webnovel

ఫరీద: నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్

ప్రొలోగ్: ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను.... కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?.... ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు ..... ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే .... అంతం అయ్యేది నా చావుతోనే .... ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా.. ఏ జాతి అయినా.. ఏ మతం అయినా.. నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను... ఇది నా కధ ... నా కధ కి మొదలు నేనే ... అంతము నేనే .... "నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ " "నా పేరే ఫరీదా"

SAVYASACHI · Fantaisie
Pas assez d’évaluations
25 Chs

NOT: CH 10

──•~❉᯽❉~•──

సమయం: 8:00 pm

──•~❉᯽❉~•──

ఫరీద శరీరంలో ఉన్న IDA వాళ్ళ నలుగురినీ చూసి నువ్వుతూ,

IDA,

"హ్హ్మ్... నాకు మీ నలుగురితో ఇంకాసేపు ఆడుకోవాలని ఉంది.. కానీ చీకటి పడింది కదా.. ఫరీద వాళ్ళ అమ్మా నాన్నలు కంగారు పడుతూ ఉంటారు~ ఏదైనా చెప్పాలని ఉంటే, మీ ఖర్మ కాలి మల్లీ పుడితే చూద్దాం~"

వాళ్ళు నలుగురూ భయంతో వణుకుతూ పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు,

IDA,

"... సరే~ మీ నలుగురిలో ఒక్కరిని మాత్రమే నేను చంపకుండా వదిలేస్తాను అని మటిస్తున్నా~"

IDA వాళ్ళను సూటిగా చూస్తూ,

IDA,

"మరి.. మిగిలిన ముగ్గురు ఆ ఒకడి చేతిలో చావక తప్పదు!"

రోహిత్,

".. నువ్వు మమ్మల్ని ఏమైనా చేస్తే.. మా వాళ్ళు నిన్ను ఏమీ చేయరని అనుకుంటున్నావా? మా బాబాయ్ ఒక మినిస్టర్ తెల్సా!? నిన్నూ, నీ కుటుంబాన్ని చిత్ర హింసలు పెట్టీ చంపుతారు!"

సాయి,కిరణ్,శశి,

"అవును! మావాళ్ళు కూడా!"

IDA ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ,

IDA,

"అరేయ్! పిచ్చి పూ... అమ్మో! బూతులు! ఛీఛీ! నా ఫరీద నోట్లో బూతులా! హహహ!...

మీ నలుగురూ బోకులైతే, నేను మీకంటే పెద్ద పోరాంబుకుని రా! నేను బ్రతికి ఉన్నప్పుడు ఎన్ని చూసాను~ ఎన్ని చేసాను~ నా గతం గురించి కుంచం తెలిస్తేనే మీ నలుగురి ప్యాంట్ తడిసి పొద్ది! అయినా వాడు తెలుసు,.. విడు తెలుసు,.. వాడు అది పీకుతాడు,.. వీడు ఇది  పీకుతాడు,.. బోరుకొట్టట్లా? నువ్వేం పికగలొవో అది చేసి చూపించు! మగ శరీరంలో ఉన్న నంగి నా #@₹&!

నేను బ్రతికున్నప్పుడు ఆడవాళ్ళు.. కాదు! ఆడ శివంగులు! వాళ్ళు కోపంగా అరిస్తే ఆ భయానికి గుండాగి చేస్తారు~ మీకు నాతో పోటీనా?~

ఈ పిల్ల నేను డైరెక్ట్ గా ఎవరినీ చంపకూడదు అని మాట తీసుకుంది! ఆ మాటకు కట్టు బడి ఇంతసేపూ ఎవరినీ చంపలేదు!"

IDA కోపంతో కూడిన నవ్వుతో చూస్తూ,

"కానీ.. నాకు మీ చూపులు ఏమాత్రం నచ్చలేదు!"

సాయి, రోహిత్, కిరణ్, శశి, నలుగురూ IDA ను చూసి భయంతో వణుకుతూ,

రోహిత్,

"మావా! దీన్ని ఎలాగైనా చంపేయాలి రా! లేకుంటే ఇదే మనల్ని చంపేస్తది!"

