webnovel
avataravatar

20

ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేస్తారు.

***

షాప్ ఓనర్ (Dr. మెహ్ర) మహేంద్ర బ్యాగ్ ను కొన్ని సామాన్లతో నింపి ఇస్తాడు.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. ఇందులో మీ స్లీపింగ్ బ్యాగ్, తినడానికి డ్రై ఫుడ్, ఫస్ట్ ఎయిడ్..... లాంటివి అన్నీ సర్ది పెట్టాను.

మీ పోకిబాల్స్, పోకేడెక్ కూడా అందులోనే ఉన్నాయి.

మీరు 6 పోకిమాన్లు కాప్చర్ చేసాక 7వ పోకిమాన్ నా ల్యాబ్కి తెలిపోర్ట్ అవుతాయి.

నేను వాటిని జాగర్తగా చూసుకుంటాను.

అప్పుడప్పుడు మీరు నాకు వీడియో, ఆడియో కాల్ చేస్తూ ఉండండి.

ఏ ప్లేస్ లో ఎలాంటి పోకెమోన్స్ ఉంటాయో నా డేటా మొత్తం ఈ పోకేడెక్ లో ఉన్నాయి.

మీకు చాలా యూస్ అవుతుందని భావిస్తున్నాను.

మీ బ్యాంక్ కార్డు, ఐడి, లైసెన్స్ అన్నీ ఈ పోకేడెక్ లో ఉన్నాయి.

సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా యూస్ చెయ్యొచ్చు. దీన్ని పోగొట్టుకోవద్దు.

........

అని ఎన్నో జాగర్తలు చెప్తూ ఉంటాడు.

మహేంద్ర: చాలా థాంక్స్ Dr. మెహ్ర. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను! ఇక వెళ్లి రానా?!

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర.... హ్మ్! జాగర్తగా వెళ్లి రండి.

అని నవ్వుతూ టాటా చెప్తాడు.

మహేంద్ర వెళుతూ వెనక్కి తిరిగి చూసి స్మైల్ చేస్తాడు.

మహేంద్ర: ఈ లోకానికి వచ్చాక చాలానే జరిగాయి.

ఎక్కడో ఉండే నేనూ.. పోకిమాన్ మాస్టర్ అవ్వడానికి ప్రయాణం మొదలుపెట్టాను.

నాకు చాలా ఎక్సైటింగా ఉంది. ఈ జర్నీ ఎలా ఉండబోతుందో..

°°°°

మన హీరో పోకిమాన్ మాస్టర్ అవుతాడా?

కాలమే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి..

.....

మన హీరో అడవిని చేరుకొని మెల్లగా అడుగులు వేస్తూ వెళుతూ ఉంటాడు.

మహేంద్ర: ఓహో! గ్యారడోస్! ఇద్దరూ బయటకు రండి!

అని అనగానే ఇద్దరూ ఒకేసారి బయటకు వస్తారు.

ఓహో: క్యూ? (ఎక్కడికెళ్తున్నాం?)

గ్యారడోస్: గ్యార? (నాదీ అదే ఆలోచన!)

మహేంద్ర: హ్మ్.. పోకేడెక్ లో చూద్దాం.

అతను పోకేడెక్ ఓపెన్ చేస్తాడు.

మహేంద్ర: పోకేడెక్! నా లొకేషన్ చూపించు!

పోకేడెక్: లొకేషన్ = బుజ బుజ నెల్లూరు. తహసీల్ / మండల్ : నెల్లూర్.

అని లొకేషన్ ఫోటో చూపిస్తుంది.

మహేంద్ర: ఓకే గైస్! ఈ మ్యాప్ ప్రకారం మనం నెల్లూరులో ఉన్నాం.

ఇప్పుడు చెప్పండి! మన జర్నీ ఎటు నుంచి స్టార్ట్ చేద్దాం?

ఓహో: క్యూ! (తిరుపతికి వెళ్దాం! అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పోకిమాన్స్ ఉంటాయి. నువ్వు కొత్త విషయాలు కూడా చూసి నేర్చుకోవచ్చు!)

గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (పెన్నా నది వైపు పెళ్దాం! అక్కడ చాలా వాటర్ పోకిమాన్స్ ఉంటాయి.

