షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. మీ మేనేజర్ ఎవరో తెలుసుకోవచ్చా?
మహేంద్ర: మేనేజర్??
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): ఓ మై గాడ్!!
అతను షాక్ అయిపోతాడు.
°°
మహేంద్ర:???
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర..
మీరోక లెజెండరి పోకిమాన్ ట్రైనర్ అన్న విషయం మర్చిపోకండి.
మామూలు ట్రైనర్స్ కూడా వాళ్లు వాళ్ళ సపోర్టార్స్, మేనేజర్స్ మైంటైన్ చేస్తుంటారు.
రీసన్స్,
లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, వర్ల్డ్ వైడ్ పోకిమాన్ బాటిల్స్ చేయాలంటే కనీసం ఒక సపోర్టర్ అయినా ఉండి ఉండాలి.
సోలోగా ఈ పోకిమాన్ ప్రపంచంలో ఎత్తుకి ఎదగడం చాలా కష్టం. ఇతర కంపెనీస్ మిమ్మల్ని ఎదగనివ్వరు.
ఏదొక రకంగా అడ్డు పడతారు. సో, మీరు ట్రస్ట్ చేసే వ్యక్తిని మేనేజర్గా పెట్టుకుంటే అతనే మీ పర్సనల్ అండ్ ప్రైవేట్ వర్క్స్ దెగ్గరుండి చూసుకుంటాడు.
డు యు అండర్స్టాండ్?
మహేంద్ర: ఎస్ సార్. ఐ డు! ఫ్యూచర్లో కచ్చితంగా నాకొక మేనేజర్నీ పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు ఎవరూ పెద్దగా తెలీదు.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర.. నేను పాయింట్ కి వస్తాను.
మీరు, మీ పార్ట్నర్ ఇద్దరూ గొప్ప పేరునే సాధిస్తారు.
మీకు అభ్యంతరం లేకుంటే నేను మీ మేనేజర్ గా స్పాన్సర్ చేస్తాను.
మహేంద్ర: మీరు?.. మీకెందుకండీ శ్రమ...
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. నా కల ఓహో లాంటి లెజెండరీ పోకిమాన్స్ ను కళ్లారా చూడటం.
నా 50 ఏళ్ళ ఎక్స్పెరియన్స్ లో ఎప్పుడూ ఆ అదృష్టం నాకు కలగలేదు.
మీరు ఓకే అంటే మనం కలిసి పని చేద్దాం. మీరు కాంటెస్ట్స్ లాంటి వాటిలో లేదా ఇతర మానేజ్మెంట్స్ నేను దెగ్గరుండి చూసుకుంటాను.
మహేంద్ర: అది సరే సార్.. కానీ... దాని వల్ల మీకేంటి లాభం?..
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. హహహ...
మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు. మీకు మానేజర్గా ఉంటే మీతో పాటుగా నాకు కూడా లాభమే.
మీరు నేమ్, ఫేమ్ సంపాదిస్తే మీ మానేజర్గా నేను కూడా నేమ్, ఫేమ్ సంపాదిస్థాను.
మీకూ మీ పోకిమాన్స్ కి కావాల్సిన అవసరాలు అందచేయడంతో నేనూ నా రెసర్చ్ తిరిగి కొనసాగించవచ్చు!
నా రీసర్చులతో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మూడో వ్యక్తి అవసరం లేకుండా ఇతర పోకిమాన్స్ కాప్చర్ చేయొచ్చు!
మీరు ఒక స్థాయికి వచ్చాక మీ మానేజర్గా నేనూ పేరుని, డబ్బుని సంపాదించగలను.
సో, నేను నష్టంలో ఏమీ పడను.
అని స్ట్రెయిట్ ఫార్వార్డుగా చెప్తాడు.
మహేంద్ర: హ్మ్... ఆలోచిస్తే మిరిచ్చే ప్రపోసల్ మనిద్దరికీ ఆదాయం ఇస్తుంది..
ఓహో! నువ్వేమంటావ్? Dr. మెహ్ర మనకు ఇంతగా సహాయం చేస్తానని అంటున్నారు. ఓకే చెప్దామా? నీ అభిప్రాయం ఏంటి?
ఓహో: క్యూ! క్యూ! (నేను లెజెండరీ మాస్టర్ పోకిమాన్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేసినా నాకు ఓకే! నువ్వెలా అంటే అలా!!)
మహేంద్ర: ఓకే! ఓహో!! Dr. మెహ్ర! మీ ప్రపోసల్ మా ఇద్దరికీ ఇష్టమే! మీరు సరే అంటే మేమూ రెడీ!
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): థాంక్యూ Mr. మహేంద్ర. మీతో నా జర్నీ రీస్టార్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
అని షేక్ హ్యాండ్ చేస్తాడు.
మహేంద్ర: మాకు కూడా Dr. మెహ్ర.
అని షేక్ హ్యాండ్ చేస్తాడు.
@@@
ఇద్దరూ ఒక కాంట్రాక్టు రెడీ చేసుకోని వాళ్లు వాళ్ళ కండిషన్స్ రాసి సైన్ చేస్తారు.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. ఇక నుంచి మనం ఇద్దరం పార్ట్నర్స్!!
మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను ముందుంటాను.
మహేంద్ర: సార్ మీ లగ్గేజ్లు కొంత సేపు యూస్ చేస్కోవచ్చా?
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): అఫ్కోర్స్ Mr. మహేంద్ర. మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా యూస్ చేస్కోండి.
అని చెప్పి పెద్ద సైజ్ లగేజ్లు 5 ఇస్తాడు.
మహేంద్ర: వన్ సెకండ్!! ఇప్పుడే వస్తాను!!
అని చెప్పి లగేజ్లను తీసుకోని ఓహో తో బయటకు వెళ్తాడు.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర):??
మహేంద్ర ఓహో మీదకు ఎక్కి కూర్చుంటాడు.
ఓహో ఆ లగేజ్లను కాళ్ళతో పట్టుకొని వేగంగా ఎగురుకుంటూ వెలుతుంది.
***
మహేంద్ర ఓహో నెస్ట్ వైపు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటాడు.
కొన్ని నిమిషాల తరువాత,
కింద అడవిలో గ్యారడోస్ అటూ ఇటూ దారి తప్పి తిరుగుతూ ఉంటుంది.
మహేంద్రను గాల్లో ఎగురుతూ వెళ్లడం చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ వైపుగా పరుగులు తీస్తుంది.
గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (నాకోసం కాసేపు ఆగండ్రా బాబూ!!...)
అని పురుగులా వేగంగా పాకుతూ ఉంటుంది.
***
మహేంద్ర ఓహో నెస్ట్ని చేరుకుంటాడు.
మహేంద్ర: ఓహో! నీకు ఇక ఈ నెస్టుతో పని లేదు కదా?
ఓహో: క్యూ? (మన లక్ష్యం కోసం ఎలాగో మనం ఇద్దరం ప్రపంచం చుట్టాలి. కాబట్టి దీనితో నాకేం అవసరం లేదు)
మహేంద్ర: మంచింది! ఈ నెస్ట్ని అర చేయంత సైజ్ కి ముక్కలు ముక్కలుగా విరుస్తావా?
ఓహో: క్యూ! (క్షణంలో పని!)
మహేంద్ర: ఓకే! ఫస్ట్ ఈ బ్యాడ్జ్లు, వస్తువులు, పోకిబాల్స్ ని ఈ లగేజ్లలో నింపి ఆ తర్వాత వీటిని ముక్కలు చేసి నింపుదాం!!
ఓహో: క్యూ! (ఓకే!)