మహేంద్ర, ఓహోలు తమ మొదటి పోకిమాన్ ఫైట్కు సిద్ధం అవుతారు.
గ్యారడోస్, వాటర్ ఆటాక్స్ చేసే డ్రాగన్ టైప్ పోకిమాన్.
ఓహో, ఫైర్ ఆటాక్స్ చేసే ఫ్లైయింగ్ టైప్ పోకిమాన్.
ఫైర్ టైప్ పోకిమాన్లు వాటర్ టైప్ పోకిమాన్ల అటాక్స్ పైన చాలా బలహీనంగా ఉంటాయి.
వాటర్ టైప్, రాక్ టైప్ పోకిమాన్లు ఫైర్ టైప్ పోకిమాన్లను ఈసీగా ఓడించేస్తాయి.
బాగా గమనిస్తే, ఓహో కంటే గ్యారడోస్ గెలవటానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
కానీ...
మహేంద్ర: ఓహో! 'ఫ్లేమ్ త్రోవర్ అటాక్' చేయ్!!
ఓహో తన ముక్కుతో ఫ్లేమ్ త్రోవర్ అటాక్ చేస్తుంది.

గ్యారడోస్ కళ్ళు మూసి తెరిచే లోపల ఓహో చేసిన అటాక్ తగిలి నేల మీద కాలిన చేపలా పడుంటుంది.
గ్యారడోస్: గ్యార! గ్యార! గ్యారడోస్...
(చిన్న అటాక్కే ఓడిపోయానంటే... నాకు... నమ్మ శఖ్యం కావట్లేదు... హా... నేను వాటర్ & డ్రాగన్ టైప్!! నువ్వు ఒట్టి నిప్పులు కక్కే పక్షివి... నీ చేతుల్లో ఎలా ఓడిపోయాను...)
అని నిరాశతో ఏడవబోతుంది.
ఓహో: క్యూ... (ఓయ్! పిల్లి పిత్తిరి! నీకు నోరు మాత్రమే పెద్దది! నీ తల్లో కుంచం కూడా గుజ్జు లేదు!)
ఓహో మాటలు విని గ్యారడోస్ బోర్లా దొర్లుతూ ఏడుస్తుంది.
అచ్చం వాన పాములగే కనిపిస్తుంది.
మహేంద్ర ఆ దృశ్యం చూస్తూ నవ్వాపుకుంటూ ఉండటానికి కష్టపడతాడు.
మహేంద్ర:....
ఓహో: క్యూ.. (నేనేం మాములు నిప్పులు కక్కే పక్షిని కాను! నేనొక లెజెండరి పోకిమాన్ ఓహో ని! వీడు చూడటానికి కట్టె పుల్లలా ఉన్నా, వీడే నా మాస్టర్! మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్! వీడే కాబోయే పోకిమాన్ మాస్టర్! నేనే కాబోయే లెజెండరి మాస్టర్ పోకిమాన్! అర్థమయిందా?! నువ్వు ఒంటి తోకతో ఎన్ని ఏళ్ళు తపస్సు చేసినా మా నీడను కూడా చూడలేవు! నీ పూర్తి జీవితంలో నాలాంటి గొప్ప పోకిమాన్ ని చూడటమే సాధ్యమైన పని కాదు!)
అని చెబుతుంది.
గ్యారడోస్: గ్యార! గ్యార! గ్యారడోస్??... (పోకిమాన్ మాస్టర్..... లెజెండరి పోకిమాన్ మాస్టర్....)
అని చెబుతూ, గ్యారడోస్ తన పాత జ్ఞాపకల్లోకి వెళుతుంది.
గ్యారడోస్ మేజిక్ కార్ప్ లా ఉన్న రోజులవి...
ఎప్పటిలాగే నీటి ఒడ్డున పడుకొని పూర్తి ఎనర్జీతో ఆడుకుంటున్న రోజులవి.
*మేజిక్ కార్పులు ఎప్పుడూ నీటి ఒడ్డున, నీటి నుంచి బయట పడిన చేపల్లా గిల గిలా కొట్టుకుంటూ ఉంటాయి. అలా కొట్టుకోవడం మేజిక్ కర్పూలకి అట్లాడుకోవడంతో సమానం.
ఒకరోజు కొంత మంది పోకిమాన్ ట్రైనర్లు మేజిక్ కార్ప్ ఆడుకుంటున్న చోటు వైపుగా వెళుతూ కనిపిస్తారు.
మేజిక్ కార్ప్కి ఆసక్తిగా అనిపించింది వాళ్ళను వెంబడిస్తుంది.
