webnovel

2

*కాసేపు తరువాత*

సవ్యసాచి తన రెండు చేతుల్లో కాట్ ఫుడ్ నింపిన ప్లేట్స్ తీసుకోని బయటకు వచ్చి పిల్లులకు పెడుతుంది.

సవ్యసాచి: హలో! ఎలా ఉన్నావ్? చాలా ఆకలిగా ఉందా? క్షమించు! ఈరోజు కాలేజ్ లేట్గా ముగియ్యడంతో ఆలస్యంగా వచ్చాను.

చూస్తుంటే మీ ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉంటారనుకుంటా?! మీ ముగ్గురూ ఫ్యామిలీనా? లేదా ఒట్టి స్నేహితులేనా?"

అని నవ్వుతూ అడుగుతుంది. ఫుడ్డు తాకకుండా పిల్లి పిల్లలు ఆమె దెగ్గరకు వచ్చి మీఔ.. మీఔ..  అంటూ పిలుస్తూ ఉంటాయి.

సవ్యసాచి: ఏమైంది? ఫుడ్డు తినట్లేదు? ముగ్గురూ కనీసం తాకను కూడా లేదు?

మీకోసం నా దెగ్గర దాచుకున్న డబ్బులన్నీ వాడేసి ఈ ఫుడ్డు కొన్నాను. మీకు ఆకలిగా లేదా?

ఫుడ్డు వృధా చెయ్యకూడదు.."

ఒక పిల్లి తనను అనుసరించమని సైగ చేస్తూ వెళుతూ ఉంటుంది. మిగతా రెండు పిల్లులు కూడా వెళతాయి.

సవ్యసాచి: హహ్?.. విచిత్రంగా ఉంది?

ఏం తినకుండానే వెళ్లి పోతున్నారే?.. ఎక్కడికి వెళుతున్నారు?"

పిల్లులు తమని ఫాలో చెయ్యమని పిలుస్తూ నడుస్తూ ఉంటాయి.

సవ్యసాచి: విచిత్రంగా ఉంది. నన్ను మీ వెనకాలే రమ్మంటున్నారా?.."

అని అడిగి వాటి వెనుకే నడుస్తూ వెళుతూ ఉంటుంది.

సవ్యసాచి: మనం ఎక్కడికి వెళుతున్నాం?"

పిల్లులు అన్నీ ఒక చోట ఆగుతాయి.

సవ్యసాచి: మనం వచ్చేసామా?.."

అని అడుగుతూ గోడ వైపు తొంగి చూస్తుంది.

ఎదురుగా గోడ దెగ్గర ఒక మగ పిల్లి గాయాలతో చలనం లేకుండా నేల మీద పడి ఉంటుంది.

సవ్యసాచి: హహ్?.."

ఆమె పిల్లిని చూస్తుంది.

**ఒక రోజు తరువాత**

హ్మ్...?

ఏం జరిగింది?..

నేను.. స్పృహ తప్పానా?..

నేనెక్కడున్నాను?..

ఇది...

పంజా..

పిల్లి చెవులు..

తోక?..

??నేను పిల్లిగా మారిపోయానా??

అవునుకదా! కాసేపటికి ముందు..

అతను గాయాలతో నడుస్తూ ఉండగా ఒక పిల్లి కనిపిస్తుంది. దాని తల మీద చెయ్యి పెట్టగానే ఒక వెలుతురు వస్తుంది.

అంటే.. ఆఖరి క్షణంలో నేను ఆ పిల్లిగా రూపం మారినట్టు ఉన్నాను!..

సవ్యసాచి నడుచుకుంటూ గదిలోకి వస్తుంది.

సవ్యసాచి: హహ్? ఇప్పటికి మేలుకున్నావా?..

హమ్మయ్య!..

నీకేమైనా అయిందేమోనని కంగారుపడ్డాను. నాకు దొరికినప్పుడు నీ ఒళ్ళంతా రక్తంతో స్పృహ తప్పి పడున్నావు.

నిన్ను చూసి  నీకేమైనా అవుతుందోనని చాలా భయపడ్డాను తెలుసా?

పర్లేదు. ఇప్పుడు బాగానే ఉన్నావ్. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు..."

అని వేగంగా మాట్లాడుతుంది.

ఎవరీ వాగుడికాయ్?

సవ్యసాచి: పర్లేదు కిట్టీ.."

హ్మ్??.. బహుశా నేను స్పృహ తప్పి పడున్నప్పుడు నన్నిక్కడకు తీసుకొచ్చినట్టు ఉంది.

