webnovel

5

ఓహో సూటిగా చూస్తూ మహేంద్ర ముందుకి అడుగులు వేస్తూ వస్తుంది.

ఓహో: క్యూ!.. క్యూ!.. (నేను చెప్పింది చచ్చినట్టు చేయాలి! లేకుంటే నిజంగానే చస్తావ్!)

అని బెదిరిస్తుంది. మహేంద్రకు వేరే దారి తెలీక పోవడంతో సరే అని తల ఊపుతాడు.

మహేంద్ర: నువ్వు చెప్పింది చచ్చినట్టు చేస్తా!.. దయచేసి నన్నేం చేయకు...

అని దన్నం పెడుతాడు.

ఓహో కోపం నుంచి ప్రశాంతంగా మారిపోతుంది.

ఓహో: క్యూ! క్యూ!.. (గుడ్ బాయ్! ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు.)

మహేంద్ర: హా?.... నాకేం తెలుసు?.. నువ్వేం చెప్తే.. అలానే...

ఓహో: క్యూ?.. క్యూ?!... (నీకు పోకిమాన్ మాస్టర్ ఎలా అవ్వాలో తెలీదా? నువ్వు అసలు మనిషివేనా? ఏలోకంలో నుంచి ఊడి పడ్డావేంటి?!)

మహేంద్ర:.....

ఓహో: క్యూ... క్యూ... (పోకిమాన్ మాస్టర్ అంటే.. తన బెస్ట్ ఫ్రెండ్ తో లోకం అంతా ప్రయానిస్తూ అరుదయినా కొత్త పోకెమోన్స్ పట్టుకొని, ఎవరూ సాధించలేని యోధులతో బాటిల్ చేసి, గెలిచి బ్యాడ్జ్లు సంపాదించి గొప్ప పేరుని సంపాదిస్తాడు! అతని పేరు వింటేనే లోకం గజాగజా వణికి పోవాలి! ఇతర పోకిమాన్స్ 'మాకు ఇలాంటి మాస్టర్ లేడే' అని కుళ్ళుకొని చావాలి! అదే పోకిమాన్ మాస్టర్ అంటే!!)

అని గొప్పగా స్పీచ్ ఇస్తుంది.

మహేంద్ర అశ్చర్యంతో చెప్పట్లు కొడతాడు.

ఓహో తన స్పీచ్ మెచ్చుకున్నందుకు గర్వపడుతుంది.

ఓహో: క్యూ!.. క్యూ!... (హిహిహి... పొగిడింది చాలు! ఇవన్నీ జరగాలంటే నువ్వు కష్టపడాలి! చూడటానికి పుల్లలా ఉన్నావ్! ఊదితేనే గాల్లో కొట్టుకు పోతావేమో.. నిన్ను చంపేసి ఇంకో మాస్టర్ని వెతుక్కోనా?...)

అని అంటూ ఆలోచిస్తుంది.

మహేంద్ర: అక్కర్లేద్దు!! నాకు పోకేమోన్స్ గురించి చాలా బాగా తెలుసు! పోకిమాన్స్ గురించి నేను చాలా చదివాను! నేను కష్టబడితే కచ్చితంగా పోకిమాన్ మాస్టర్ అవుతాను!!

దయచేసి... నన్ను.. చంపకు... ప్లీజ్....

అని బ్రతిమాలుతాడు.

ఓహో: క్యూ.... క్యూ~ (అంతగా అడుగుతున్నావు కనుక ఒప్పుకుంటున్న... సరేలే~ నువ్వే నా మొదటి మాస్టర్! నేనే నీ మొదటి పోకిమాన్! పదా! వెళ్లి ఈ లోకంలోని చరిత్రలో మిగిలి పోయేలా పేరు సాధిద్దాం!)

మహేంద్ర: ఓకే.. పోకిమాన్ మాస్టర్ అవ్వడానికి నా ప్రయాణం నేటితో మొదలు..

@@@@@

మహేంద్ర, ఓహోలు తర్వాత ఏం చేయాలో చాలా సేపు మాట్లాడుకుంటారు.

చీకటి పడుతుంది. మహేంద్ర పొద్దన్నుంచి ఏమీ తిని ఉండడు. ఆకలికి నీరసంగా కనిపిస్తాడు.

ఓహో: క్యూ? (నీకేమైనా జబ్బు ఉందా? అలా ఉన్నావ్?)

మహేంద్ర: అవును... ఆ జబ్బు పేరు ఆకలి... ఏం చేసినా ఈ జబ్బు శాశ్వతంగా దూరం అవ్వదు.. ఏమైనా తింటే.. కాసేపు ఆకలి తీరుతుంది అంతే...

అని నీరసంతో అంటాడు.

ఓహో: క్యూ.. (మనుషులు తినే భోజనాలు నాకు బాగా తెలుసు! ఇక్కడే ఉండు!)

అని చెప్పి వేగంగా ఎగురుకుంటూ వెళ్లి పోతుంది.