మిగతా ముగ్గురూ భయంతో వణుకుతూ ఒప్పుకున్నారు.

IDA చిరు నవ్వు నవ్వి పాట పాడుతూ,

"హమ్... స్నేహ బంధం.. మధురం.."

పైకి లేచి సమాధి పైన నిలబడి,

"ఈ ప్రపంచం అనురాగా ప్రేమయయం..."

తన చేతులు రెండు విశాలంగా చాపి ఆకాశం లోకి చూసి నవ్వూతూ,

"నీ నేస్తం కోసం జీవించూ... అను బంధం పంచుతూ... ఆప్యాయతనే నింపుతూ.."

కళ్ళు మూసుకుని,

"ఊహల్లో తేలిపో... ఆకాశంలో విహరించూ.. అందరికీ మేలూ చేయ్!.."

నలుగురూ IDA పాట వింటున్నప్పుడు వాళ్ళతో పాటుగా చెట్లపై నుంచి కాకులు, గుడ్ల గూబలూ, చెట్ల పొదల్లో నుంచి అడవి కుక్కలూ.. దాక్కొని వింటూ ఉన్నాయి.

నలుగురూ అలసటతో గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటే,

IDA,

"హమ్... సరే! పాపం అలసి పోయినట్టు ఉన్నారు!"

సమాధి పక్క నుంచి ఒక నిల్ల బాటిల్ తీసుకుని అందులోని నీళ్లు తాగటం మొదలు పెడుతుంది.

నలుగురూ దాహంతో ఆమె వైపుగా చూస్తారు,

IDA,

"...? అలా చూడకండి! నాకు దిష్టి తగులుతుందేమో!?"

నీళ్ల బాటిల్ వాళ్లకు చూపిస్తూ,

"కావాలా? గొడవ పడకుండా తాగండి~"

అని అడిగి ఆ బాటిల్ వాళ్ళ వైపుగా మెల్లగా విసిరేస్తుంది. నలుగురూ కలిసి పంచుకొని నీళ్లన్నీ తాగేస్తారు.

IDA,

".... హ్మ..."

సురేష్,

" ఆహ్! నా చెయ్యి! నా చెయ్యి పని చేస్తోంది!?"

శశి,

"నా కాలు! నా కాలూ పని చేస్తోంది!?"

కిరణ్,

"నా కన్ను! నా కన్ను కూడా కనిపిస్తోంది!?"

రోహిత్,

"ఏంటి? కానీ.... ఎలా..? నీళ్లు... ఈ నీళ్ల వల్లా..? మరి నాకేం కాలేదు....?! ఏది? ఈ పిల్ల ఎటెల్లింది?"

కిరణ్,

"రే పదండ్రా! మనం బాగయ్యాం కదా! ఇక్కడే ఉంటే అది మల్లీ వెచ్చేస్తదో ఏమో?!"

సాయి,

"అవును రా!"

శశి,

"సరే! పదండి పోదాం!"

రోహిత్,

"నాకు అనుమానంగా ఉంది!.."

కాసేపు తర్వాత.

IDA సమాధుల వద్ద నుండి బయటకు వచ్చి ఎదురుగా నిలబడింది.

మా... స్టా... ర్....

మా... స్టా... ర్....

మా... స్టా... ర్....

IDA,

"హమ్.. (ఆగి) ఆహ్!!~ వీళ్ల గోలొకటి!~"

మా... స్టా... ర్....

మా... స్టా... ర్....

IDA,

".. ఏంటి?"

మా... కు.....

బ....లి....

   ర.... క్తం...

  కా.... వా.... లి...

IDA నువ్వుతూ,

"కికికికి... సరే! మీ సరదా ఎందుకు కాదనాలి.. కానీ దానికి బదులుగా మీతో నాకేంటి లాభం?"

హ... హ... హ... హ..

హ... హ... హ... హ..

హ... హ... హ... హ..

నీకు కావాల్సింది... మా దగ్గర ఉంది...

──•~❉᯽❉~•──

ఇంకా ఉంది...

─── ・ 。゚☆: *.☽ .* :☆゚. ───