webnovel

22

ఆమె గింజుకుంటూ ఉందని, చేత్తో నోరు మూసేసి దాక్కుంటాడు.

అప్పుడే ఎవరో అటుగా వెళుతూ ఉన్నట్టుగా నీడ కనిపిస్తుంది.

పర్వీన్: ఉమ్మ్.... ఉమ్మ్.... ఉమ్మ్...

అని గింజుకుంటూ పర్వీన్ అరవడానికి ప్రయత్నం చేస్తుంది.

కానీ ఆ నీడ దూరంగా వెళ్ళిపోతుంది.

పర్వీన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆమె భయంతో గడగడా వణుకుతూ ఉంటుంది.

ఆ అబ్బాయి తనను గట్టిగా పట్టుకొని కింద పడేసి, పైకి ఎక్కుతాడు.

"ఎంత పొగరు నీకు! నన్నే రిజెక్ట్ చేస్తావా?! ఇప్పుడు నిన్నెలా నా చుట్టూ తిప్పుకుంటానో చూడు!!"

వాడు ఒక చేత్తో ఆమె నోటిని గట్టిగా మూసి, మరో చేత్తో హడావిడిగా ప్యాంటు బెల్టుని తీస్తూ ఉంటాడు.

పర్వీన్: ఉమ్మ్మ్.... ఉమ్మ్.... ఉమ్మ్మ్...

అని ఏడుస్తూ, గింజుకుంటూ ఉంటుంది.

అప్పుడే ఎవరో రాయిచ్చుకొని వాడి తలను గురిపెట్టి కొడతారు.

వాడికి బలంగా తగలటంతో దెబ్బ నుంచి రక్తం కారుతుంది.

తల పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అదే అవకాశంగా తీసుకోని పర్వీన్ అక్కడి నుంచి పారిపోతుంది.

@@@

ఏడుస్తూ వెళ్లి ఒక దుమ్ము పట్టిన పాత క్లాస్లో దాక్కొని ఏడుస్తూ ఉంటుంది.

ఆ రూంలోకి ఎవరూ రారు. అందుకే దుమ్ము పట్టి, బెంచీలు అడ్డంగా పెట్టేసి ఉంటాయి.

దూరంలో ఎవరివో అడుగుజాడలు వినిపిస్తాయి. పర్వీన్ భయంతో వణుకుతూ వెళ్లి బెంచుల వెనుక దాక్కుంటుంది.

ఆ వ్యక్తి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ రూంలోకి వస్తాడు.

పర్వీన్ రెండు చేతులతో నోరుమూసుకుని దాక్కొని కూర్చుంటుంది.

ఆమె భయంతో ఊపిరి గట్టిగా తీసుకుంటూ ఉంటుంది.

ఆమె శబ్దం కనుక వినిపిస్తే వాడు తనను కనిపెట్టేస్తాడని ఆమె భయపడుతూ కదలకుండా అక్కడే దాక్కొని కూర్చొని ఉంటుంది.

ఆ వ్యక్తి నీడ ఆమెకు దెగ్గరవ్వుతూ వస్తుంది. పర్వీన్ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి.

దుమ్ము పట్టి ఉన్న రూం కనుక ఆమె అడుగుల ముద్రలు పడి ఉండటం గమనిస్తుంది.

ఆమెకు మరింత భయం ఎదురవ్వుతుంది.

అప్పుడే తను దాక్కొని ఉన్న బెంచి ఎదురుగా నిలబడుతాడు.

ఆ వ్యక్తి బెంచీని ఒకచేత్తో ఎత్తి పక్కకు పడేస్తాడు.

పర్వీన్ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది.

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.