webnovel

ఫరీద: నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్

ప్రొలోగ్: ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను.... కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?.... ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు ..... ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే .... అంతం అయ్యేది నా చావుతోనే .... ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా.. ఏ జాతి అయినా.. ఏ మతం అయినా.. నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను... ఇది నా కధ ... నా కధ కి మొదలు నేనే ... అంతము నేనే .... "నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ " "నా పేరే ఫరీదా"

SAVYASACHI · Fantaisie
Pas assez d’évaluations
25 Chs

NOT: CH 12

──•~❉᯽❉~•──

సమయం: 9:30 pm

──•~❉᯽❉~•──

ఆ ఆకారాలు పక్కకి వచ్చి ఆ నలుగురి రూపంలోకి మారాయి.

ఆ తర్వాత మిగతా ఆకారాలు IDA నీడలోకి గుంట తవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయాయి.

ఆ సింహాసనం కూడా మాయమై పోయింది. ఇప్పటి వరకూ వాళ్ళు వదిలిన అడుగుజాడలు, చేతి గుర్తులు, రక్తపు మరకలు... అన్నీ పూర్తిగా మాయం అయిపోయాయి.

రోహిత్, సాయి, శశి, కిరణ్ ల రూపం లోకి మారిన ఆ ఆకారాలతో కలిసి Ida వెల్లింది. వాళ్ళ కార్లో కూర్చొని బయలుదేరుతారు.

వెళ్ళే ముందు ఆ దారిలో వాళ్ళ అకౌంట్ల లో నుంచి తలో 40% డబ్బులను డ్రా చేసి ఫరీద అకౌంట్లోకి వేరు వేరుగా అన్నోన్ అకౌంట్లతో డిపాజిట్ చేస్తారు.

ఈ డబ్బుతో ఒక మధ్యతరగతి కుటుంబం 10-15 సమత్సరాలు ఖర్చు పెట్టుకొని కుటుంబం సాగించగలరు.

అలా ఫరీద సరీరంలో ఉన్న Ida ను తన ఇంటి ముందు డ్రాప్ చేసి వాళ్ళు నలుగురూ వాళ్ళు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పోతారు.

──•~❉᯽❉~•──

సమయం: 10:00 pm

──•~❉᯽❉~•──

IDA సంతోషంగా నువ్వుతూ,

"సంతోషామా farru బేబీ?! నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాను!.. నన్ను మెచ్చుకోవా?! హమ్???!!!"

" ...."

IDA ఫరీద శరీరాన్ని తిరిగి తనకు ఇచ్చేస్తాడు.

ఫరీద ఆలోచిస్తూ,

"... నిజం చెప్పు! నువ్వు నా అన్నవా???"

IDA,

"...."

ఆవేశం తో,

ఫరీద,

"నా ప్రశ్నకు సమాధానం చెప్పు! నువ్వు నా అన్నవా???"

IDA,

"అదీ-"

ఫరీద వాళ్ళ అమ్మా, నాన్న, తమ్ముడూ ముగ్గురూ తనను మిద్దె పైనుంచి చూసి మెట్లు దిగి తన దెగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు.

అమ్మ,

"ఏంట్రా ఇంటికి రావటానికి ఇంత లేట్ అయింది?"

"...."

తమ్ముడు,

"కనీసం పోన్ చేద్దాం అంటే నీ ఫోన్ కి కవరేజ్ ఏరియా అని వచ్చింది. మేమంతా భయపడ్డామో తెలుసా?!"

"...."

నాన్న,

"పిల్లని రోడ్డు మీదే నిలబెట్టి మాట్లాడుతారు? ఇంట్లోకి పదా farru!."

"...."

ఫరీద తల ఊపి ఇంట్లోకి వెళ్లి స్నానం చేసి భోజనం చేయడానికి వచ్చి కూర్చుంటుంది.

అమ్మ,

"రేయ్! నీకు వేరే దేశంలో ఉద్యోగం దొరికిందనీ, నెలకు 5 లక్షలు జీతం ఇస్తామని ఎవడో మాకు కాల్ చేసి చెప్పారు."

అమ్మ,

"అతని పేరు రోహిత్ అంటా! నువ్వు ఇంకో రెండు రోజుల్లో బయలుదేరాలి అంటా! అదంతా నిజమేనా?"

ఫరీద, నీరసంగా మొకం పెట్టీ.

"అవును! నిజమే!"

నాన్న,

"అంత దూరం ఎందుకురా? నువ్వు ఉద్యోగం చేయకున్నా పర్లేదు. మేము నిన్ను చూడకుండా ఉండలేమురా!"

ఫరీద,

"లేదు నాన్నా! మన కుటుంబ పరిస్థితి బాగోలేదు! నేను దూరంగా ఉంటేనెం? రోజు ఆడియో, వీడియో కాల్ చేసి మీతో మాట్లాడుతానుగా! జీతం అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా పడతాయి. మీరు ఆ డబ్బులతో ఇల్లు కొని సెటిల్ అయ్యాక ఆ ఉద్యోగం వదిలి నేనే మీ దగ్గరకు వచ్చేస్తాగా!"

అమ్మ,

"కానీ... ఆడపిల్లవి అంత దూరం వెల్లి ఒక్కడానివే ఎలా వెల్లి అంటావ్? ఉండటానికి ఇల్లు, తిండీ ఎలా? అసలే నీకు బద్దకం ఎక్కువ!..."

తమ్ముడు,

"అవును అమ్మా! అక్కకి చాల బద్దకం! పని చేస్తూ అక్కడే గురకపెట్టుకొని పండుకుంటది! అప్పుడు వల్లే అక్కని తరిమేస్తారు!"

