పోలీస్ ఆఫీసర్: అందరూ బ్యాడ్జ్లు సాధించాలని కష్టపడుతుంటే నువ్వు అమ్మాలని అనుకుంటున్నావా?
నిజం చెప్పూ! ఇవి ఎవరి దెగ్గర కొట్టేశావ్?
అబద్దం చెపితే జైల్లో చిప్పకూడు తింటావ్! చెప్పూ!
ఇవన్నీ ఎక్కడివి? అసలు ముందుగా నీ ఐడి చూపించు! పోకిమాన్ లైసెన్స్ చూపించు!
నువ్వు పోకిమాన్ ట్రైనర్వా? లేకుంటే దొంగవా.....
*అలా పోలీస్ ఆఫీసర్ మన హీరోని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది.
మన హీరో తల వంచుకొని ఆలోచిస్తూ ఉంటాడు.
పోలీస్ ఆఫీసర్: హ్మ్?! నువ్వు సమాధానం చెప్పకుంటే నా అనుమానమే నిజమని అనుకోవాల్సి ఉంటుంది.
మహేంద్ర: సోరి ఆఫీసర్... నా దెగ్గర ఐడి లేదు... పోకిమాన్ లైసెన్స్ కూడా లేదు...
పోలీస్ ఆఫీసర్: హ్మ్....
మహేంద్ర: కానీ... నేను ఈ పోకిమాన్ బద్జులను దొంగలుంచలేదు! ఇవన్నీ నేనూ నా పోకిమాన్ బెస్ట్ ఫ్రెండ్ కష్టబడి సాధించినవి! మీకు నమ్మకం లేకుంటే నా పోలికలతో ఉన్న వ్యక్తి దొంగతనం చేసినట్టు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి! నా బడ్జెస్ అన్నీ మీకే ఇచ్చేస్తాను! జైల్లో కూడా కూర్చుంటాను! నేను నిరపరాదిని!
అని సిగ్గులేకుండా డ్రామాటిక్గా అబద్దం చెబుతాడు.
పోలీస్ ఆఫీసర్: 🍃..... సరే..... కాసేపు నా స్టేషన్లో కూర్చో. నేను నా శుభోర్డినేట్లతో మాట్లాడి తెలుసుకుంటాను. మస్కా కొట్టి పారిపోయావనుకో నీ కాళ్ళు చేతులు కట్టేసి జైల్లో పడేస్తా! గుర్తుంచుకో!
మహేంద్ర: సరే ఆఫీసర్! మీ అనుమానం తీరే వరకూ నేను ఈ కుర్చీ దిగను!
అని సబందం చేసి కుర్చీలో కూర్చుంటాడు. అలా కూర్చొని నిద్రలోకి జారుకుంటాడు.
@@@@@
*గంట తరువాత*
పోలీస్ ఆఫీసర్: ఓయ్!.. పిల్లోడా! అబ్బాయ్!! పైకి లెయ్!
మహేంద్ర: హా? ఎక్కడ? ఏంటి? ఏమైన్ది?..
అని గొనుక్కుంటూ నిద్ర నుంచి మేలుకుంటాడు.
పోలీస్ ఆఫీసర్: పదా బయలుదేరుదాం.
మహేంద్ర: ఎక్కడి?.. జైలుకా?
పోలీస్ ఆఫీసర్: ఇంకా నిద్ర మత్తు వద్దల్లేదనుకుంటా!
"స్క్వర్టల్" వాటర్ గన్ అటాక్ చేయ్!
ఆమె అలా చెప్పగానే, ఆమె పోకిబాల్ నుంచి వాటర్ పోకిమాన్ స్క్వర్టల్ వచ్చి వాటర్ గన్ అటాక్ చేస్తుంది.
మహేంద్ర: ఆ..... *గుడుగుడుగుడు*...
మొఖం మీద నీళ్లు కొట్టటంతో పూర్తిగా మేలుకుంటాడు.
పోలీస్ ఆఫీసర్: మెలుకువ వచ్చిందా?
మహేంద్ర:.. ఫుల్లుగా...
పోలీస్ ఆఫీసర్: ఇదిగో టవల్తో మొఖం తుడుచుకో! మనం షాప్కి బయలుదేరుతున్నాం.
మహేంద్ర: హా? నిజంగా?
