webnovel

18

మేజిక్ కార్ప్ గా ఉన్నప్పుడు భరించిన అవమానాలు, పడిన మాటలు, సాహించిన తిట్లు, దెబ్బలు అన్నీ తలచుకుని దిగులు పడుతాడు.

మహేంద్ర: గ్యారడోస్... ప్లీస్.. ఆత్మ విశ్వాసం వదలొద్దు!!...

అని మనసులో అనుకుంటాడు.

గ్యారడోస్ నిదానంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది.

***

*ఒరిజినల్ వర్ల్డ్*

మహేంద్ర కూడా హాస్పిటల్ బెడ్డు మీద పడుకొని ఉంటాడు.

అతని గుండె చాలా స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది.

మహేంద్ర పేరెంట్స్: మహి.. ప్లీస్.. మేలుకోరా..

అని మనసులో అనుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటారు.

•••

*మహేంద్ర ఉన్న ప్రపంచం*

అతను రాత్రంతా మేలుకొని గ్యారడోస్ పక్కనే కూర్చొని తనని చూసుకుంటూ ఉంటాడు.

గ్యారడోస్ హార్ట్ బీట్ స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది.

మహేంద్ర రెండు రోజులుగా నిద్ర పోకుండా గ్యారడోస్ పక్కనే ఉండి మంచి చెడులు చూసుకుంటూ ఉంటాడు.

గ్యారడోస్ తల మీద చేతిని ఆనిస్తూ మెల్లగా తడుముతూ ఉంటాడు.

మహేంద్ర: నీ బాడీ మంచి కండిషన్లో లేదని తెలిసి కూడా నా కోసం ఇంత దూరం వచ్చావా?..

ఏం?.. ఎందుకు?..

చూడు నీ పరిస్థితి ఎలా అయిపోయిందో!!...

ఇదంతా నా వల్లే...

నేను నిన్ను ఇగ్నోర్ చేయకుండా ఉండి ఉంటే నువ్వు ఇలా అయుండే వాడివి కావు..

అని చెపుతూ కన్నీళ్లు కారుస్తూ గ్యారడోస్ని కౌగిలించుకుంటాడు.

ఓహో అతని మాటలు విని దీర్గంగా ఆలోచిస్తుంది.

ఓహో పోకిబాల్ నుంచి బయటకు వస్తుంది.

ఓహో: క్యూ!.. (ఏడుస్తే వాడు లేస్తాడేంటి?! అలా అయితే హాస్పిటల్లు ఎందుకు? ఏడుస్తూ ఉంటే సరిపోదా?! కాబట్టి ఏడుపు ఆపు!!)

అని చిరాకుగా చెబుతుంది.

మహేంద్ర: హ్మ్..

అంటూ కళ్ళు తుడుచుకుంటాడు.

ఓహో అడుగులు వేస్తూ వెళ్లి గ్యారడోస్ పక్కన నిలబడుతుంది.

ఓహో: క్యూ!.. (హీలింగ్!!)

అంటూ హెలింగ్ పవర్ని గ్యారడోస్ పైన ఉపయోగిస్తుంది.

మహేంద్ర: హీలింగ్?... నువ్వు హీలింగ్ చేయగలవా?...

అని అశ్చర్యంతో చూస్తాడు.

గ్యారడోస్ ఒంటి మీదున్న గాయాలు మెల్లమెల్లగా మాయం అవుతూ నయం అయిపోతాయి.

మహేంద్ర మొఖం సంతోషంతో వెలిగిపోతుంది.

మహేంద్ర: గ్యారడోస్!! గ్యారడోస్!!!! పైకి లే!!! గ్యారడోస్!!!!!

అని పిలుస్తూ ఉంటాడు. కానీ గ్యారడోస్ లేవదు.

మహేంద్ర దిగులుతో బిగుసుకుపోతాడు.

మహేంద్ర: లేదు... లేదు... గ్యారడోస్... గ్యారడోస్??... తను లేవట్లేదు...

ఇదంతా నా వళ్లే... నా వల్లే... వీడు ఇలా అయిపోయాడు...

అని అంటూ తల పట్టుకొని కూర్చుంటాడు.

ఓహో: క్యూ? (హ్మ్? లేవడేంటిడు?)

అని దెగ్గరగా చూస్తుంది. గ్యారడోస్ మెల్లగా కళ్ళు తెరిచి చూసి మూసుకోవడం ఇద్దరూ గమనిస్తారు.

