webnovel

24

హర్ష: రాజా! మనం సరదా కోసం చాలా మందినే రక్తం వచ్చేలా కొట్టి ఉన్నాం కదా?! కానీ..

ఈ ఫీలింగ్ ఏంటి?...

హా?...

నాకు అర్ధం కావట్లా..

నా రక్తం ఉడికిపోతున్నట్టు అనిపిస్తోంది..

నీక్కూడా అలాగే ఉందా?..

రాజా అప్పటి వరకూ సైలెంటుగా నిలబడి ఉంటాడు.

రాజ: అవును..

....

@@@@@@

@@@@@@

@@@@@@

వల్లి, హర్షాలకు ఆ స్కూల్ మొత్తం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది.

రాజి, రాజలకు స్కూల్ లోపల కంటే బయట ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది.

హర్షా వెళ్లి వాళ్లు అయిదుగురూ క్లాస్కి రావట్లేదని, అటెండెన్స్ వేయించుకొని వస్తారు.

రాజా, పర్వీన్ యొక్క యూనిఫామ్ డ్రెస్ తీసుకోని వెళ్లి సేమ్ డిజైన్ తో కుట్టించుకొని తీసుకోని వచ్చి ఆమెకు ఇస్తాడు.

వల్లి, రాజీలు ఆమెను గర్ల్స్ బాత్రూంకి తీసుకెళ్లి దెగ్గరుండి స్నానం చేయించి డ్రెస్ వేస్తుంటారు.

@@@

రాజా, పర్వీన్ పాత యూనిఫార్మ్ తీసుకోని స్కూల్ వెనుకకు ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వస్తాడు.

స్కూల్ వెనుక హర్షా నిలబడి ఉంటాడు. వాడి చేతిలో ఒక బాటల్ ఉంటుంది.

రాజా ఆ డ్రెస్సుని కింద పడేస్తాడు. హర్షా తన చేతిలో ఉన్న బాటల్ మూత తీసి ఆ లిక్విడ్ ని డ్రెస్సు మీద పోసి, డబ్బాను దాని మీద పడేస్తాడు. అది పెట్రోల్.

రాజా అతని జోబీలో నుండి ఒక లైటర్ను బయటకు తీసి వెలిగించి, ఆ డ్రెస్ మీద పడేస్తాడు.

డ్రెస్లో భగ్గుమని నిప్పులు వస్తాయి. డ్రెస్ కాలుతూ ఉంటుంది.

రాజా, హర్షాలు ఇద్దరూ ఆ డ్రెస్సుని కల్లార్పకుండా చూస్తూ ఉంటారు.

వాళ్ళ కళ్ళు కోపం వల్ల ఎర్రబడి ఉంటాయి.

హర్ష: మన పిల్లని తాకినోడి అంతు చూడాలి!

అని చెబుతాడు.

రాజ: హ్మ్...

వాళ్లు తిరిగి పర్వీన్ వాళ్ళ దెగ్గరకు చేరుకుంటారు.

పర్వీన్ కి ధైర్యం చెబుతూ ఆరోజంతా ఆమెతోనే టైం గడిపేస్తారు.

పర్వీన్ అంతా మర్చిపోయి మామూలు అయిపోతుంది.

సాయంత్రం ఇంటి బెల్ కొట్టగానే తన తమ్ముడితో స్కూల్ వాన్ ఎక్కి, వాళ్ళ నలుగురికీ బాయ్ చెప్పి వాన్లో వెళ్ళిపోతుంది.

వాళ్లు నలుగురూ నవ్వుతూ టాటా చెబుతూ ఉంటారు.

పర్వీన్ ఉన్న వాన్ దూరంగా వెళ్ళిపోగానే వాళ్ళ మోకాళ్ళో నవ్వు మాయం అయిపోతుంది.

రాజి/ వల్లి: అంతా రెడీనా?

అని సీరియస్ గొంతుతో అడుగుతారు.

రాజా, హర్ష: హ్మ్...

@@@

రాత్రి అవుతుంది.

నలుగురూ కలిసి ఒక చీకటిగా ఉన్న చోటుకి వెళుతూ ఉంటారు.

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి..