webnovel

10

ఓహో ఆలోచిస్తుంది. ఈ లోకంలో తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని, వాటిని తెలుసుకోవాలని అనుకుంటుంది.

ఓహో: క్యూ... (హ్మ్.. నాకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. నాకు తెలియనివి నువ్వు నేర్పు. నీకు తెలియనివి నేను నేర్పుతాను.)

మహేంద్ర: హ్మ్! సరే! మనం ఇప్పుడు ఏం చేద్దామబ్బా....

అతను ఆలోచిస్తూ ఉండగా, నెస్టులో ఇరుక్కొని ఉన్నప్పుడు బయటకు తీసిన వస్తువులు జ్ఞాపకం వస్తాయి.

మహేంద్ర: ఓహో! ఈ వస్తువులని నేను అమ్మేస్తే నీకేమైనా అభ్యంతరం ఉందా?

ఓహో: క్యూ!.. (లేదు. ఇవన్నీ ఒట్టి మెరిసే వస్తువులు మాత్రమే. నా లక్ష్యం ముందు ఇవన్నీ రాళ్లు రప్పలే! అన్నీ అమ్మేస్కో.)

అని తల ఊపుతూ చెబుతుంది.

మహేంద్ర: హహహ!.. ఇక డబ్బుల గురించి సమస్యే లేదు. కానీ...

ఓహో: క్యూ?.. (ఏంటి సమస్య?)

మహేంద్ర: ఇవి ఎవరికి అమ్మాలో తెలీట్లా..

@@@

మహేంద్ర చేతి నిండా బ్యాడ్జులు, పోకిబాల్స్ తీసుకోని ఓహో మీదకు ఎక్కి కూర్చుంటాడు.

మహేంద్ర: హ్మ్... ఇది కూడా తీసుకుందాం..

అని అనుకోని, ఓహో నెస్ట్ యొక్క వేరు ముక్క తీసుకోని జోబీలో పెట్టుకుంటాడు.

@@@@

చాలా సేపుగా ఇద్దరూ ఎగురుకుంటూ వెలుతూ ఉంటారు.

దూరంలో ఒక సిటీ ఉండటం గమనిస్తారు.

మహేంద్ర: ఓహో! అక్కడ ఒక సిటీ ఉన్నట్టు ఉంది.

ఓహో ఎగురుకుంటూ వెళ్లి అడవి చివర ఆగుతుంది.

మహేంద్ర: ఏంటి ఇక్కడ ఆగావ్?

ఓహో: క్యూ.. (నేను ఇలాగే కనుక ఎగురుతూ వెళితే జనం దృష్టంతా నామీదే పడుతుంది. అప్పుడు వచ్చిన పని సక్రమంగా కాదు. అందుకే ఇక్కడ దింపాను.)

మహేంద్ర: హ్మ్.. సరే అయితే... నేను వెళ్లి వీటిని ఎక్కడ అమ్మాలో చూస్తాను.. నువ్వు ఇక్కడే ఉంటావా?

ఓహో: క్యూ?!.. (నా పోకిబాల్ ఉందిగా? దాంట్లో ఉంటాలే!)

అని చెప్పి మహేంద్ర జోబీలో ఉన్న పోకిబాల్ లోపాలకి వెళ్లి పోతుంది.

మహేంద్ర సిటీ లోకి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు.

చుట్టూ మనుషులు తిరుగుతూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.

ప్రతీ ఒక్కరి దెగ్గర రకరకాల పోకిమాన్స్ ఉంటాయి.

ఎత్తైన భవనాలు, రంగు రంగుల ఇళ్ళు, చుట్టూ పచ్చని మొక్కలు, చెట్లు, సుబ్రమైన పరియావరణం తో అధ్బుతంగా ఉంటుంది.

తను నిజంగా ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపిస్తుంది.

మహేంద్ర: వావ్... ఈ సిటీ చాలా అందంగా ఉంది.. నేను టీవిలో చూసిన దానికంటే చాలా అద్భుతంగా ఉంది..

