webnovel

23

మహేంద్ర: వీటిని క్లీన్ చేసి పరచడం వరకూ సరే! దేంట్లో మోసుకొని వెళ్ళాలి?

నా బ్యాగ్లో ఇన్ని చేపలు పట్టవు కదా?..

అని ఆలోచిస్తూ ఉంటాడు.

అప్పుడే అతని కళ్ళకు ఒక పోకిమాన్ కనిపిస్తుంది.

మహేంద్ర: కాటర్పి?!!

వెంటనే నిక్కర్ జోబీలో నుంచి పోకేడెక్ బయటకు తీస్తాడు.

పోకేడెక్:

కాటర్పి ఇదొక ఒక బగ్ టైప్ పోకిమాన్. దీని అటాక్స్ హెడ్ బట్ చేయడం, టాకల్ అటాక్, తన నోటి ద్వారా వెలువడే వలతో శత్రువులను బంధించడం.

మహేంద్ర: నేను అనుకుంది నిజమయితే కాటర్పి నాకు బాగా పనికొస్తుంది.

కాటర్పి అతని దెగ్గర ఉన్న అరటి ఆకు తినడం కోసం వస్తుంది.

మహేంద్రను చూసి పారిపోయి ఒక రాయి వెనుక దాక్కుంటుంది.

అతను మెల్లగా నడుచుకుంటూ వెళ్లి తన దెగ్గరున్న అరటి ఆకుని చించి కాటర్పికి తినమని నవ్వుతూ చూపిస్తాడు.

కాటర్పికి మొదట్లో భయం వేసినా ధైర్యం తెచ్చుకొని బయటకి వస్తుంది.

మహేంద్ర ఆకులని చిన్న ఆకారల్లో చించి కాటర్పి ముందు ఉంచుతాడు.

కాటర్పి వాటిని ఒక్కొక్కటిగా తింటూ ఉంటుంది.

మహేంద్ర: కాటర్పి. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి చేస్తావా? ప్లీస్?!

కాటర్పి ఏమిటని అమాయకంగా చూస్తుంది.

మహేంద్ర: నీకు పెద్ద కష్టమైన పనేం కాదు. నీ వలతో నాకు రెండు పెద్ద బస్తాలు చేసి ఇస్తావా?

అవి చూడటానికి ఇలా ఉంటాయి.

అని చెబుతూ తన బ్యాగ్లోని మ్యాగసిన్ తీసుకోని అందులోని ఫార్మర్స్ వీపుకి ఉన్న వస్తువుని చూపిస్తాడు.

మహేంద్ర: ఇలాంటివి రెండు చేసిస్తే నా దెగ్గరున్న ఆకులన్నీ నీకే ఇచ్చేస్తాను.

కాటర్పి సరే అని తల ఊపుతుంది.

అలా కాటర్పి రెండు పెద్ద అల్లిన బస్తాలను తయారు చేస్తుంది.

మహేంద్ర: థాంక్స్ కాటర్పి. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆకులు అన్నీ నువ్వే తిను.

అని చెప్పి తన చేతిలో ఉన్న ఆకులు అన్ని ఇచ్చేస్తాడు.

కాటర్పి వాటిని తినేసి చెట్టెక్కి వెళ్ళిపోతుంది.

***

మహేంద్ర: హమ్మయ్య!! మోసే పని తగ్గింది!!

ఇప్పుడు నేను వీటిని వండుకొని తినాలి!

అంటూ బ్యాగ్ నుంచి సాల్ట్ డబ్బా, కొన్ని స్పైసస్ డబ్బాలు తీసుకోని పక్కన పెట్టుకుంటాడు.

చిన్న కప్లో కుంచం సాల్ట్, కారం, పసుపు, మరి కొన్ని మసాలాలు వేసి చిటికెడు నీళ్లు పోసి కలుపుతాడు.

ఎండటానికి పెట్టిన చెప్పాల్లో ఒకటిని తీసుకోని ఆ మసాలా మిక్సచర్ చుట్టూ పూసి, అరటి ఆకులో పెట్టి టైటుగా చుట్టి పక్కన పెట్టుకుంటాడు.

అలా కొన్ని చేపలను రెడీ చేసుకున్నాక కొన్ని ఎండు కట్టెలు విరుచుకొని వచ్చి ఒకదాని పక్కన ఒకటి పెట్టి కట్టెలతో మూసేస్తాడు.

మహేంద్ర: ఓహో! లైట్ టెంపరేచర్లో వీటిని కాల్చుతావా?!

ఓహో: అడగాలా?!

అంటూ మహేంద్ర చెప్పినట్టే లైట్ ఫ్లేమ్ లో వాటిని కాలుస్తుంది.

***

కొన్ని నిమిషాలకి అవి కాలిపోయి తినడానికి రెడీ అవుతాయి.

మహేంద్ర వాటిని కట్టెతో బయటకు తీసి కాసేపు చల్లారనిస్తాడు.

ఒక పాకెట్ తీసుకోని ఆకులని మెల్లగా విప్పుతాడు.

చేప మంచిగా ఉడికి ఉంటుంది. అతను రుచి చూస్తాడు.

మహేంద్ర: పర్లేదు.. బానే ఉంది.

దింట్లో ఒక నిమ్మకాయ పిండి, తరిగిన ఉల్లిపాయలు వేసుకొని తింటే అద్దిరిపోయుండేది.

కానీ అవి ఇక్కడ దొరకవు కాబట్టి అడ్జస్ట్ అయిపోడమే!~

మహేంద్ర మరో రెండు చాపలను ఓపెన్ చేసి ఓహోకి, గ్యారడోస్కి తినమని ఇస్తాడు.

మహేంద్ర: మీరూ తినండి. నేనొక్కడినే తింటుంటే ఏం బాగుంటుంది? ఇదిగో!

ఓహో: మాకెందుకు? నువ్వు తిను!

అని వద్దంటుంది.

గ్యారడోస్: అయ్!! నాకూ!! నాకూ!!!

ఓహో: నేలబడి నాకూ!!

గ్యారడోస్ ఓహోని పట్టించుకోకుండా ఒక చేపను తీసుకోని గుట్టుక్కున మింగుతాడు.

చేపను మింగగానే గ్యారడోస్ తెల్ల మొఖం పెడతాడు.

మహేంద్ర: ఏమైన్ది?...

ఓహో: ఆతృతతో మింగినట్టున్నాడు! గొంతులో ఇరుక్కున్నట్టు ఉంది!!

మహేంద్ర: ముళ్ళు గొంతులో గుచ్చుకుండా ఏంటి?

అని అడుగుతూ కంగారు పడుతాడు.

గ్యారడోస్ నోటి నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి.

ఓహో:.....

మహేంద్ర: గ్యారడోస్!!!...

అని కంగారు పడుతూ అరుస్తాడు.