ఓహో: క్యూ? (నువ్వు ఒక్కడివే బరువంటే నీకు తోడుగా ఇంకోడు కావాలా?)

గ్యారడోస్: గ్యార! గ్యార! (వాటర్ పోకిమానే బెస్ట్!! బాయ్య!)

ఓహో: క్యూ! (నీకు ముందే చెప్పా! నన్ను అలా పిలవొద్దని!! బాయ్య ఏంట్రా కుయ్యా!!)

అని కోపంగా చూస్తుంది.

గ్యారడోస్ వేగంగా పాక్కుంటూ వెళ్లి మహేంద్ర వెనుక దాక్కుంటాడు.

ఓహో: క్యూ?! (ఈ తేడా గాడికి నువ్వు సపోర్టా?!)

అని గుర్రుమని చూస్తుంది.

మహేంద్ర: అహహహ.... మనలో మనకి గొడవలెందుకు చెప్పండి?

మన లక్ష్యం మంచి పోకిమాన్స్ కాప్చర్ చేసి పోకిమాన్ మాస్టర్ అవ్వడమే కదా?

అలాంటప్పుడు, అది ఏ టైప్ పోకిమాన్ అయితే ఏంటి?

అని కవర్ చేసుకుంటూ అంటాడు.

ఓహో మొఖం తిప్పుకుంటుంది.

ఓహో: క్యూ! (అది కూడా నిజమేలే!! ఏ పోకిమాన్ అయినా పట్టుకో! కానీ వీడి లాంటి తేడా గాడ్ని మాత్రం పెట్టుకోకు! నాకు చిరాకు!!)

గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (ఏంటి బాయా? అలా అంటున్నావ్? మనం ఫ్రెండ్స్ కదా?)

ఓహో: క్యూ! (ఎల్లేహే! గొంగళి పురుగా!)

అని చూపు తిప్పుకుంటుంది.

గ్యారడోస్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.

గ్యారడోస్: గ్యార!!!! (బాయా నన్ను గొంగళి పురుగంటున్నాడు..)

అని ఏడుస్తాడు.

మహేంద్ర: ఓరి బాబోయ్!... ఏడువకురా!!!

ఓహో మాటలు తప్పుగా అర్ధం చేసుకోకు!!

గొంగళి పురుగంటే..

నువ్వు ఎప్పటికయినా సీతాకోక చిలుకలా అందంగా రూపం మారాలని ఓహో గొంగళి పురుగుతో పోలుస్తున్నాడు..

తనని అర్ధం చేసుకో!!

అని కవర్ చేస్తూ గ్యారడోస్ని ఓదారుస్తాడు.

గ్యారడోస్: గ్యారా?! (నిజంగా?)

అని మెల్లగా ఏడుపు ఆపుతుంది.

మహేంద్ర: నువ్వు నా బెస్తు ఫ్రెండు!!! నీతో అబద్దం చెప్తానా?? అహహహ...

అని నవ్వుతో కవర్ చేసుకుంటాడు.

గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (అవును కదా!! మనం బెస్తు ఫ్రెండ్స్!! బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడూ అబ్బద్దాలు చెప్పరు!!)

అని సంతోషంతో మెలికలు తిరుగుతూ ఉంటాడు.

ఓహో: క్యూ! (ఇలాంటి బుర్ర తక్కూ వెధవ ఎలా బ్రతుతాడో ఏంటో..😮‍💨)

అని చిన్న గొంతుతో అంటుంది.

మహేంద్ర: ఫుఫుఫు... నిజం చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్స్ నోరు తెరిస్తే అబద్దాలే వాగుతూ ఉంటారు! హహహహ....

అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటాడు.

గ్యారడోస్ ఉత్సాహంగా గొంగళి పురుగులా చుట్టూ తిరుగుతూ సీతాకోక చిలుకలా ఎగిరే డాన్స్ వేస్తూ ఉంటుంది.

మహేంద్ర: అమాయకుడు.

అని మనసులో అనుకుంటాడు.

ఓహో: క్యూ! (ఎర్రి పూస్..)

అని మనసులో అనుకుంటాడు.

ఓహో, మహేంద్ర తన ఫన్నీ డాన్స్ ను చూసి నవ్వుకుంటారు.