అతను చుట్టూ తిరుగుతూ పరిసరాలను గమనిస్తూ ఉంటాడు.

ప్రతీ వీధి చివర రెండు పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. ఒకటి మనుషులకి, మరొకటి పోకిమాన్స్కి.

ఒక్కో వీధి మధ్యలో చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఒక్కో స్టేషన్లో ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు.

ట్రాఫిక్ రూల్స్ని అందరూ సక్రమంగా పాటిస్తూ ఉంటారు. ఆఫీసర్లు కూడా వాళ్ళ పనులను నిజాయితీగా సక్రమంగా చేస్తూ ఉంటారు.

మహేంద్ర ఎటెల్లాలో దారి తెలియక సిటీ చుట్టూ రౌండ్లు కొడుతూ ఉంటాడు.

ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ మాట్లాడి పెట్టేసి మహేంద్రను గమనిస్తుంది.

పోలీస్ ఆఫీసర్: అబ్బాయ్! ఓయ్! అబ్బాయ్! నువ్వు ఊరికి కొత్త? నిన్ను ఎప్పుడు ఈ చుట్టు పక్కల చూడలేదు?

అని అనుమానంగా అడుగుతుంది. అతను మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా నిలబడుతాడు.

మహేంద్ర: అం... అవును ఆఫీసర్. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను.

పోలీస్ ఆఫీసర్: అందుకేనా? ఊరంతా చక్కర్లు కొడుతున్నావ్?! దారి తప్పి పోయినట్టు ఉన్నావ్. ఎక్కడికెళ్లలో చెప్పు నేను సహాయం చేస్తాను.

మహేంద్ర: థాంక్స్ ఆఫీసర్. నేను నా వస్తువులను 2న్డ్ హ్యాండ్లో అమ్ముదామని అనుకుంటున్నాను.

పోలీస్ ఆఫీసర్: హ్మ్.. ఏ వస్తువులను అమ్మాలని అనుకుంటున్నావు? ఏం అమ్మాలనుకుంటున్నావో చెప్తే షాప్ వెతకడం సులువుగా ఉంటుంది.

మహేంద్ర: అది.. నా బ్యాడ్జ్లు,... పోకిబాల్స్... అమ్మాలని అనుకుంటున్నాను...

పోలీస్ ఆఫీసర్: హ్మ్? అందరూ బ్యాడ్జ్లు సాధించాలని కష్టపడుతుంటే నువ్వు అమ్మాలని అనుకుంటున్నావా? నాకు అనుమానంగా ఉంది. ఇవి దొంగలుంచినవా?

ఆమె అడుగు ఆగుతుంది.

పోలీస్ ఆఫీసర్: నిజం చెప్పూ! ఇవి ఎవరి దెగ్గర కొట్టేశావ్? అబద్దం చెపితే జైల్లో చిప్పకూడు తింటావ్! చెప్పూ! ఇవన్నీ ఎక్కడివి? అసలు నీ ఐడి చూపించు! పోకిమాన్ లైసెన్స్ చూపించు! నువ్వు పోకిమాన్ ట్రైనర్వా? లేకుంటే దొంగవో....

మహేంద్రకు మాటలు రావు. ఇవి అతను సంపాదించినవి కావు. అలా అని అతను దొంగలించినవి కావు.

ఓహో ఇచ్చిన వస్తువులు. అతను కనుక జైల్లో ఇరుక్కుంటే అతనికి బైల్ ఇవ్వడానికి ఈ లోకంలో ఎవరూ తెలీదు..

మన హీరో మహేంద్ర జైల్లో ఇరుక్కొని చిప్పకూడు తింటాడా?

పోలీస్ ఆఫీసర్ నుంచి తప్పించుకొని పారిపోయి వాంటెడ్ లిస్టులో చేరుతాడా?

ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ చాప్టర్ చదవాల్సిందే.....