webnovel

19

తెల్లవారుతుంది.

మహేంద్ర గ్యారడోస్ని డిశ్చార్జ్ చేయించుకొని బయటకు వస్తాడు.

తన చేతుల్లో రెండు పోకిబాల్స్ ఉంటాయి.

•మాస్టర్ బాల్ (ఓహో)

•డ్రాగన్ బాల్ (గ్యారడోస్)

°బ్యాడ్జ్లు (0)

***

ఇద్దరూ షాప్కి చేరుకుంటారు.

మహేంద్ర: థాంక్యూ Dr. మెహ్ర. మీ వల్లే గ్యారడోస్ బాగయింది. మీరు లేకుండా ఉండుంటే...

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): Mr. మహేంద్ర. మన మధ్యలో క్యాసువాలిటీస్ ఎందుకు? మనం బిజినెస్ పార్టనర్స్. మీ మానేజర్గా ఇది నా బాధ్యత! పైన ఫస్ట్ ఫ్లోర్లో వెళ్లి వాషప్ అయి రండి. నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను.

మహేంద్ర స్మైల్ చేస్తాడు.

మహేంద్ర: ఓకే Dr. మెహ్ర.

***

మహేంద్ర బాత్ రూంలోకి వెళ్లి శుభ్రంగా తల స్నానం చేసి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు.

ఓహో: క్యూ! (ఇటురా!)

అని పిలుస్తుంది.

మహేంద్ర: హ్మ్?

అతను తల తుడుచుకుంటూ ఓహో దెగ్గరకు వెళ్తాడు.

ఓహో తన నుదురిని మహేంద్ర నుడిటికి ఆనిస్తుంది.

పచ్చని రంగులో కాంతి తరంగాలు ఏర్పడుతాయి.

మహేంద్ర: హా?... నా ఒళ్ళంతా.. చాలా ఫ్రీగా అనిపిస్తోంది.. నన్ను హీల్ చేసావా?..

ఓహో: క్యూ!? (నువ్వు రెండు రోజులుగా బాగా స్ట్రెస్ అయ్యావుగా? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాను! అందుకే హీల్ చేశా!)

అని చెప్పి చూపు తిప్పుకుంటుంది.

మహేంద్ర: హ్మ్? హహహ... థాంక్స్ రా! నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావ్.

అని నవ్వుతూ అంటాడు. అప్పుడే పోకిబాల్ నుంచి గ్యారడోస్ బయటకు వస్తుంది.

రూం అంతా *ధం!* అని శబ్దం వస్తుంది.

*కింద రూంలో*

షాప్ ఓనర్ (Dr. మెహ్ర):?? భూకంపం గానీ రాలేదు కదా?..

°°

*పై రూంలో*

గ్యారడోస్: గ్యార!గ్యార!గ్యారడోస్... (మరీ నేనూ?...)

అని సాగదిస్తూ అడుగుతుంది.

మహేంద్ర: హహహ... నువ్వు కూడాలే! నిన్నెలా మర్చిపోతాను చెప్పూ?!

అని అనగానే గ్యారడోస్ సంతోషంతో తోక ఊపుతూ ఉంటుంది.

ఓహో: క్యూ! (వీడు కుక్కకి తక్కువ, పురుక్కి ఎక్కువ!)

అని చెప్పి ఓహో మొఖం తిప్పుకుంటుంది.

గ్యారడోస్: గ్యారా!!??? (చూడండి మాస్టర్! బయ్యా నన్ను ఏమంటున్నాడో!!??)

మహేంద్ర: హహహ... గ్యారడోస్ అందంగా ఉంటాడు. ఓహో నీకు దిష్టి తగలకూడదని అలా అంటున్నాడు.

గ్యారడోస్: గ్యార?! (నిజంగా? బాయా!!!)

అని పాక్కుంటూ ఓహో దెగ్గరకు వెళ్ళబోతాడు.

ఓహో: క్యూ! (ఛీ! నీ ఫాదర్!! పక్కకు పో!! బయ్యా నుంచి బాయాకి వచ్చావంటే రేపు మొగుడా అంటావో ఏంటో!? యాక్!! దూరంగుండు!!)

అని కాలితో గ్యారడోస్ని నెట్టి తోస్తుంటాడు.

గ్యారడోస్: గ్యార!! (అదేం లేదు బాయా!! నువ్వు నా బాయా!)

ఓహో: క్యూ!! (ఏం బాయారా? నీ ఫాదర్! నీ మదర్! దెగ్గరికొస్తే నీ కళ్ళు పొడుస్తా!!)

***

అని తిట్టుకుంటూ ఉంటే, మహేంద్ర వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు.

ఇద్దరూ పోకిబాల్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు.

మహేంద్ర మెట్లు దిగి కిందకు వస్తాడు.

అతని అడుగు చప్పుడ్లు విని Dr. మెహ్ర వంట గది నుంచి తొంగి చూస్తాడు.

మహేంద్ర అడుగులు వేసుకుంటూ కిందకు దిగుతూ ఉంటాడు.

Dr. మెహ్ర కళ్ళు పెద్దవి చేస్తాడు.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర):.... మహేష్... నా... బాబు.. మహేంద్ర అచ్చం మా అబ్బాయ్ లాగే ఉన్నాడు..

అని ఆలోచిస్తాడు.

మహేంద్ర అతన్ని చూసి స్మైల్ ఇస్తాడు.

షాప్ ఓనర్ (Dr. మెహ్ర): రా! బాబూ రా! ఇప్పుడే వంటయిందని పిలవబోతున్నా సమయానికి నువ్వే వచ్చేసావ్!!

రా కూర్చో! నా వంటలు మీ ఇంట్లో వాళ్లు చేసేంత అద్భుతంగా ఉండక పోవచ్చు! ఏదో నా చేతనైంది వండాను. నీకు నచ్చితే అదే చాలు.

మహేంద్ర: థాంక్యూ Dr. గారు.

అంటూ టేబుల్ ముందు కూర్చుంటాడు.

అతను అన్నం, కూరలు వడ్డిస్తే మహేంద్ర కలుపుకొని తింటూ ఉంటాడు.

మహేంద్ర: వంటలు చాలా బాగున్నాయ్ Dr గారు.

అచ్చం మా అమ్మ చేతి వంటలాగే ఉంది.

అని పొగుడుతాడు.

Dr. మెహ్ర కొడుకు మహేష్ (15yrs): నాన్న మీ వంట అచ్చం అమ్మ చేతి వంటలాగే ఉంది!..

అని అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు.

మహేంద్ర: ఏమైన్ది సార్? ఏమైనా ప్రోబ్లేమా?

Dr. మెహ్ర: అలాంటిదేం లేదు బాబూ! ఇందాక ఉల్లిపాయలు కోసి చెయ్యి కడుక్కోకుండా కళ్ళు నలుపుకున్నాను.. అందుకే.. ఇలా.. నువ్వు తిను. ఇంకుంచం కూర వేయమంటావా?

మహేంద్ర: హ్మ్! వేయండి.

అని స్మైల్ చేస్తాడు.

Dr. మెహ్ర కూడా స్మైల్ చేస్తాడు.