webnovel

6

*రాత్రి 12:00 am*

మహేంద్ర నెస్ట్ లో ఓహో పక్కన పనుకొని ఉంటాడు. ఓహో అతన్ని పనుకుని ఉండగా గమనిస్తూ తలను పైకి ఎత్తి ఆకాశంలోకి చూస్తుంది.

ఓహో: క్యూ... (నేను మాస్టర్ పోకిమాన్ అవ్వడానికి మొదలయిన మొదటి రోజు ఇదే. నా లక్ష్యాన్ని ఏదోక రోజు సాధింది గమ్యానికి చేరుకుంటాను. నా మాస్టర్ తో కలిసే అది సాధిస్తాను..)

అని మనసులో ఆలోచిస్తూ మహేంద్రను చూస్తుంది.

*చల్ల గాలి వీస్తుంది*

ఓహో: క్యూ.. (నా మొదటి మాస్టర్.. కాబోయే పోకిమాన్ లెజెండరీ మాస్టర్..)

అని ఆలోచిస్తూ, చల్ల గాలి తగలకుండా మహేంద్ర పైన తన రెక్కలు పరుస్తుంది.

ఓహో: క్యూ.. (ఎప్పుడు తెల్లవారుతుందా.. అని ఆతృతగా ఉంది.)

అని ఆలోచిస్తూ మహేంద్రను ఆనుకొని నిద్రలోకి జారుకుంటుంది.

@@@@@@@

*తెల్లవారుతుంది*

*ఉదయం 6:30 am. అవుతుంది.*

ఎండ మండిపోతూ ఉంటుంది.

మహేంద్ర: హ్మ్.... చాలా.... వేడిగా ఉంది.....

అని గొనుక్కుంటూ కళ్ళు తెరిచి చూస్తాడు.

అతని చొక్కా మంటల్లో కాలుతూ ఉంటుంది.

మహేంద్ర: ఆ... మంట.... మంటలు... మంటలు....

అని గట్టిగా కేకలు వేస్తాడు.

ఓహో నిద్రలో ఉన్నప్పుడు తనకే తెలీకుండా శక్తికి అతని చొక్కా కాలిపోతుంది.

అతని కేకలు విని ఓహో టక్కున మేలుకుంటుంది.

ఓహో దిక్కులు చూస్తూ ఉంటుంది.

ఓహో: క్యూ? (ఏమైంది?)

మహేంద్ర: నిప్పు... నిప్పులు.... నిప్పు..... ఆ.....

అని కేకలు వేస్తూ నిప్పులు ఆర్పడానికి నెస్ట్ చుట్టురా బోర్లా దొర్లుతూ ఉంటాడు.

ఓహో: క్యూ....? (చిన్న నిప్పుకా అన్ని కేకలు వేసావ్?...)

అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది.

తన రెక్కలు గట్టిగా ఊపి "గస్ట్ అటాక్" చేస్తుంది.

నిప్పులన్నీ ఆరిపోతాయి. కాకుంటే మహేంద్ర గస్ట్ శక్తికి బోర్లా దొర్లుకుంటూ వెళ్లి నెస్ట్ చివరకు గుద్దుకుంటాడు.

మహేంద్ర: ఆ..... ముక్కు.. పగిలింది...

అని చెబుతూ ముక్కు రుద్దుకుంటాడు.

ఓహో: క్యూ!.. (మరీ అంత సెన్సిటివ్గా ఉంటే ఎలా? నా మాస్టర్ అంటే ఎలా ఉండాలి?)

మహేంద్ర: ఎలా ఉండాలి?

ఓహో: క్యూ..!! (సింహంలా ధైర్యంగా ఉండాలి!!)

మహేంద్ర: మరి నేనెలా ఉన్నాను?

ఓహో: క్యూ~~ (కాలికింద నలిగిన పుల్లలా ఉన్నావ్~~)

అని చెప్పి మొఖం తిప్పుకుంటుంది.

మహేంద్ర: అహు... అహు... అహు...

ఓహో: నసగడం ఆపి ప్రయాణనికి సిద్ధం అవు!

మహేంద్ర: ప్రయాణనికా? ఎక్కడికయినా వెళుతున్నావా?

ఓహో: వెళుతున్నావా కాదు వెళ్తున్నాం! నువ్వూ నేనూ ఇద్దరం మన జర్నీని ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్నాం!

మహేంద్ర: ఓ... అంటే ఇప్పుడు నేనేం చేయాలి?

ఓహో: క్యూ?.....!! (నేను పోకిమాన్నా? లేకా బేబీ సిట్టర్నా? అన్నీ నేనే చేయాలా?....)

అని ఆలోచిస్తూ, మహేంద్ర కాలిన చొక్కాని ముక్కుతో పట్టుకొని గాల్లోకి ఎగురుతుంది.

మహేంద్ర పక్షికి దొరికిన చేపలాగా గిలా గిలా కొట్టుకుంటూ ఉంటాడు.

మహేంద్ర: ఒసేయ్... నన్ను దింపే... నాకు ఎత్తంటే బహయమే.... కనీసం వీపు మీదన్నా ఎక్కించుకోయే.... చొక్కా కనుక చినిగి కింద పడ్డానో నా బాడీ పార్టులు ఏ దిక్కున పడుతాయో కూడా ఊహిండానికి భయంగా ఉందే... ఆ...

