బైరవ (పిల్లి) ఆమె పక్కనే నడుస్తూ వెళుతూ ఉంటాడు.
సవ్యసాచి: హిహిహిహి....
బైరవ (పిల్లి): నా ఖర్మ...
ఒక్క పూట అన్నం కోసం ఎదురుచూపులు...
అంటూ మైండ్లో పడుకుంటూ వెళుతూ ఉంటాడు.
సవ్యసాచి: బైరవ గారూ. వాకింగ్ చేయడానికి ఇది చాలా మంచి టైం కదా?
బైరవ (పిల్లి): *ష్....* నేను అందరి ముందు మాట్లాడలేను.
అని చిన్న గొంతుతో చెబుతాడు.
సవ్యసాచి: ఓకే. మనం ఇలా కలిసి వెళుతుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు.
అని అంటూ నవ్వుకుంటూ నడుస్తూ వెళుతూ ఉంటుంది.
బైరవ (పిల్లి): ఓహో! ఛాన్స్ దొరికిందని నన్ను నిజంగానే పిల్లిలా చూస్తున్నావా?!
అని మనసులో అనుకుంటూ ఉంటాడు.
####
అదే సమయంలో వెన్నెల అటుగా నడుస్తూ వెళుతూ ఉంటుంది.
దారిలో సవ్యసాచిని చూస్తుంది.
వెన్నెల: సవ్యసాచి?..
సవ్యసాచితో ఉన్న రెండు పిల్లుల్లో ఒకటిని గుర్తుపడుతుంది.
వెన్నెల: ఆ పిల్లి....
అని గమనిస్తూ సైంటిస్ట్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది.
"మనల్ని ట్రాకర్స్ తరుముతున్నారు!!
నా శాంపిల్ కూడా వాళ్ళ దెగ్గరే పోగొట్టుకున్నాను!!"
వెన్నెల: అంటే...
@@@@
*ప్రదేశం: జంతువుల క్లినిక్/ హాస్పిటల్.
సవ్యసాచి: హలో డాక్టర్ గారూ.
అని పలకరిస్తూ అతని దెగ్గరకు వెలుతుంది.
డాక్టర్: ఓహ్?! సవ్యసాచి?! నువ్వా? ఇంటి ఇలా వచ్చావ్?
అది కూడా ఈ టైంలో?
సవ్యసాచి: ఒకసారి వీడ్ని చెకప్ చేస్తారా డాక్టర్ గారూ.
అని అంటూ నల్ల పిల్లిని అతనికి చూపిస్తుంది.
డాక్టర్: హ్మ్....
అంటూ పిల్లిని చూసి పరీక్షిస్తుంటాడు.
సవ్యసాచి: తనకు నిన్నటి వరకూ ఒంట్లో బాలేదు. నాకు దిగులుగా ఉంది. అందుకే మీ దెగ్గరకు తీసుకొచ్చాను సార్.
డాక్టర్: హ్మ్... ఇలా టేబుల్ మీద ఉంచు.
సవ్యసాచి: సరే డాక్టర్ గారూ.
అని పనిలో ఉంటారు.
బైరవ (పిల్లి) మాత్రం దిక్కులు చూస్తూ బోర్ కొడుతోందని ఆలోచిస్తుంటాడు.
ఎదురుగా అల్మరాలో క్యాట్ ఫుడ్ డబ్బాలను చూసి టేబుల్ ఎక్కి కూర్చొని జొళ్ళు కార్చుకుంటూ తోక ఊపుతూ ఉంటాడు.
....