webnovel

Gamyam

ఈ కథ యొక్క ముఖ్య పాత్ర విక్రమ్. ఈ విక్రమ్ గురించి చెప్పాలి అంటే ఏ గమ్యం లేని ఒక కాలేజీ విద్యార్థి కథ.

అది 2018 విక్రమ్ డిగ్రీ చదువుతున్న రోజులు, మన ఈ కథలో విక్రమ్ కి తోడు ఇంకొక ఇద్దరు ఉన్నారు.

వారు విజయ్,సిరి. వీరిద్దరూ కూడా మన విక్రమ్ లానే. వీరిది ఆనందమైన ప్రపంచం కానీ ఆ ప్రపంచం లో ఉండేది వీరుమాత్రమే.

మన ఈ కథలో ఇంకొక పాత్ర కూడా ఉంది. అతడే "మోహన్ రామ్" . మళ్ళీ ఈయన ఎవరా అని అనుకోకండి, ఈయనే విక్రమ్ నాన్న. ఎప్పుడు విక్రమ్ నీ మందలిస్తునే ఉంటాడు ఎందుకంటే దాని వళ్ళైనా మారుతాడేమో అనే చిన్న ఆశ. కానీ మన విక్రమ్ PUBG ఆడుతుంటే డిస్టర్బ్ అవుతుందని ఫ్రెండ్స్ తో పాటు కాలేజీ హాస్టల్ లోనే ఉంటున్నాడు .

వీరిని ఆ కాలేజీ లో ఎవ్వరు ఆపలేకపోయారు. టీచర్స్ మీద జోక్స్ వెయ్యడం , క్యాంటీన్ లో గోడవ చేయడం ఇంకా క్లాసులు తప్పించుకోవడం ఇలా ఆ కాలేజీ లో వీరు ముగ్గురు ఒక బ్లాక్ మార్క్ లా అయ్యారు.

అప్పుడే ఆ కాలేజీ చైర్మన్ అయిన "రామ్మూర్తి రావు" గారు ఎలాగైనా వీరి అల్లరికి అడ్డుగొడ నిర్మించాలి అని అనుకున్నాడు. అప్పుడే మూర్తి గారు "శివ శంకర్" గురించి న్యూస్ లో విన్నాడు. ఏమని విన్నాడు అంటే, ఈయన పనిచేసిన కాలేజీ చాలా strict గాను మరియు ఏ ఒక్కరూ అల్లరి చేసే వాళ్ళు కాదు. ఇది విన్నాక మూర్తి గారికి ఆయన్నే ఈ కాలేజీకి ప్రిన్సిపల్ గా నిర్మించాలి అని అనుకున్నాడు.

2 వారాల తర్వాత శంకర్ ప్రిన్సిపాల్ అయ్యాడు.

ఈ ముగ్గురి అల్లరి కాస్త తగ్గింది. క్లాస్ అంత వీరి కెళ్ళి చూస్తూ," శంకర్ సార్ వచ్చాక మీరు పిల్లుల్ల ఉన్నారు" అని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. దీన్ని తట్టుకోలేక కాలేజీ రూల్స్ నీ అతిక్రమించి విక్రమ్ టూర్ కి ప్లాన్ చేశారు. మిగితా ఇద్దరు ఒప్పుకొని, "ఎక్కడికి వెళ్దాం?" అని అడిగారు. దానికి విక్రమ్ కాస్త ఆలోచిస్తూ , " హా అరకు వెళ్దాం" అన్నాడు.

అప్పుడు సిరి మరియు విజయ్ ఒక్కసారిగా "అరకు నా! మేమురాము కావాలంటే నువ్వే వెళ్ళు" అని భయపడుతూ చెప్పారు. విక్రమ్ అప్పుడు "అరే ఎందుకు అంత భయం, మనం వెళ్ళేది అరకు మాత్రమే అంతరిక్షాన్ని కాదు" అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు సిరి " మన వెళ్తాం కానీ అక్కడ నుంచి బయటకు రాము" అని అన్నది.

విక్రమ్ ఎందుకు అని అన్నాడు. అప్పుడు సిరి ,"అక్కడ ఒక పెద్ద పులి తిరుగుతుంది. ఇప్పటి వరకు ఆ పులి 30 మందిని తిన్నది." అని అన్నది. "అరే అవి అన్నీ కట్టుకథలు ముందు మీరు వస్తారా? రాకపోతే మీరు నాతో మాట్లాడకండి" అని చెప్తూ విక్రమ్ అక్కడి నుంచి కోపం గా వెళ్ళాడు.

ఇక చేసేది ఏమిలేక సిరి మరియు విజయ్ ఒప్పుకున్నారు.

మే 29 2019 నా వారు అరకు వెళ్ళారు ...

సాయంత్రం ఏడు గంటలకు అరకు టూరిస్ట్ స్పాట్ కి చేరుకున్నారు. మంచి ఆంధ్ర స్టైల్ లో ఒక బిర్యానీ తిని అక్కడినుంచి హోటల్ కు వెళ్ళారు. రూం బుక్ చేసుకోవడం కోసం వెళ్లినప్పుడు అక్కడి manager వీరితో "మీరు అస్సలు అరకు వ్యాలీ దగ్గర ఉన్న అడవిలోకి వెళ్ళకండి.ఆంధ్ర గవర్నమెంట్ అడవిలోకి వెళ్లడాన్ని బ్యాన్ చేసింది." అని అన్నాడు. కానీ విక్రమ్ పట్టించుకోలేదు. సిరి , విజయ్ లలో ఇంకా ఆందోళన పెరిగింది. వీరు ముగ్గురు అరకు వెళ్లిన విషయం తెలిసి శంకర్ పోలీస్ సాయంతో అరకు వెళ్ళాడు. విక్రమ్,సిరి,విజయ్ మూడు రోజులు అక్కడ సరదాగా గడిపారు. ఇక వారు వెళ్ళాలి అని నిర్ణయించుకుని చివరిగా వెళ్ళేముందు అరకు వ్యాలీ చూడనికి వెళ్ళారు.

అప్పుడు విక్రమ్ దృష్టి అడవి పై పడింది. విక్రమ్ "ఆహా ఆ అడవి చూడండి ఎంత అందంగా వుందో" అని సిరి, విజయ్ లతో చెప్పాడు. విజయ్ "ఆంధ్ర ఫుడ్ తినడం వల్ల నీ పిచ్చి పీక్స్ లోకి వెళ్ళింది" అని గట్టిగ మాట్లాడాడు విక్రమ్ పై. విక్రమ్ "ఒక్కసారి అలా వెళ్లి ఇలా వద్దాం. కావాలంటే మన కార్ లోన్ వెళ్దాం" అని అన్నాక వీళ్ళు కూడా ఒప్పుకున్నారు.

అప్పటి వరకు ఎర్రగా మండుతున్న సూర్యుడు అస్తమించాడు , నిండు చీకటి కమ్మింది. పక్షూలు కీచ్_కీచ్ అంటూ అరుస్తున్నాయి ఆకాశంలో నల్లని మబ్బు కమ్మింది. ఒకటే ఉరుములు,మెరుపులు. అందరిలో భయం మొదలు అయ్యింది. ఇక జోరు వర్షం మొదలు అయ్యింది. "వర్షానికి ఇక్కడ దేనికి అదిగో అక్కడ ఏదో షెడ్ లా ఉంది అక్కడికి వెళ్దాం పదండి" అని విక్రమ్ చెప్పాడు..అందరూ వెళ్ళి అక్కడ నిల్చున్నారు. ఒక్కసారి ఆ షెడ్ పైన నుంచి ఒక గర్జన వినిపించింది. ఆ గర్జన ఎవరిదో కాదు పులిది!... అది తెలిసినా వీరు ఒక్కసారిగా భయంతో శిలగా మారిపోయారు.

కానీ సిరి ఒకే సారి భయంతో కేక పెట్టింది. ఇక పులి వారి వెంట వస్తుందని తెలిసి ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పరుగులు తీశారు.

పులి వారి వెనుకనే వస్తుంది. అడవిలో పరిగెత్తడం వల్ల శరీరం అంతా గాయలు అయ్యాయి. విజయ్ ఒక రాయికి తగిలి కింది పడిపోయాడు.పులి పాపం విజయ్ ని చంపేసింది. సిరి, విక్రమ్ లలో భయం ఇంకా పెరిగి పోయింది. అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ సిరి లోయలో పడిపోయింది. సిరి నడవలేని పరిస్థితిలో ఉంది.. వారి ప్రయాణం ఇక ముందుకి సాగదు.

విక్రమ్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక పక్క పులి వీరి వైపుగానే వస్తుంది మరోపక్క తన స్నేహితురాలిని వదిలి వెళ్ళలేడు. ఇక ఒక్కటే నిర్ణయించుకున్నాడు, అది "అ పులైన చచ్చిపోవలి, లేకుంటే నేనైనా చచ్చిపోవలి" అని అనుకున్నాడు . ఏదైతే అది అయ్యింది అని అనుకొని చెట్లు నరకడం కోసం తెచ్చి చెట్టుకే ఉంచిన గొడ్డలి చేతిలోకి తీసుకున్నాడు.

ముందుకి అడుగు వేశాడు,సిరి వద్దు అని ఏడుస్తుంది. పులి ఒక సారి విక్రమ్ పై దూకింది, కానీ విక్రమ్ దాని దాడి నుంచి తప్పించుకుంటూ ఎదురు దాడి చేస్తున్నాడు.విక్రమ్ శక్తి కోల్పోయి నేల పై పడి ఉన్నాడు.పులి సిరి వైపుగా వెళ్తుంది. స్నేహితురాలిని కాపాడాలి అని కట్టిగా మనస్సులో అనుకొని లేచాడు. గొడ్డలి గట్టిగ పట్టుకొని పులి పై దూకి , పులిని గాయపరిచాడు పులి ఇంకా కోపంతో దాడికి వస్తుంది. విక్రమ్ గొడ్డలిని తిప్పి పట్టుకొని పులిని కొట్టాడు. ఆ దెబ్బకు ఆ పులి లోయ లోతుల్లో పడిపోయింది.

వారు చిన్నగా రోడ్ పైకి వచ్చార్రు. ఇంతలో వారి ప్రిన్సిపల్ శంకర్ పోలీస్ సాయంతో వచ్చాడు. సిరి నీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి, I.C.U లో జాయిన్ చేశారు. 3గంటల ఆపరేషన్ తర్వాత సిరి ఇక నడవలేదు అని డాక్టర్ చెప్పాడు.

విక్రమ్ నాన్న మోహన్ రామ్ విక్రమ్ తిట్టాడు. ఒక్క పైసా సంపదన ఉండదు నీకు ఎందుకురా శికార్లు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళమని విక్రమ్ కు మోహన్ రామ్ చెప్పాడు.

ఇదంతా నా వల్లే జరిగింది అని అనుకుంటూ విక్రమ్ బాధ పడుతున్నాడు.

బాధ తో విక్రమ్ ముంబై వెళ్ళాడు.

5 సంత్సరాల తర్వాత ముంబై లో.....

విక్రమ్ ముంబై లో స్థిరపడ్డాడు.డిగ్రీ నీ ఎలాంటి ఫెయిల్యూర్స్ లేకుండా విజయవంతంగా డిగ్రీ నీ అందుకున్నాడు. ఒక పెద్ద software company వచ్చి "మా దగ్గర పని చేస్తావా" అని అడిగారు. దానికి విక్రమ్ ఒప్పుకున్నాడు. అలా విక్రమ్ ఎదుగుతూ ఎదుగుతూ ఇండియా లోని no.1 బిజినెస్స్ మ్యాన్ గా అవార్డ్ పొందాడు.

ప్రస్తుతం సిరి వద్ద....

సిరి నీ మోహన్ రామ్ గారు ఎప్పటిలానే చెకింగ్ కి తీసుకొని వెళ్ళారు. అప్పుడు బయట పడ్డ నిజం ఏమిటంటే "సిరి కి ఒక జబ్బు ఉంది. కానీ ఆ జబ్బు ట్రీట్మెంట్ ఎప్పుడో జరిగిపోయింది" అని డాక్టర్ చెప్పాడు.

" సిరి కి అలాంటి ఆపరేషన్ ఏమీ చెయ్యలేదు డాక్టర్" అని అన్నాడు మోహన్ రామ్.

"అవును మోహన్ గారు కాకపోతే ఈ ఆపరేషన్ 5yrs బ్యాక్ జరిగింది" అని అన్నాడు డాక్టర్

"ఎప్పుడు డాక్టర్" అని మోహన్ రామ్ అన్నాడు

" 5yrs క్రితం సిరి లోయలో పడినప్పుడు ఆ ఆపరేషన్ తో పాటు ఈ ఆపరేషన్ అనుకోకుండా జరిగింది. అదే అప్పుడు ఆ ఆపరేషన్ జరగక పోతే ఈ జబ్బు బయట పడేది కాదు, సిరి మనకు దక్కేది కాదు" అని డాక్టర్ సమాధానం ఇచ్చాడు.

మోహన్ రామ్ బాధ తో "ఆ రోజు తప్పు చేసిన ఈ రోజు అది ఒప్పు అయ్యింది అనవసరంగా నా కొడుకుని అనరాని మాటలు అన్ననే" అని అంటూ ఏడుస్తున్నాడు.

సిరి మోహన్ రామ్ తో" uncle జరిగింది ఒడిలేయంది విక్రమ్ కి ఫోన్ చేసి పిలవండి "

మోహన్ రామ్ విక్రమ్ కి కాల్ చేసి రామని చెప్పాడు.

**తర్వత రోజు*

విక్రమ్ ఒక గమ్యం లేని విద్యార్థి లా కాకుండా ఒక సక్సెస్ business man లా వచ్చాడు.

అందరూ కలిసి పోయారు..

కానీ అనుకొని విషాదం వారి ఇంట్లో జరిగింది . మోహన్ రామ్, విక్రమ్ తండ్రి అకస్మాత్తుగా మరణించారు.

విక్రమ్ , సిరి నీ తనతో పాటుగా ముంబైకు తీసుకొని వెళ్తా అని చెప్పాడు.కానీ సిరి అక్కడ నుంచి ఎక్కడికి రాను అని చెప్పింది. విక్రమ్ కూడా ఏమి అనకుండా సరే అని ఒప్పుకున్నాడు. విక్రమ్ తర్వత రోజు ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే సిరికి చెప్పడానికి వెళ్ళాడు.

" సిరి నేను ఇక్కడే మన సూర్యాపేట లో ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఏం అంటావ్"అని విక్రమ్ అడిగాడు.

"ఓ చాలా మంచి ఆలోచన విక్రమ్, స్టార్ట్ చేయి" అని సిరి చెప్పింది

వెంటనే విక్రమ్ తన P.A subramanyam కి call చేసి రమ్మని చెప్పాడు.

సుబ్రమణ్యం 2రోజుల ప్రయాణం చేసి విక్రమ్ దగ్గరకు వచ్చాడు.విక్రమ్ సిరికి చెప్పిన విషయాన్ని తిరిగి మళ్ళీ సుబ్రమణ్యం కి చెప్పాడు. సుబ్రమణ్యం ఆ కంపెనీ కి కావాల్సిన విషయాలు చూస్తున్నాడు. 2yrs తర్వాత విక్రమ్ వాళ్ళ నాన్న పేరుతో "మోహన్ రామ్ ఫుడ్ ఫ్యాక్టరీ" అని అతని ఫ్రెండ్ విజయ్ పేరుతో " విజయ్ చారిటబుల్ ట్రస్ట్" అని మొదలు పెట్టాడు.

కానీ అక్కడ ఒక సమస్య వచ్చింది. అది ఏమిటంటే పక్కనే ఉన్న గ్రామం నుంచి వారికి కొంత మంది వర్కర్స్ కావాలి.కానీ అక్కడ ప్రజలు మా వల్ల కాదు అని అన్నారు. "ఎందుకు" అని అడగడు విక్రమ్.

అప్పుడు ఆ ఊరి ప్రజలు ఏం అన్నారు అంటే " మీకు మేము మాత్రమే కనపడుతున్న కానీ మా కష్టాలు కనపడవు సర్" అని అన్నారు. "ఏం కష్టాలు ఎక్కువ డబ్బు కావాలా,లేకుంటే ఇల్లులు కావాలా చెప్పింది ఏదైన చేస్తాం కానీ మీ పంటలు మాకు అమ్మంది"అని విక్రమ్ చెప్పాడు.

రామయ్య అనే రైతు ముందుకు వచ్చి "అయ్యా! మాకు ఇక్కడ పంటలే పండవు ఇక మీకు ఎలా మా పంటలు అమ్మలి" అని అడిగాడు.

"పంటలు పoడవ ఎందుకు? నేను ఈ ఏరియా గురించి బాగా ఎంక్వైరీ చేశా. ఇక్కడ నీటికి, ఆర్గానిక్ మట్టికి కరువు లేదే! ఇక ఏమిటి మీ సమస్య?" అని ప్రశ్నించాడు విక్రమ్.

"నీళ్ళ ఎక్కడివి బాబు ఆ నీళ్ళు , ఆ నీలకంఠ రాయుడే మాకు వ్యవసాయానికి నీళ్ళు రాకుండా చేశాడు" అని అన్నారు ప్రజలు.

నీలకంఠ రాయుడు. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. స్మగ్లింగ్, డ్రగ్స్ మాఫియా, explosions, ఇల్లీగల్ మైనింగ్ వంటి ఎన్నో అక్రమ పనులు చేస్తాడు. ఆతడి కళ్ళు సారవంతమైన ఈ భూముల పై పడింది.ఎలాగైనా ఆ భూములు తన సొంతం చేసుకోవాలి అని పన్నాగం పన్నాడు.

మరి పోలీస్ కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదా అని విక్రమ్ అడిగాడు. అప్పుడు ప్రజలు " ఇవ్వడానికి వెళ్లిన 6 పెద్ద మనుషులను నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందలే కాల్చి వేశాడు" అని అన్నారు.

"ఇక నుంచి ఇది మీ సమస్య కాదు, ఇక నుంచి ఈ ఊరు , ఈ ప్రజలు, ఈ సమస్య నాది" అని అన్నాడు విక్రమ్…

"సర్ ఈ గొడవలు అన్ని మనకు ఎందుకు సర్.ఈ ఊరు కాకపోతే పక్కురు, పదండి సర్ వెళ్దాం" అని విక్రమ్ P.A అన్నాడు.

" నువ్వు వెళ్ళు నేను తర్వత వస్తా" అని అన్నాడు విక్రమ్.

విక్రమ్ నేరుగా అ నీలకంఠ రాయుడు ఇంటికి వెళ్ళాడు.

" ఎవ్వరు నువ్వు" అని రాయుడు అన్నాడు.

"విక్రమ్ నా గురించి ఈ పాటికే తెలిసి వుండాలే తెలియలేదా"అని విక్రమ్ సమాధానం ఇచ్చాడు..

"ఓహో నువ్వేనా విక్రమ్ అంటే" అని రాయుడు అన్నాడు.

"నీతో నాకు మాటలు ఏంటి వెళ్ళి మీ రాయుడునీ పిలువు" అని విక్రమ్ అనగా, "హహహ నేనే రాయుడిని, ఏంటి నీ గోలా, నువ్వు వచ్చిన పని చూసుకొని , మూసుకొని ఇక్కడ నుంచి తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళు" అని రాయుడు వెకిలి నవ్వుతో అన్నాడు.

"రాయుడు అంటే ఏ ముసలోడు అనుకున్న చూస్తుంటే ఓ 30 ఏళ్ళు కూడా ఉండవ్ అనుకుంటాగా…" అని అన్నాడు విక్రమ్.

"ముందు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు" అని రాయుడు అడిగాడు,అప్పుడు " 10 కోట్లు ఇస్తా మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోరా." అని విక్రమ్ అన్నాడు..

ఇది విన్నాక రాయుడు మనుషులు "రేయ్" అంటూ కత్తులు తీసుకొని ముందుకు వచ్చారు. విక్రమ్ వారి కొట్టి " ఏయ్ రాయుడు ఇప్పటి దాకా కూల్ గా చెప్ప లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్" అని విక్రమ్ హెచ్చరిక ఇచ్చాడు.

అవమానం తట్టుకోలేని రాయుడు, కత్తి తీసుకొని విక్రమ్ కు వెనుకనుంచి 3పోట్లు పొడిచేశాడు.

విక్రమ్ నేలపై పడిపోయాడు.స్పృహలో లేడు. అప్పుడు వాళ్ళ నాన్న కాల్లోకి వచ్చి " రేయ్ కన్నా అప్పుడు నువ్వు చేసిన తప్పుకి నీ స్నేహితుడు చనిపోయాడు, ఇప్పుడు నువ్వు చనిపోయి ఈ ప్రజలను చంపకు" అని అన్నాడు..

అప్పుడు వర్షం మొదలయింది, నీటి చినుకుల వల్ల విక్రమ్ లేచాడు.

విక్రమ్ రాయుడిపై దాడి చేశాడు. వారి కొట్లాట ఎలా జరిగింది అంటే, రామాయణము లో వాల్మీకి చెప్పినట్లు " ఆకాశానికి ఆకాశమే, సముద్రానికి సముద్రమే…." అన్నట్లుగా సాగింది… ఎప్పుడు గెలిచేది మంచే కాబట్టి విక్రమ్ గెలిచాడు. ప్రజలకు సాగునీరు వచ్చాయి , విక్రమ్ కి కావాల్సిన మెటీరియల్స్ వచ్చాయి.

Thank you for reading my book . There is part 2 with name VIKRAM-2

** శుభం****