బైరవ చెప్పినట్టుగానే పిల్లి షాకుతో కదలకుండా గమ్మున కూర్చొని ఉంటుంది. కాకుంటే లైటుగా వణుకుతూ ఉంటుంది.
సవ్యసాచికి ఆ విషయం తెలీక నల్ల పిల్లి పారిపోకుండా సైలెంట్గా ఉందని మురిసిపోతుంది.
బైరవ (పిల్లి):...
సవ్యసాచి: ఒకసారి దీన్ని క్లినిక్కి తీసుకెళ్లి చూపిసద్దామా?
నువ్వు పరీక్షించావని తెలుసు.
కాకుంటే వెట్ కి కూడా చూపిస్తే మంచిదని అనిపిస్తుంది.
కావాలంటే నువ్వూ రా! కలిసి వెళ్ళొద్దాం.
అని ఆతృతతో అంటుంది.
బైరవ (పిల్లి):.... (కాసేపు వేరే ధ్యాసలో ఉండి ఆలోచిస్తూ)
వాట్!!!!!....
నీకు తోడుగా నేను రావాలా?!!!!
అస్సలు కుదరదు!!!
అని పెద్ద గొంతుతో అంటాడు.
సవ్యసాచి: హ? రావా? ప్లీస్..
అని క్యూటుగా అడుగుతుంది.
బైరవ (పిల్లి):....
లేదు..
నేను రానులే.
నువ్వే వెళ్ళు.
నీతో నేనెందుకు?
తోకలగా?!~
అని చెబుతూ సోఫా దెగ్గరకు వెళ్ళబోతాడు.
సవ్యసాచి: నాతో వస్తే అప్పలు కొనిస్తా!
అని చెప్పగానే బైరవ ఒక్కసారిగా ఆగిపోతాడు.
బైరవ (పిల్లి): అప్పలా?....
అప్పలు తినడానికి నేనేమైనా కుక్కనా? పిళ్లినా?
లేకుంటే 5 ఏళ్ళ బుడ్డోడినా?...
హ... మర్చిపోయా..
నేను పిల్లి శరీరంలో ఉన్నాను...
ఛీ! దీ₹మ్మ!!!
అని ఆలోచిస్తాడు.
సవ్యసాచి: చూస్తుంటే ఇంట్లో ఉన్న క్యాట్ ఫుడ్ ఖాళీ అయిపోయినట్టుగా ఉంది.
అని ఖాళీ ఫుడ్ బస్తా వైపు చూస్తుంది.
బైరవ (పిల్లి): అన్నీ నేనే తినేసానని లోకానికి తెలిస్తే లోకం నన్ను ఏమంటుందో?...
అంతా ఈ బండ పిల్లి శరీరం వల్లే!! వాటిని తిన్నది నేను కాదు బాబు!! నాకూ ఆ తిండికి ఎటువంటి సంబంధం లేదు..
అని ఆలోచిస్తూ అవమానంతో మొఖం తిప్పుకుంటాడు.
###
*ప్రదేశం: రోడ్
"వావ్..."
"క్యూట్"
అంటూ చాలా మంది కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు బైరవను (పిల్లిని) చూసి ఫోటోలు తీస్తూ ఉంటారు.
సవ్యసాచి నల్ల పిల్లిని పైటతో నడుముకి కట్టుకొని తీసుకోని నడుస్తూ వెళుతూ ఉంటుంది.
బైరవ (పిల్లి) ఆమె పక్కనే నడుస్తూ వెళుతూ ఉంటాడు.
సవ్యసాచి: హిహిహిహి....
బైరవ (పిల్లి): నా ఖర్మ...
ఒక్క పూట అన్నం కోసం ఎదురుచూపులు...
అంటూ మైండ్లో పడుకుంటూ వెళుతూ ఉంటాడు.