మహేంద్ర: హా.... పారిపోదామంటే... ఒంట్లో ఓపిక లేదే.... ఆహ్....

అని ఆలోచిస్తూ నెస్ట్ చుట్టూ చూస్తూ ఉంటాడు.

తనకు ఒక నీలి రంగు పోకేబాల్ కనిపిస్తుంది. దాన్ని చేతిలోకి తీసుకుంటాడు.

మహేంద్ర: ఇదే కదా.. నేను ఓహో మీదకు విసిరేసింది?..

ఇది... హా!.. గుర్తొచ్చింది!

ఇది సామాన్యమయిన పోకేబాల్ కాదు! మాస్టర్ బాల్!

ఈ మాస్టర్ బాల్ తో లెజెండరి పోకేమోన్ పడతారు. నేను చాలా ఎపిసోడ్స్ లో చూసాను.

అరుదుగా కనిపించడం వల్ల గుర్తుకు రాలేదు.

'ఆష్ కెచం' పోకేమోన్ మాస్టర్ అయినప్పుడు ఈ పోకేబాల్నే వాడుతూ ఉంటాడు.

మరేమో.. ఇవన్నీ.. పోకెమోన్ బ్యాడ్జ్లు.. పాపం.. ఎవరో కష్టపడితే వాళ్ళ నుంచి ఎత్తుకొని వచ్చేసింది.. వాళ్ళు ఎంత ఏడ్చి ఉండుంటారో ఏంటో?..

అని ఆలోచిస్తూ ఉండగా, సడెన్గా పై నుంచి కిందకు ఏదో పడుతుంది.

మహేంద్ర ఉలిక్కి పడుతాడు.

ఓహో: క్యూ.. (నీ కోసం భోజనం తెచ్చాను. గొనుక్కోకుండా తిను.)

మహేంద్ర: ఏంటిది?... ఇంతుంది?... హా?...

మహేంద్ర కళ్ళు పెద్దవి చేస్తాడు.

ఒక పెద్ద ఆకులో పండిన పనసకాయాలను తెస్తుంది.

మహేంద్ర: ఏ అడవి జంతువునో తెస్తావని అనుకున్నా... పనసకాయలు తెచ్చావా?..

ఓహో: క్యూ..? (నచ్చలేదా? జంతువునే తెమ్మంటావా?)

మహేంద్ర: అక్కర్లేదు. ఇదే చాలు. నాకు పనసకాయలంటే చాలా ఇష్టం. థాంక్స్!

అని చెప్పి ఒక పెద్ద పనసకాయను తీసుకుంటాడు.

మహేంద్ర: హి.... హీ.... ఈ.....

అతను ఎంత ప్రయత్నించినా దాన్ని రెండుగా చిల్చలేక పోతాడు.

ఓహో: క్యూ~ (నా లక్ష్యం కోసం ఏవేవో చేయాల్సొస్తుంది~)

ఓహో తన ముక్కుతో పనస కాయలను రెండుగా చీల్చి, పళ్ళను ఒక్కొక్కటిగా వేరు చేసి ఆకు మీద ఉంచుతుంది.

మహేంద్ర: అం... థాంక్స్...

అని చెప్పి పనసకాయలను తినడం మొదలు పెడుతాడు.

మహేంద్ర: యమ్మీ.... సూపర్ ఉన్నాయి... ఇదిగో! నువ్వు కూడా తిను.

అని చెప్పి, గింజలను వేరు చేసి ఓహోకు కొన్ని పనసకాయలను ఇస్తాడు.

ఓహో అతన్ని వింతగా చూస్తుంది.

మహేంద్ర: హ్మ్?.. వద్దా? నీకు ఇవి నచ్చవా?

ఓహో అతని చేతిలోని పనసకాయలను సంతోషంగా తీసుకోని మెల్లగా తింటుంది.

ఓహో: క్యూ!?... (ముందు నువ్వు తిను. నువ్వు కనుక ఆకలికి చనిపోతే ది బెస్ట్ లెజెండరీ పోకేమోన్ యొక్క మొదటి ట్రైనర్ ఆకలికి చనిపోయాడని లోకమే చెప్పుకుంటుంది. నాకు ఎంత అవమానం?!)

మహేంద్ర: హహహహ.... సరేలే... నువ్వు పనసకాయ నుంచి పళ్ళు ఒలిచి ఇవ్వు, నేను పళ్ళ నుంచి గింజలను వేరు చేసి ఇస్తాను. ఇద్దరం కలిసి తిందాం.

ఓహో: క్యూ~.. (నువ్వంతలా అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్న~)

అని చెబుతూ, సిగ్గు పడుతూ గర్వంగా ప్రవర్తిస్తుంది.

మహేంద్ర: హహహహ....

అలా వాళ్లిద్దరూ స్నేహితులుగా మారి వాళ్ళ జర్నీ మొదలు పెడుతారు.