ఆమె బాక్స్ దాదాపు ఖాళీ అయిపోయి ఉంటుంది.
వాళ్లు వాళ్ళ మూతలు తీసేసుకొని అన్నం తింటారు.
పర్వీన్ తల దించుకొని తన బాక్స్ లోని అన్నం తింటూ ఉంటుంది.
రాజ, రాజీలు, హర్ష, వల్లీలు ఒకేసారి ఆమెను పిలుస్తారు.
ఆమె ఉలిక్కిపడి వాళ్ళను చూస్తుంది.
వాళ్లు ఒక్కొక్కరు వాళ్ళ లంచ్ ను ఆమెకు చిన్న బాక్సుల్లో ఇస్తారు.
రాజీ: మీ మమ్మీ వండిందా? సూపర్ ఉంది.
అని చెబుతూ అన్నం బుగ్గల్లో పెట్టుకొని నములుతూ ఉంటుంది.
రాజ అవునని తల ఊపుతాడు.
వల్లి: మీ మమ్మీ వంటలు బాగా చేస్తుందాన్నమాట! నువ్వు చాలా లక్కీ!! మా పేరెంట్స్ అన్నం, కూరలు అన్నీ బయట నుంచి తెప్పిస్తారు. అస్సలు వండరు.
అని చెబుతూ, పులిహోర తింటూ ఉంటుంది.
హర్ష: అవును. మన పేరెంట్స్ మనకోసం అస్సలు టైం వేస్ట్ చెయ్యరు.
జస్ట్ బయట కొనిపించి పనోళ్ల చేత బాక్స్ పాక్ చేయించి పంపించ్చేస్తారు అంతే~
నిన్ను చూస్తుంటే మాకు జెలసీగా ఉంది వైఫీ.
అని అనగానే వల్లి వాడి బుగ్గలు పట్టుకొని గట్టిగా లాగుతుంది.
వల్లి: నా ఫ్రెండు నీకెప్పుడు వైఫీ అయింది బే!!
అని తిడుతుంది.
హర్ష: ఆ... అహహహ... ఔ...
అంటూ నొప్పికి ములుగుతూ ఉంటాడు.
రాజి: నా వాటా కూడా నువ్వే ఇవ్వు వాడికి!
అని చెబుతూ, వాడిని కొట్టమని వల్లిని సపోర్ట్ చేస్తుంది.
రాజ వాళ్ళను చూస్తూ పులిహోర అన్నం బుగ్గల్లో నిండుగా పెట్టుకొని నాములుతూ ఉంటాడు.
పర్వీన్:... నువ్వు ఆపవా వాళ్ళని?
అని రాజాని అడుగుతుంది. గొర్రె గడ్డిని నములుతున్నట్టుగా బుగ్గల్లో అన్నం నములుతూ ఉంటాడు.
ఆమె ఆ.. అని నోరు తెరుచుకొని వాళ్ళను చూస్తూ ఉండిపోతుంది.
పర్వీన్:... పర్లేదు.. బాగుంది..
అని చిన్న గొంతుతో చెప్పి స్మైల్ చేస్తుంది.
వాళ్లు ముగ్గురూ ఆమెను చూస్తూ కదలకుండా ఉండిపోతారు.
ఆమె వాళ్ళను చూసి మొఖం నార్మల్గా పెడుతుంది.
రాజి: కొట్టు వీడిని! వీడ్ని కొడుతుంటే పర్వీన్ నవ్వింది! గట్టిగా కొట్టు!! కొట్టు వీడ్ని!!
అని అంటూ ఉంటుంది.
వల్లి తన పూర్తి బలం తో వాడి బుగ్గలను లాగుతుంది.
రాజ కూడా థంబ్స్ అప్ చూపిస్తూ వాళ్ళను సపోర్ట్ చేస్తాడు.
హర్ష: ఆ..... నవ్వే బాబూ... లేకుంటే వీళ్ళు నన్ను కొట్టి చంపేసేట్టున్నారు!!! వైఫీ... నవ్వే... ఆ..... ఔ.....
అంటూ పర్వీన్ ను బ్రతిమలుతూ ఉంటాడు.
వల్లి: మళ్ళీ వైఫీ అంటావా?! వీడికి డోస్ పెంచాలి మరైతే!!
హర్ష బుగ్గలు ఆపిల్ పండులా ఎర్రగా కందిపోతాయి.
వాళ్ళను చూసి పర్వీన్కి తెలీకుండానే పకా పకా నవ్వేస్తుంది.
.....
హలో రీడర్. ఇక్కడి నుంచి
మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.
మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.
ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.