మహేంద్ర: హా?... గ్యారడోస్?... నువ్వు బ్రతికే ఉన్నావా?..

అని ఆలోచిస్తాడు.

గ్యారడోస్ కళ్ళు గట్టిగా మూసుకొని నటిస్తూ ఉంటుంది.

మహేంద్ర తనని అర్ధం చేసుకుంటాడు. అతని పెదాల మీద చిన్నగా నవ్వు వస్తుంది.

మహేంద్ర: హా.. అబ్బా! ఇప్పుడేం చెయ్యను? గ్యారడోస్ మెలుకునేలా లేడే!?

నాకు ఇంకో దారి కనిపించట్లేదు. పదా ఓహో! మనం వీడ్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం.

అని యాక్టింగ్ చేస్తూ అంటాడు.

ఓహో: క్యూ! (సరే! పదా! వదిలేసి పోదాం! వీడి వల్ల మనకి టైం బొక్క!!)

అని మహేంద్ర యాక్టింగ్ని ఫాలో చేస్తుంది.

ఓహో గ్యారడోస్ని మొఖంలో మొఖం పెట్టి చూస్తుంది.

ఓహో: క్యూ!.. (రే! బెప్పం! ఇప్పుడు నువ్వు లేవలేదనుకో! నిన్ను గుటుక్కున మింగేస్తా!! యాక్టింగ్ ఆపి పైకి లే!!)

అని గుర్రుమని చూస్తుంది.

గ్యారడోస్ ఒళ్ళంతా చమటలు పట్టేస్తాయి. భయంతో గడ గడా వణుకుతూ ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది.

గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (నేను లేసేస్తే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతారని అలా నటించాను.. ఐమ్ సోరీ...)

అని తల దించుకుంటుంది.

మహేంద్ర: హహహ...

అని నవ్వుతాడు. అతని కళ్ళకి గ్యారడోస్ ఒక మంస్టర్ లా కాకుండా ఒక క్యూట్ బేబీలా కనిపిస్తుంది.

మహేంద్ర గ్యారడోస్ తలను నిమురుతాడు.

మహేంద్ర: గ్యారడోస్. నీకు మాతో రావడం ఇష్టమేనా?

మాలో ఒకడిగా ఉంటావా? నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ లా చూసుకుంటాను.

అని గ్యారడోస్ తల నిమురుతూ చెబుతాడు.

గ్యారడోస్ కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి.

గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (వస్తాను! నీతో వస్తాను! బయ్యా కి తోడుగా ఉంటూ నిన్ను జాగర్తగా చూసుకుంటాను!)

అని ఆనందంతో ఏడుస్తూ మహేంద్రను కౌగిలించుకుంటాడు.

ఓహో: క్యూ!? (అరె సాలే! ఎవడిని బయ్యా అంటున్నావ్?! నీ చేత బయ్యా పిలిపించుకున్నానని ఎవరికయినా తెలిస్తే నా పరువు పోద్ది!! ఎక్కడా వాగకు!)

అని విసుక్కుంటాడు.

గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (అలా అనొద్దు బయ్యా... నాకు నువ్వు తప్పా ఎవరున్నారు!?..)

అని ఏడుస్తూ ఓహోని కౌగిలించుకోడానికి పోతాడు.

ఓహో: క్యూ!!! (పోరా!! తేడాగా!!! నాకు మండితే నిన్ను తగలెట్టేస్తా!!)

అని వెనక్కి జరిగి విసుక్కుంటాడు.

గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (మాస్టర్.. బయ్యా చూడు ఏమంటున్నాడో!.. ఐ హార్టు!.... బుంగమూతి పెడతా!!)

ఓహో: క్యూ!! (ఓరినీ ఏసాలో!!.. చాలా కతలు ఉన్నాయి నీలో! కమల్హాసన్!)

మహేంద్ర వాళ్ళిద్దరినీ చూసి పక పకా నవ్వుకుంటాడు.

మహేంద్ర: హహహ...

Dr. మెహ్ర వాళ్ళను కిటికీ లోనుంచి చూసి ఆనందపడుతాడు.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): నా బాబు కనుక ప్రాణాలతో ఉండుంటే అచ్చం తనలాగే ఉండే వాడేమో?..

అని ఆలోచిస్తాడు.