వాళ్ళు నీటి ఒడ్డున కనిపించే వాటర్ పోకిమాన్ తో బాటిల్ చేస్తూ కనిపిస్తారు.
అలా చాలా సార్లు చాలా మంది ట్రైనర్లు వస్తూ బాటిల్స్ చేసి పోకిమాన్లను పట్టుకోవడాన్ని మేజిక్ కార్ప్కి గమనిస్తుంది.
ప్రతీ రోజూ వస్తూ ఒక్కొక్కరు పోకిమాన్ బాటిల్స్ చేస్తూ పోకిమాన్లను పోకిబాల్ లలో పట్టుకోవడం గమనిస్తూ ఉండేది.
అలా తనకు కూడా ఎవరితోనైనా బాటిల్ చేసి గెలవాలని, అందరి పోకిమాన్లలా ఒక మంచి పోకిబాల్ తనకు చెందాలని కోరుకునేది.
కొన్ని రోజుల తరువాత, కొందరు ట్రైనర్లు పోకిమాన్ల కోసం వస్తే వాళ్ళ ముందుకు గెంతుకుంటూ వచ్చి వాళ్ళని తనతో బాటిల్ చేయమని అడుగుతూ ఆడుకుంటూ ఉంటుంది.
వాళ్ళు మేజిక్ కార్ప్కిని చూసి విసుక్కొని వెళ్లి పోతారు. అలా చాలా మంది చాలా సార్లు మేజిక్ కార్ప్కిని చూసి తిడుతూ, విసుక్కుంటూ వెళ్లి పోతారు.
వాళ్ళ మాటలు ఇప్పటికీ తన చెవిలో మొగుతూ ఉంటుంది.
"పనికిమాలిన మేజిక్ కార్ప్కి!"
"ఊరికే అడ్డొస్తోంది!"
"దీన్ని పట్టుకుందామంటే పోకిబాల్ బొక్క!"
"మేజిక్ కార్ప్కి దీనికి పనికొస్తుంది? వండుకొని తినడానికి తప్పా?!"
"ఒకవేళ ఇది గ్యారడోస్గా రూపాంత్రం చెందుతుందా అనుకుంటే, 250 మేజిక్ కార్ప్కిలలో 1 మేజిక్ కార్ప్కి మాత్రమే గ్యారడోస్గా మారుతుందని పరిశోదకులు చెప్పారు."
"మేజిక్ కార్ప్కి పట్టుకొని ఏళ్లపాటు ట్రయినింగ్ ఇచ్చి టైం వేస్ట్ చేయడం కంటే కష్టమయినా సరే నేరుగా గ్యారడోస్ని పట్టుకోవడమే మంచిది."
"యూస్లెస్ మేజిక్ కార్ప్కి!!...."
"యూస్లెస్ మేజిక్ కార్ప్కి!!...."
"యూస్లెస్ మేజిక్ కార్ప్కి!!...."
...........
అలా తనకు కనిపించిన ప్రతీ ట్రైనర్ మేజిక్ కార్ప్కిను అవమానిస్తూ ఉండే వాళ్ళు.
వాళ్ళ మాటలు విని వినీ మేజిక్ కార్ప్కి మనుషులంటేనే ద్వేషం పుట్టుకొచ్చింది.
ఆ రోజు నుంచి తన చోటు దెగ్గరికి ఏ మనిషి వచ్చినా భయపెట్టి తరిమెసేది.
అలా ఒకరోజు మేజిక్ కార్ప్ నీళ్లలో ఈదుతూ ఉండగా మనిషి కళ్ళు కదులుతూ కనిపిస్తాయి.
ఏంటని ఆలోచిస్తూ పైకి ఈడుకుంటూ వస్తుంది. మనిషేనని కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకోని, ఎలాగయినా అతన్ని దూరంగా తరిమెయాలని అనుకుంటుంది.
తన పదునైన కొమ్ములతో వేగంగా ఈదుకుంటూ వచ్చి ఆ వ్యక్తి డిక్కీని పొడుస్తుంది.
అది మరెవరి డిక్కీనో కాదు. మన మహేంద్ర డిక్కీ!...
మనుషుల మీదున్న ద్వేషం, కోపం వల్ల ఎలాగయినా ఓడించి తనను తాను నిరూపించుకోవాలనే ఆత్మ విశ్వాసం పట్టుదలతో మేజిక్ కార్ప్ నుంచి గ్యారడోస్గా రూపాంత్రం చెందుతుంది.
గ్యారడోస్ తన ఓటమిని అంగీకరించి దిగమింగుకోగలదా?.
తన కలలు ఎప్పటికయినా నిజమవుతాయా? లేదా?
తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే,
నెక్స్ట్ చాప్టర్ చదవాల్సిందే...