webnovel

14

మహేంద్ర: తనే నా బెస్ట్ ఫ్రెండ్! అండ్ నా పోకిమాన్! ఓహో!!

అని చెప్తాడు. ఓహో అతని పక్కన నిలబడి "క్యూ" అని కూస్తుంది.

షాప్ ఓనర్: నేను ప్రాణాలతో ఉండగా లెజెండరీ పోకిమాన్ ఓహోని చూస్తానని అనుకోలేదు..

అని అశ్చర్యంలో చెప్తాడు.

°°°

అతను కళ్లద్దాలు తీసి తుడుచుకొని తొడుక్కుంటాడు.

షాప్ ఓనర్:.. నేను చూస్తుంది భ్రమ కాదన్నమాట..

ప్లీస్ లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం...

అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇద్దరూ అతన్ని ఫాలో చేస్తారు.

షాపులో ఒక సీక్రెట్ ప్లేసులోకి తీసుకెళ్తాడు.

అతని గది నిండా రకరకాల పరిశోధనల పేపర్స్, పిక్చర్స్ గోడలకు అతికించి ఉంటాయి.

ఎటు చూసినా షెల్ఫ్స్, అందులో ప్రాచీన వస్తువులు భద్రంగా దాచి ఉంటాయి.

షాప్ ఓనర్: ఇలా రండి. కూర్చోండి. Mr. మహేంద్ర.

అని మర్యాదగా పిలవడం మొదలుపెడతాడు.

ఓహో, మహేంద్ర కొత్త ప్రోబ్ల్మ్స్ ఎందుకులే అని అనుకోని, సరే అని సైలెంట్గా కూర్చుంటారు.

షాప్ ఓనర్: mr. మహేంద్ర, నేనొక రిజర్చేర్ని. నా పేరు Dr. మెహ్ర.

మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

అని చెప్పి హ్యాండ్ షేక్ చేస్తాడు. మహేంద్ర అతన్ని ఫాలో అవుతాడు.

మహేంద్ర: మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది Dr. మెహ్ర.

అని హ్యాండ్ షేక్ చేసి, ఇద్దరూ సోఫాలో ఎదురుదురుగా కూర్చుంటారు.

ఓహో మహేంద్ర పక్కన సైలెంట్గా కూర్చొని ఉంటుంది.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): మిమ్మల్ని మిస్ అండర్స్టాండ్ చేసుకున్నందుకు ఐమ్ సో సోరీ.

మీలాంటి టాలెంటెడ్ పోకిమాన్ ట్రైనర్ ని కలవటం నా అదృష్టం.

మీరు ఓహో ని కాప్చర్ చేశారంటే చాలా అధ్బుతమైన విషయం.

ఓహో ఒక లెజెండరీ పోకిమాన్. జీవితంలో ఒక్క సారైనా ఓహో నీడను అయినా చూడాలని కోరుకునే వాళ్లలో నేనూ ఒకడిని.

నా కల మీ వల్ల నిజమవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.

మహేంద్ర: మీ పొగడ్తలకు చాలా థాంక్స్ సార్. బట్.. దయచేసి మా గురించి బయట వాళ్లకు చెప్పకండి.

మాకంటూ ఒక లక్ష్యం ఉంది. మా ఇద్దరి గురించి బయట ప్రపంచానికి తెలిస్తే మాకు కుంచం ప్రాబ్లెమ్ అవుతుంది.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): ఐ కెన్ అండర్ స్టాండ్ mr. మహేంద్ర.

మీ స్కిల్స్, టాలెంట్స్ ప్రపంచం చూడాలని అనుకుంటున్నారు. కానీ పాపులరిటీ మీ గోల్ కి అడ్డురాకూడదని అనుకుంటున్నారు.

మీ లాంటి లెజెండరీ ట్రైనర్స్ ని కలవడం నాలాంటి రీసెర్చర్కి జీవితంలో ఒక్కసారి దొరికే ఛాన్స్.

అందుకే కుంచం ఎక్సైట్ అవుతున్నాను.. కుంచం కాదు! చాలా ఎక్సైట్ అవుతున్నాను.

అని చెబుతూ నర్వస్ గా ఫీల్ అవుతాడు.

మహేంద్ర: హహహ....

అని నవ్వుతూ తల గోక్కుంటాడు.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): మీరేమనుకోనంటే మీ పోకిమాన్ ని ఒకసారి దెగ్గరి నుంచి చూడొచ్చా? ప్లీస్?

మహేంద్ర పక్కకు తిరిగి చూస్తాడు.

మహేంద్ర: ఓహో? నీకు ఓకేనా?

ఓహో: క్యూ! (సరే!)

షాప్ ఓనర్ (Dr. మెహ్ర):....?

మహేంద్ర: ఒకే Dr. మెహ్ర. ఓహోకి ఏం ప్రాబ్లెమ్ లేదంట.

అని చెప్తాడు.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): *స్మైల్స్* థాంక్యూ mr. మహేంద్ర.

అని చెప్పి పైకి లేచి ఓహోని పరీక్షిస్తాడు.

ఓహో చుట్టూ తిరిగి తన రెక్కలు, తోక, కళ్ళు, ముక్కు,... మొత్తం గమనిస్తాడు.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): హ్మ్.. ఓహో నువ్వు చాలా హెల్తీగా అండ్ ఫిట్టుగా ఉన్నావ్. ఐమ్ సో హ్యాపీ.

అని చిన్నగా నవ్వుతాడు.

ఓహో: క్యూ! (థాంక్స్ రా! సోడా బుడ్డి!)

మహేంద్ర: అహహహ... ఓహో మీకు థాంక్స్ చెప్తోంది.... అహహహ....

అని మొఖం దాచుకొని నవ్వుతాడు.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): హహహ... ఓహో నాకు థాంక్స్ చెప్తుందా? ఐమ్ సో హ్యాపీ. ఓహో.

Mr. మహేంద్ర. మీ మేనేజర్ ఎవరో తెలుసుకోవచ్చా?

మహేంద్ర: మేనేజర్??

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): ఓ మై గాడ్!!

అతను షాక్ అయిపోతాడు.