webnovel

24

బైరవ (పిల్లి):.....

బైరవ సైలెంటుగా ఏదో ఆలోచిస్తూ విండో దెగ్గర కూర్చొని ఏటో చూస్తూ ఉంటాడు.

సవ్యసాచి తన వెనుక మోకాళ్ళ మీద కూర్చొని దన్నం పెడుతూ ఉంటుంది.

సవ్యసాచి: ఐమ్ సారీ బైరవ గారూ...

నేను అలా మాట్లాడి ఉండుండికూడదు..

బైరవ (పిల్లి):.....

సవ్యసాచి: నేను చాలా దిగులు పడ్డాను బైరవ గారూ..

అందుకే అలా పిచ్చి పిచ్చిగా వాగేసాను...

ఐమ్ రియల్లీ సారీ....

బైరవ (పిల్లి):...

సవ్యసాచి: నాకు గుడ్ బై చెప్పకుండా ఎక్కడ వెళ్లిపోయారో అని బాధపడ్డాను.

అందుకే అలా అనేశాను..

నిజంగానే సారీ..

తప్పంతా నాదే..

నేనలా వాగకుండా ఉండి ఉండాల్సింది..

ఇంకోసారి ఇలా ఎప్పుడూ చెయ్యను!!

ప్రామిస్గా!!!..

దయచేసి నన్ను క్షమించండి బైరవ గారూ..

అని బ్రతిమలుతూ ఉంటుంది.

బైరవ (పిల్లి): సరే! సరే!!

చాల్లే!!

నిన్ను అర్ధం చేసుకున్నలే!~

చెప్పకుండా వెళ్లిపోయానేమో అని కంగారు పడ్డావ్~

అని చెబుతూ వెనక్కి తిరిగి కూర్చుంటాడు.

సవ్యసాచి ఆనందంతో ఉత్సాహపడుతూ,

సవ్యసాచి: అంటే నన్ను క్షమించేసినట్టేనా?

నా మీద కోపం పోయినట్టేనా?

అని త్వర త్వరగా అడుగుతుంది.

బైరవ (పిల్లి): క్షమిండానికి ఏం లేదులే!~

జరిగింది అంతా మారిపో!

నేనూ మర్చిపోతా!

అంతా అయిపోయిందిగా?~

అని గట్టిగా ఊపిరి తీసుకోని ప్రశాంతగా కూర్చుంటాడు.

సవ్యసాచి: నేను అలా అరిచి గోల చేయడం వల్ల మీకు...

అంటే..

బాత్రూంలో...

పని సరిగ్గా అయిందా లేదా?...

అని మొఖమాటంగా అడుగుతుంది.

బైరవ అవమానంతో సిగ్గు పడుతూ గట్టిగా అరుస్తాడు,

బైరవ (పిల్లి): నోర్ముయ్!!!

సవ్యసాచి డ్రెస్ కాలర్ పట్టుకొని ఆమెను కొట్టడానికి పంజాలను పిడికిలిగా బిగిస్తాడు.

బైరవ (పిల్లి): లేదు.. బైరవ!... కంట్రోల్!!! కంట్రోల్!!!!....

ఒక్క గుద్దు గుద్దితే పావులో ముప్పావు గుద్దు వేస్ట్ అయిపోద్ది!!!...

కంట్రోల్!!! కంట్రోల్!!!!....

అని తనకు తాను బయటికి చెప్పుకుంటాడు.

సవ్యసాచి తింగరిగా నవ్వుతూ ఉంటుంది.

సవ్యసాచి: హిహిహిహి....

బైరవ గారూ...

ఐమ్ సారీ...

దయచేసి మీ పంజాలు...

మీ పంజాలు పక్కకు జరుపుతారా?..

అని భయంతో అంటూ చిన్నగా స్మైల్ ఇస్తుంది.

సవ్యసాచి: బైరవ గారూ. మీరు ఇక్కడే ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది.

అని పెద్దగా స్మైల్ ఇస్తుంది.

బైరవ (పిల్లి): వాట్?.... అం...

అంటూ బుగ్గలు ఎర్ర జేస్తూ పంజాలు పక్కకు తీసేస్తాడు.

అతను సిగ్గుతో మొఖం పక్కకు తిప్పుకొని  వెళుతూ ఉంటాడు.

ఆమె తల గోక్కుంటూ స్మైల్ ఇస్తుంది.

బైరవ (పిల్లి): తిక్కల్!!

అని అంటూ స్మైల్ ఇస్తాడు.