కదా నీకు కావాలి? దెగ్గరలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అక్కడ డబ్బు పేరుతో మనుషులు కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వెళ్లి తీసుకుని రానా?!)

అని ఎగరడానికి సిద్ధం అవుతుంది.

మహేంద్ర వేగంగా వెళ్లి ఓహోని కౌగిలించుకొని ఎగరాకుండా ఆపుతాడు.

ఓహో: క్యూ...? (ఏం చేస్తున్నావ్?)

మహేంద్ర: నిన్ను బ్యాంక్ రాబరీ చేయనివ్వకుండా ఆపుతున్నాను...

ఓహో: క్యూ?.. (అదే ఏం? నీకు డబ్బొద్దా?)

మహేంద్ర: డబ్బు అవసరం కాబట్టి కావాలి! కానీ, బ్యాంక్ రాబరీ చేసిన డబ్బొద్దు!

ఓహో: క్యూ?.. (అదే ఏం?)

మహేంద్ర: ఎందుకంటే... ఎలా చెప్పను... హా!!

నువ్వు బ్యాంక్ రాబరీ చేశావనుకో నువ్వొక దొంగవని నీ ఫోటోలు ప్రపంచమంతా చూసేలా టీవీలలో చూపిస్తారు, ఇంటర్నెట్లో పోస్ట్లు పెడతారు, వీధి గోడలకు, పోలీస్ స్టేషన్లో నీ ఫోటోలు అతికిస్తారు. నిన్ను పట్టిస్తే గిఫ్ట్లు కూడా ఇస్తామని అంటారు. అప్పుడు ప్రపంచం అంతా నిన్ను పట్టుకోవడానికి నీ వెంట పడుతుంది.

అలా కనుక జరిగితే మనం ఎప్పటికీ బయటకు వెళ్లలేము. నువ్వు లెజెండరి మాస్టర్ పోకిమాన్ కూడా అవ్వలేవు.

ఓహో షాక్కు గురవ్వుతుంది.

ఓహో: క్యూ... (ఆ కాగితాలు.. అంత విలువైనవా?..)

మహేంద్ర: అవును ఫ్రెండు.. డబ్బు కోసం మనిషి ఏమైనా చేస్తాడు.. అది చాలా పవర్ఫుల్.. చాలా డేంజరస్...

ఓహో: క్యూ... (అలాంటి దాన్ని మనుషులందరు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారా?...)

మహేంద్ర: డబ్బు కూడా నిప్పు లాంటిదే ఫ్రెండు! మంచి వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకూ ఎవరికీ ఏ ప్రమాదము ఉండదు.

తప్పుడు చేతులకు కనుక డబ్బు, పదవి రెండూ దొరికితే దేశమే నాశనం అయిపోతుంది.