webnovel

5

పర్వీన్: ఏం కొందాం? నా దెగ్గర ₹10 ఉన్నాయి. ₹5 నీకు! ₹5 నాకు అని అమ్మి చెప్పింది.

పండు: మ్మ్... నాకు లాలీపాప్ కావాలి.

అని చెబుతూ లాలీపాప్ వైపు వేలు చూపిస్తాడు.

పర్వీన్: నాకు బిస్కెట్ పాకెట్ కావాలి.

ఆంటీ! ₹5 అల్పన్లిబే లాలీపాప్ ఒకటి, ₹5 మిల్క్ బిస్కెట్ పాకెట్ ఒకటి కావాలి.

అని అడుగుతూ పది రూపాయల కాగితం చూపిస్తుంది.

*GRRR*

అంగడి ఆవిడ జవాబు ఇవ్వదు. చీకటిలో నిలబడి తూగుతూ ఉంటుంది.

*SCHOOL BELL RINGS*

పర్వీన్ వెనక్కి చూస్తుంది. స్కూల్ బెల్ మొగడంతో డబ్బులు డబ్బా మీద పెట్టి, అంగడి బయటకు తీగకు వేలాడుతున్న ₹5 అల్పన్లిబే లాలీపాప్ ఒకటి, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టున్న ₹5 మిల్క్ బిస్కెట్ పాకెట్ ఒకటి తీసుకోని, డబ్బా మూత పెట్టేస్తుంది.

పర్వీన్: ఆంటీ డబ్బా మీద డబ్బులు పెట్టాను! బాయ్!!

అని చెప్పి తమ్ముడికి లాలీ పాప్ ఇచ్చి, వాడి చెయ్యి పట్టుకొని ఇద్దరూ క్లాస్ రూంలోకి పరుగులు తీస్తారు.

అంగడిలోని ఆవిడ వాళ్ళను నోరు తెరుచుకొని చూస్తుంటుంది.

ఆమె నోట్లో నుంచి జొళ్ళు కారుతూ ఉంటుంది. ఆమె కళ్ళు తెల్ల రంగులోకి మారిపోయి ఉంటాయి.

నరాలు నీలం రంగులోకి మారిపోయి బయటకు కనిపిస్తుంటాయి.

చర్మం తెల్ల రంగులోకి పల్చగా మారిపోయి ఉంటుంది.

కిందకు చూస్తే,

ఆమె ఎడమ కాలిని కొరికి తిన్నట్టుగా పెద్ద గాయం ఉంటుంది.

*GRRR*

@@@@

పిల్లలు ఇద్దరూ స్కూల్ అసెంబ్లీలో నిలబడుతారు.

పర్వీన్ 5త్ క్లాస్ చదువుతూ ఉంటుంది.

పండు 2న్డ్ క్లాస్ చదువుతూ ఉంటాడు.

వాళ్ళ క్లాస్ యొక్క సెక్షన్, హయిట్ ప్రకారం లైన్ లో నిలబడుతారు.

ప్రిన్సిపాల్ అతని స్పీచ్ ఇస్తూ ఉంటాడు.

పర్వీన్ అవన్నీ వినకుండా తల గోక్కుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది.

ఆమె వెనుక నలుగురు పిల్లలు వచ్చి నిలబడుతారు.

ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది.

హర్ష: హై!  పర్వీన్!

అని పలకరించి నవ్వుతాడు.

పర్వీన్: హా? నువ్వెప్పుడు నా వెనక వచ్చి నిలపడ్డావ్?

హర్ష: ఇప్పుడే! హిహి..

ఆమె ఎడమ వైపున ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది.

రాజి: హై! పర్రి బేబీ!!

పర్వీన్: నన్ను అలా పిలవద్దు అని ఎన్ని సార్లు చెప్పాలి నీకు?..

అని చెబుతూ తల పట్టుకుంటుంది.

పర్వీన్ ఎదురుగా ఒకమ్మాయి నిలబడి ఉంటుంది. ఆమె తలను వెనక్కి తిప్పి చూస్తుంది.

వల్లి: పర్రి అంట! పర్రి!! బర్రి మొఖం దానా!! హూ!

అని విసుక్కొని ఆ అమ్మాయి చీదరించుకుంటుంది.

పర్వీన్: ఒసే బల్లి!! నాతో వద్దు లొల్లి! కొట్టానంటే పాకుతావ్ దొర్లి దొర్లి! పే!

అని ఆమె కూడా తిరిగి విసుక్కుంటుంది.

ఆమె కుడి వైపు మరొక అబ్బాయి నిలబడి ఉంటాడు. ఆమె చెప్పిన కవిత్వం విని చిన్న శబ్దంతో చెప్పట్లు కొడుతాడు.

రాజ:..... 👏👏👏😑

పర్వీన్:... వీడొకడు నా ప్రాణానికి!!

నవ్వుతున్నాడో, కోప్పడుతున్నాడో, తిడుతున్నాడో, పొగుడుతూన్నాడో అస్సలు అర్ధం కాదు!

అని తల పట్టుకొని చిన్న గొంతుతో చెబుతుంది.