పోలీస్ ఆఫీసర్: హ్మ్!
అని స్మైల్ చేస్తుంది.
@@@
మహేంద్ర మొఖం తుడుచుకొని ఆమెతో బయలుదేరుతారు.
మహేంద్ర: మరి.. ఐడి.. లైసెన్స్...
పోలీస్ ఆఫీసర్: అవన్నీ తర్వాత చూద్దాం గానీ~ జరిగింది చెప్తా విను.
నీ దెగ్గర ఉన్న బ్యాడ్జ్లు, నీ ఫోటోలు తీసి అన్నీ సిటీలలో, పక్క సిటీలలోని పోలీస్ స్టేషన్లకు పంపించాను.
అందరూ దొంగల లిస్ట్, డేటా మొత్తం గంట లోపల చెక్ చేసారు.
నీ మొఖం గానీ, నీ దెగ్గర ఉన్న బద్జులుగాని వాంటెడ్ లిస్టులో లేవు. కనీసం ఒక్కరూ నీ దెగ్గరున్న బ్యాడ్జ్లు దొంగలుంచబడ్డాయాని కంప్లేయింట్ ఇవ్వలేదు.
కాబట్టి ఇవి నీవే అయుంటాయని మేము కంఫర్మ్ చేసుకున్నాము.
మహేంద్ర: అహహహ... ముందే చెప్పను కదా? ఆఫీసర్.. నేను దొంగని కాను..
పోలీస్ ఆఫీసర్: కానీ! ఐడి లేకుండా, లైసెన్స్ లేకుండా బ్యాడ్జ్లు అమ్మడం చట్ట నిత్య నేరం.
అయినా,.. అసలు నీకు బ్యాడ్జ్లు అమ్మలానే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది?
వీటి కోసం జీవితాలే త్యాగం చేసే వాళ్ళు ఉంటారు తెలుసా?
అని ఆమె అడుగుతుంది.
మహేంద్ర ఏదొక అబద్దం చెప్పాలని ఆలోచిస్తూ ఏదోకట్లే అని అనుకుంటాడు.
మహేంద్ర:... నా పేరు మహేంద్ర. నేను ఒక అలుపెరుగని బాటసారిని..
ఎప్పుడూ ఒక అడవి నుంచి మరొక అడవి.. ఒక ఊరు నుంచి మరొక ఊరకి ప్రయానిస్తునే ఉంటాను..
ఎప్పటికయినా లెజెండరి పోకిమాన్ మాస్టర్ అవ్వాలన్నదే నా జీవిత లక్ష్యం.
ఓటమేరుగని వీరుడిగా పేరు పొందాలనేదే నా గోల్..
అలా చిన్న తనం నుంచి నాకు కనపడిన జింలలో పోటీ పడుతూ లెక్కలేనన్ని బ్యాడ్జ్లు సంపాదిస్తూ వచ్చాను..
కానీ.. ఒకరోజు.. ఒక పవర్ఫుల్ ట్రైనర్ చేతిలో నేను చిత్తుగా ఓడిపోయాను..
సహించడానికి కష్టంగా అనిపించినా నా ఓటమిని నేను అంగీకరించాను.
నా సిద్ధాంతం ప్రకారం నేను నా మొదటి బ్యాడ్జ్ నుంచి ఆఖరి బ్యాడ్జ్ వరకూ ఒక్కసారి కూడా ఓడిపోకూడదు.
ఓడిపోతే నా బ్యాడ్జ్లు విడిచి మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి..
అలా చేస్తానని మా నాన్నగారి దెగ్గర మాట తీసుకున్నాను.
అందుకే... ఓటమి ఎదురయ్యాక నా బ్యాడ్జ్లు అమ్మేసి ఆ డబ్బులతో నా జర్నీని మళ్ళీ కొనసాగించాలని అనుకుంటున్నాను..
అని చెబుతూ పోలీస్ ఆఫీసర్ను చూస్తాడు. ఆమె కల్లార్పకుండా మహేంద్రనే చూస్తూ ఉండుంటుంది.
మహేంద్ర: కొంపదీసి అబద్దం చెప్తున్నానని కనిపెట్టసిందా?... నాకిక దేత్తడి పోచమ్మ గుడే...
అని ఆలోచిస్తూ కంగారు పడుతాడు.