అని కేకలు వేస్తూ ఉంటాడు.

ఓహో: క్యూ...~~ (అయితే సరే~ నీ కోరిక నేనెందుకు కాదనాలి?)

అని చెప్పి మహేంద్రను గాల్లో వదిలేస్తుంది. అతను ఆకాశం నుంచి కిందకు పడుతూ ఉంటాడు.

మహేంద్ర: ఆ.... ఒసేయ్.... నన్ను దింపమన్నానే బాబూ... గాల్లో వదిలేయమనలేదు.... ఆ....

అని కేకలు వేస్తాడు.

ఓహో వేగంగా ఎగురుతూ వెళ్లి మహేంద్ర నీళ్లలోకి పడిపోక ముందు వీపు మీదకు పట్టుకుంటుంది.

మహేంద్ర కోతి పిల్లలా ఓహో వీపుని గట్టిగా పట్టుకుంటాడు.

ఓహో: క్యూ... (హహహహ...)

మహేంద్ర: నీకు నవ్వులాటగా ఉందా? నాకు ప్రాణం జోబీలోకి వచ్చేసింది!..

అని చిన్న పిల్లాడిలా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు.

@@@@@

కాసేపు తరువాత,

ఓహో ఒక మంచి నీటి కాలువ దెగ్గర అతన్ని దింపుతుంది.

మహేంద్ర వేప పుల్లతో పళ్ళు తోముకొని, మంచి నీటి కాలువ దెగ్గర బట్టలు ఉతుక్కొని ఆరేసి, అక్కడే స్నానం చేస్తాడు.

అతను ప్రశాంతంగా నీళ్లలో మునిగి తేలుతూ ఉండుంటాడు.

మహేంద్ర: హా..... నా జీవితంలో ఇంత ఇండిపెండెంట్గా ఎప్పుడు ఉండలేదు.. 

ఉంటే కోలేజ్కి పోయే వాడిని. లేకుంటే ఇంట్లో కూర్చొని ఎప్పుడూ ఫోన్ ఒత్తుకుంటూ ఉండే వాడిని..

హా... ఇక్కడ ఎంత హాయిగా ఉం...

దో!!!!!! ఆ......

అని గట్టిగా అరుస్తాడు.

అతను నీళ్లలో హాయిగా తేలుతూ ఉండగా ఒక "మేజిక్ కార్ప్" తన కొమ్ములతో మహేంద్ర డిక్కీని పొడుస్తుంది.

అతను నొప్పికి కుయ్యో మూర్రో అని అరుస్తూ నీటి నుంచి ఒడ్డుకు దూకుతాడు.

మహేంద్ర: ఆ... నా పిర్రల్ని ఏదో బొక్కేట్టేసింది.... ఆ...

అని పిర్రలు రుద్దుకుంటూ ఉంటాడు. మేజిక్ కార్ప్ నీటి ఒడ్డు దెగ్గర పడి చేపలా కదులుతూ ఉంటుంది.

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

..............

మేజిక్ కార్ప్ ఒక వాటర్ పోకిమాన్. అది పేరుకే పోకిమాన్. కానీ దేనికి పనికిరాదు. యూస్లెస్ పోకిమాన్ జాబితా లిస్ట్ అనేది ఉంటే మేజిక్ కార్ప్ పేరే ముందు ఉంటుంది. అందుకే ఈ పోకిమాన్ ని మాములు చేపలా వండుకొని తింటారు.

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

..............

ఓహో: క్యూ~~~ (చిన్ని చేప మీదా నీ ప్రతాపాలు? ముందు నిక్కర్ వేసుకో సూడలేకున్నాం~~~)

మహేంద్ర వేగంగా ప్యాంట్ వేసుకుంటాడు.

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

..............

మహేంద్ర: దినంకమ్మ! నీకు నా పిర్రలు అంత నున్నగా కనిపించాయా? లగెట్టుకొని వచ్చి బొక్కెట్టావ్? నిన్ను ఫ్రై చేసుకొని తింటా!

అని కోపంతో అరుస్తాడు.

మేజిక్ కార్ప్: మేజిక్... కార్ప్..... 😰

మేజిక్ కార్ప్కి ప్రాణ భయం కలుగుతుంది. భయంతో వేగంగా కదులుతూ ఉంటుంది.

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

*మేజిక్ కార్ప్*

..............

మేజిక్ కార్ప్: మేజిక్ కార్ప్!!!...

వెంటనే మేజిక్ కార్ప్ తెల్లగా మెరుస్తుంది.

మహేంద్ర: హా?.... ఏంటీ వెలుతురు?.... ఆహ్.....

అని కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుంటాడు.

"మేజిక్ కార్ప్" > "గ్యారడోస్" గా రూపాంత్రం చెందుతుంది.

మహేంద్ర: కొంప మునిగింది... కాదు... నా కొంప కొట్టుకు పోయింది... బాబోయ్... "గ్యారడోస్"... లగెట్టు ఓహో.....😱

గ్యారడోస్: గ్యారడోస్! (తలపడితే వదలనురోయ్!)

మహేంద్ర పరిగెత్తుతాడు. గ్యారడోస్ దాడి చేయడానికి వెంబడిస్తుంది.