ఓహో గర్వంగా తల ఎత్తి పోసులు కొడుతుంది.
అప్పుడే తలుపు బయట నుంచి సౌండ్స్ వినిపిస్తాయి.
బయటకు వెళ్లి చూడగా...
***
మహేంద్ర:.... గ్యారడోస్?... నువ్విక్కడేం చేస్తున్నావ్?..
అని అశ్చర్యంగా చూస్తూ అడుగుతాడు.
గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (హా?.. ఎండి చేపలు కొందామని వచ్చాలే!! నీ!!!.. నీ కోసమే వచ్చానురా!! హా... మీ ఇద్దరి వల్ల నా ఒళ్ళు హూనం అయిపొయింది... ఆ... శాడిస్తులారా..)
అని తిడుతూ స్పృహ తప్పి పడిపోతుంది.
ఓహో, మహేంద్రలు ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటారు.
మహేంద్ర: నిజం చెప్పూ.. మన వెంటపడుతుంటే నువ్వు వీడ్ని చూసి కూడా పట్టించుకోలేదు కదా?
ఓహో: క్యూ!? (దూరం నుంచి చూస్తే పురుగనుకున్నా. అది వీడా?..
అని చూపు తిప్పుకుంటుంది.
మహేంద్ర: ఓహో... 😮💨
••••
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. మనం తనకి వైద్యం చేయటం ఇంపార్టెంట్! లేకుంటే...
మహేంద్ర: అర్ధమయింది సార్! కానీ.. ఓహోని బయటకు తీసుకెళ్లితే అనవసరంగా చాలా అటెంషన్ వస్తుంది.
మనిద్దరమూ వీడ్ని మోసుకొని వెళ్లడం కుదరదు...
అంబులెన్సు పిలవాలంటే అది వచ్చే లోపు టైం పట్టుద్ది..
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. మీ పోకిబాల్ లో పట్టుకొని తీసుకెళ్లండి.
మహేంద్ర: కానీ...
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. టైం లేదు!!
ఒక పోకిమాన్ ట్రైనర్ యొక్క ముఖ్యమైన భాద్యత మిమ్మల్ని నమ్ముకున్న పోకిమాన్ని ఎప్పుడూ అబాండన్ చెయ్యకూడదు.
పోకిమాన్ని మనలో ఒకరిగా చూడాలి! సహాయం చేయాలి!
అని సీరియస్ గా చెప్తాడు.
మహేంద్ర:...
అతని చూపు గ్యారడోస్ మీద పడుతుంది.
ఓహో: క్యూ! (సరేలే!~ వాడ్ని కూడా మనతో ఉండనీలే~ బరువులు మోయడానికి పనికొస్తాడు.)
అని పట్టించుకొనట్టు నటిస్తూ చెప్తుంది.
మహేంద్ర: ఓకే!
అని చెప్పి ఒక డ్రాగన్ బాల్ని చేతిలోకి తీసుకోని గ్యారడోస్కి తాకిస్తాడు.
గ్యారడోస్ అతని పోకిబాల్ లోకి వెళ్లి కాప్చర్ అవుతుంది.
మహేంద్ర: నా రెండవ పోకిమాన్..
అని చిన్నగా నవ్వుతాడు.
@@@
గ్యారడోస్కి వైద్యం చేయిండానికి ఇద్దరూ పోకిమాన్ సెంటర్కి వెళ్తారు.
నర్స్ జయ: హలో! మీకు ఏమైనా హెల్ప్ కావాలా?
అని ఫ్రెండ్లీగా అడుగుతుంది.
మహేంద్ర: హై మేడం! నా పోకిమాన్ బాగా గాయపడింది! ప్లీజ్ తనకు వైద్యం చేస్తారా?!
అని కంగారు పడుతూ అడుగుతాడు.
నర్స్ జయ: తప్పకుండా! మీ పోకిమాన్ బాధ్యత నాకు వదిలేయండి!
అని చెప్పి గ్యారడోస్ పోకిబాల్ తీసుకోని ICU లోకి వెలుతుంది.
మహేంద్ర, Dr. మెహ్ర ఇద్దరూ డోర్ బయట వెయిట్ చేస్తుంటారు.
°°°
కాసేపు తరువాత,
ICU లైట్ ఆఫ్ అవుతుంది. నర్స్ జయ బయటకు వస్తుంది.
ఇద్దరూ హడావిడిగా ఆమె దెగ్గరకు వెళ్తారు.
మహేంద్ర: మామ్! తనకు ఏం కాలేదు కదా?
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): నర్స్ జయ. గ్యారడోస్ హెల్త్ ఎలా ఉంది?..
నర్స్ జయ:... నా చేతనైనది నేను చేశాను. 24 గంటలు గడిస్తే తప్పా ఏం చెప్పలేను..
అని చెప్పి వెళ్ళిపోతుంది.
మహేంద్ర నడుచుకుంటూ వెళ్లి విండోలో నుంచి గ్యారడోస్ను చూస్తాడు.
గ్యారడోస్ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంటుంది. చాలా నిదానంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. తన ఒంటి నిండా చాలా కట్లు కట్టి ఉంటాయి.
మహేంద్ర అద్దం మీద చెయ్యి పెట్టి దిగులుగా చూస్తాడు.
మహేంద్ర: గ్యారడోస్...
అతనికి గ్యారడోస్ చెప్పిన గతం గుర్తొస్తుంది.
మేజిక్ కార్ప్ గా ఉన్నప్పుడు భరించిన అవమానాలు, పడిన మాటలు, సాహించిన తిట్లు, దెబ్బలు అన్నీ తలచుకుని దిగులు పడుతాడు.
షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర...
అని దిగులు పడుతూ మహేంద్ర భుజం మీద తడుతూ ధైర్యం చెప్తాడు.
మహేంద్ర: గ్యారడోస్.. ప్లీస్.. మేలుకో..
గ్యారడోస్ నిదానంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది.