webnovel

24

ఓహో: ఆతృతతో మింగినట్టున్నాడు! గొంతులో ఇరుక్కున్నట్టు ఉంది!!

మహేంద్ర: ముళ్ళు గొంతులో గుచ్చుకుండా ఏంటి?

అని అడుగుతూ కంగారు పడుతాడు.

గ్యారడోస్ నోటి నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి.

ఓహో:.....

మహేంద్ర: గ్యారడోస్!!!...

అని కంగారు పడుతూ అరుస్తాడు.

గ్యారడోస్: ఇది... ఇది...

మహేంద్ర: ఏమైన్ది? ఏమైందో చెప్పూ!!

గ్యారడోస్: నా జీవితంలో ఇంత రుచికరమైన చేపని ఎప్పుడూ తినలేదు!!

ఇది చాలా.. చాలా.. చాలా.. చాలా.. రుచిగా ఉంది!!

అని గింగిరాలు తిరుగుతూ చెబుతాడు.

మహేంద్ర: హమ్మయ్య!! ఇంతేనా?! అందుకా మొఖం అలా పెట్టావ్!?

నీకేమైనా అయిపోయిందేమోనని నేను చాలా భయపడి పోయాను!!

చేప నచ్చితే ఇవి కూడా నువ్వే తిను! హహహ..

అని చెప్పి తను ఒకటి ఉంచుకొని మిగతావి గ్యారడోస్కి ఇచ్చేస్తాడు.

గ్యారడోస్: అన్నీ నాకే! అన్నీ నాకే!...

అని ఆనందంతో ఎగురుతాడు.

ఓహో: హ్మ్.... ఇది అంత బాగుందా?.. చూస్తే పోలా?~

అని ఆలోచిస్తూ ఇందాక మహేంద్ర ఇచ్చిన చేపని తీసుకోని మెల్లగా తింటాడు.

చేప నాలికకు తగలగానే ఓహో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది.

ఓహో: ఇది... నిజంగానే బాగుంది...

అని గొనుక్కుంటూ గపాగప్ మని మింగేస్తాడు.

గ్యారడోస్ ఇంకా తినకుండా గిరిగిరా తిరుగుతూ ఉండుంటాడు.

ఓహో: నాకూ అందులో వాటా కావాలి!!

గ్యారడోస్ వాటిని వెనక దాచుకుంటాడు.

గ్యారడోస్: హా?!!! ఇవి నావి!! నేనివ్వను!!

ఓహో: ఇవ్వకుంటే అన్నీ లాక్కుంటా!!

అని కోపంగా చూస్తూ గ్యారడోస్ ముందుకి అడుగులు వేస్తాడు.

గ్యారడోస్ భయంతో నీలుక్కొని నిలబడుతాడు.

మహేంద్ర: హహహ... గొడవ పడకండి!!

మన దెగ్గర చాలా చేపలే ఉన్నాయిగా? కావాలంటే నేను వండి పెడతా!! రా! ఓహో!

ఓహో: హ్మ్! సరే!!

అని చెప్పి గ్యారడోస్ నుంచి మొఖం తిప్పుకొని మహేంద్ర దెగ్గరకు నడుచుకొని వెళ్తాడు.

°°°°

మహేంద్ర తన దెగ్గరున్న మసాలాలు అన్నీ వాడేసి చేపలు ఫ్రై చేసి ఓహోకి, గ్యారడోస్కి తినమని ఇస్తూ వాళ్ళతో కలిసి తను కూడా తింటాడు.

రాత్రి అవుతుంది.

మహేంద్ర: హా!!.. నేను ఉహించుకున్నంత గొప్పగా కాకున్నా, ఈ లోకంలో ఉండటం కూడా బాగానే ఉంది.

అని ఆలోచిస్తూ ఆకాశంలోని నక్షత్రాలను చూస్తాడు.

మెల్లగా కళ్ళు మూసుకొని నిద్ర లోకి జారుకుంటాడు.

గ్యారడోస్ తన తోకని మెత్తని సోఫాలా చేసి మహేంద్రను పడుకోబెట్టుకుంటుంది.

మహేంద్ర చలికి వనకకుండా ఉండటం కోసం ఓహో లైట్ హీట్ ప్రొడ్యూస్ చేస్తూ అతని పక్కనే కూర్చొని కళ్ళు మూసుకొని నిద్రపోతుంది.

మహేంద్ర దిర్ఘమైన నిద్రలో జారుకుంటాడు.

°°°

ప్లేస్ = *హాస్పిటల్*

మహేంద్ర ICU లో బెడ్డు మీద పడుకొని ఉంటాడు.

మెల్లగా కళ్ళు తెరిచి దిక్కులు చూస్తాడు. అతని శరీరం కుంచం కూడా కదపలేక పోతాడు.

మహేంద్ర:...

అతని నోటికి ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది. తలకి ఆపరేషన్ చేసి కట్టు కట్టి ఉంటుంది.

మహేంద్ర చుట్టూ ఎవరూ ఉండి ఉండరు.

మహేంద్ర: నేను ఎక్కడున్నాను?.. అమ్మా?.. నాన్నా?..

అని చిన్న గొంతుతో పిలుస్తూ ఉండగా స్పృహ తప్పుతాడు.

°°°

*తెల్లవారుజామున*

అప్పుడే మహేంద్ర కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు.

మహేంద్ర: హా!... హా!... నేను హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నట్టు కలొచ్చిందేంటి?...

నేను బానే ఉన్నాగా?..

అని ఆలోచిస్తూ తనను తను చూసుకుంటాడు.

మహేంద్ర: నాకేమైంది?.. నా బాడీ ఇక్కడేగా ఉంది?..

మరి ఆ హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నది ఎవరూ?..

అసలు నేను ఈ లోకానికి ఎలా వచ్చాను?.. ఎందుకొచ్చాను?...

నాకు అస్సలు అర్ధం కావట్లేదు...

అని దీర్గమైన ఆలోచనల్లో పడిపోతాడు.