ఫరీద నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకొని,

"రేయ్ వెధవా! నేనేం పని చేసేటప్పుడు గురక పెట్టీ పనుకునులే!"

నాన్న,

"నీకు అక్కడ ఇబ్బందిగా అనిపిస్తే ఏం లెక్క చెయ్యకుండా తిరిగి వచ్చేదూ సరేనా?!"

ఫరీద,

"సరే నాన్నా!"

అమ్మ,

"ముందు అన్నం తిను! పొద్దున్నుంచి ఏం తినకుండా పస్తున్నట్టున్నావ్!"

*నేను వారానికి సరిపడా ఆహారాన్ని mgb మాల్ మెక్కిన సంగతి విల్లకు తెలీదు!*

అమ్మ అన్నం ప్లేట్ లో పెట్టీ ఇస్తే ఫరీద తినటం మొదలు పెట్టింది.

*Ting*

*తమ్ముడి ఫోన్ కి నోటిఫికేషన్*

*మీ #######1234 A/C లో 15L ట్రాన్స్ఫర్ అయ్యాయి.*

తమ్ముడు,

" అక్కా! ఇది చూడు! డబ్బులు? ఇది ఫేక్ ఆ?"

ఫరీద, అన్నం తింటూ..

".. అది నా 3 నెలల జీతం! ముందే ఇచ్చారు! దానితో పాటు పాస్పోర్ట్ వీసా అన్నీ వల్లే రెడీ చేసి నన్ను ఫ్లైట్ లో తీసుకెళ్తారు."

నాన్న,

"నీకు అసలు ఏం ఉద్యోగం ఇచ్చారు?"

ఫరీద,

"Um.. నేను బొమ్మలు బాగా వేస్తాను కదా.. నన్ను మూవీస్ కి బొమ్మలెయ్యమని కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ పని కాన్ఫిడెంషియల్ కాబట్టి నేను వాళ్ళ ప్లేస్ లో వల్ల దేవైసులోనే పని చేయాలి."

అమ్మ,

"అంటే? దొరేమాన్, షించాన్.. కార్టూన్ లాగానా?"

ఫరీద,

"అవును అమ్మా!..."

──•~❉᯽❉~•──

సమయం: 11:30 pm

──•~❉᯽❉~•──

అలా ఆ రాత్రి తన కుటుంబంతో సంతోషంగా మాట్లాడుకుని ఫరీద బెడ్ రూం లోకి వెళ్లి పనుకుని సీలింగ్ వైపుగా చూస్తూ ఉండగా పైనుంచి ఒక దెయ్యం పాకుతూ వెళ్తుందటం కనిపించింది.

ఫరీద చిన్నపాటి గొంతు తో

"ఓయ్! ఎంత ధైర్యముంటే నా ఇంటి సీలింగ్ పైన  పాక్కుంటూ పోతావ్!!?? నన్నిలా కాదు id-"

ఆ దెయ్యం ఫరీద పక్కన దూకింది.

ఫరీద భయపడి వేగంగా మంచం పై నుంచి లేచి కింద నిలబడింది.

ఆ దెయ్యం మంచం పైన కూర్చుని తన అసలు రూపంలోకి మారింది.

ఆ దెయ్యం మరెవరో కాదు "నెక్రమెన్సెర్".

మంచం పైన కూర్చుని ఉన్నాడు.

ఒంటి నిండా నల్లటి బట్టల తో కప్పబడి, మొఖానికి ముసుగు ఉండటం వల్ల అతని మొహాన్ని ఫరీద ఇప్పటి వరకూ ఒక్కసారి కుడా చూడలేక పోయింది.

అతను ముసుగు తీసి మంచం పైన కాలుమీద కలువేసుకొని పనుకుని, ఫరీద వైపు చూసి మంచం పైన కూర్చోమని, మంచం పైన చేతితో తడుతూ సైగ చేశాడు.

" ....??"

" ....??"

ఫరీద మంచం పైన అతనికి కుంచం దూరంగా కూర్చుంది.

నెక్రోమెన్సెర్ తను చెప్పినట్టు ఫరీద అతని పక్కన కూర్చోవటంతో అతను ఆశ్చర్యపోయి పైకి లేచాడు.

ఆమె దెగ్గరకు వచ్చి మొకంలో మొకం పెట్టి తన కళ్ళలోకి చూసి నవ్వి అతని కుడి చేతితో ఒక చిటిక వేశాడు.

దాంతో వాళ్ళ చుట్టూరా నీలి రంగులో ఒక బ్యారియర్ ఏర్పడింది.

ఫరీద ఆ బ్యారియర్ ను చూసి ఆశ్చర్యపోయింది.

ఫరీద,

"Aaaaaah..."

బ్యారియర్ బయట నుంచి లోపలకు శబ్దాలు వినబడుతున్నాయి కానీ లోపల నుంచి మాత్రం ఏ శబ్దం బయట వాళ్లకు వినబడలేదు.

నెక్రొమెన్సెర్ లకు ఉండే శక్తులతో ఒకటి.

*సౌండ్ ప్రూఫ్ బ్యారియర్*

*ఆ బ్యారియర్ లోపల నుంచి ఏ శబ్దం చేసిన బ్యారియర్ బయటకు అసలు వినిపించదు.*

*చూడటానికి నీలపు రంగులో షడ్భుజి ఆకారంలోని గాజు ముక్కలను ఒక్క చోట చేర్చినట్టు ఉంది.*

ఆ నెక్రొమెన్సెర్ ఫరీదను సూటిగా చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ,

"ఫ..... రీ... దా...."

──•~❉᯽❉~•──

ఇంకా ఉంది...

─── ・ 。゚☆: *.☽ .* :☆゚. ───