సవ్యసాచి: ఓహ్! ఒక్క నిమిషం ఆగు!..."

అని చెప్పి గది బయటకు పరిగెట్టుకు వెళ్లి ఒక చేతిలో పాలు ఉన్న ప్లేట్, మరో చేతిలో కాట్ ఫుడ్ ప్లేట్ తీసుకోని వస్తుంది.

వాటిని పిల్లి ఎదురుగా పెడుతుంది.

సవ్యసాచి: నువ్వు ఎందుకు అక్కడ స్పృహ తప్పి పడి ఉన్నావ్?

నీ ఒంటి మీద గాయాలు కూడా లేవే?..

నీ ఒంటి మీద ఉన్న రక్తం చూసి నీకు బలంగా గాయాలు తగిలాయని అనుకున్నాను.

మరి ఆ రక్తం ఎవరిది? లేకుంటే నాకు తెలీని చోట నీకు దెబ్బలు ఏమైనా తగులున్నాయా?..

నాకు చాలా దిగులుగా ఉంది.."

ఈ పిల్ల నిజంగానే వాగుడుకాయ్! గుక్క తిప్పుకోకుండా ఎన్ని ప్రశ్నలు అడుగుతునండో!..

సవ్యసాచి: హా! ఈవిగో తాగు. నీకు చాలా ఆకలిగా ఉండుంటుందిగా?! ఇందులో లాక్టిక్ ఆసిడ్ ఉండదు. ఈ పాలు తాగితే నీకు బలం వస్తుంది. హా! ఒక్క నిమిషం.."

కాట్ ఫుడ్ డబ్బా తెరిచి మరో ప్లేట్లో పెడుతుంది.

హ్మ్?..

సవ్యసాచి: ఈవిగో! దీన్ని కూడా తిను. తిని బాగా బలంగా తయారవ్వాలి."

అని చెబుతూ రెండు ప్లేట్లను పిల్లి ఎదురుగా ఉంచుతుంది.

ఎంత ధైర్యం!!!...

ది గ్రేట్ భైరవనే కాట్ ఫుడ్ తినమంటుందా?..

సవ్యసాచి: తిను. చాలా రుచిగా ఉంటుంది."

అని చెప్పి నవ్వుతుంది.

అదే సమయంలో పిల్లి పొట్ట కుర్రుమని శబ్దం చేస్తుంది.

పిల్లి పైకి లేచి నిలబడి పాలున్న ప్లేట్ దెగ్గరకు వచ్చి నిలబడుతుంది.

ఈ పిల్ల నన్ను నిజమైన పిల్లి అని అనుకుంటుంది.

నా శరీరం త్వరగా నయం అవ్వాలంటే ఏదోకటి తినాల్సిందేగా..

అని ఆలోచిస్తూ మెల్లగా తల వంచి పాలు నాలికతో తాగుతూ ఉంటాడు.

హహ్?

ఆమె పిల్లిని చేతులతో నిదానంగా పైకి ఎత్తుకుంటుంది.

సవ్యసాచి: నువ్వు ఆడ పిల్లివా? మగ పిల్లివా? చూద్దాం ఆగు!..

ఒక్క నిమిషం.."

అని చెబుతూ పిల్లిని కాళ్ళ మధ్యలో చూస్తుంది.

భైరవ: మెంటల్! నన్ను ఎక్కడ చూస్తున్నావ్? ఏం చూస్తున్నావ్? హా?..

నన్ను కిందకు దింపు!!

అని కోపంగా మాట్లాడుతాడు.

సవ్యసాచి ఆ గొంతు ఎవరిదా అని దిక్కులు చూస్తుంది.

సవ్యసాచి: హా?.. ఎవరిదా గొంతు?.. ఎవరిదో మగ గొంతు వినిపించింది.. కొంపదీసి టీవీ ఆఫ్ చెయ్యకుండా వచ్చేసానా?.."

అని చెబుతూ దిక్కులు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది.

భైరవ: వినబడట్లేదా?.. నన్ను కిందకు దింపు!.. లేకుంటే నీ బుర్రలో బొక్కేట్టేస్తా!

అప్పుడు గానీ నీ బుర్రలో ఉన్న మట్టి వదలదు!

అని బెదిరిస్తూ పిల్లి తన పంజా గోళ్ళని చూపిస్తుంది.

సవ్యసాచి భయపడి పిల్లిని కిందకు వదిలి దూరంగా పారిపోయి మూలన కూర్చుంటుంది.

సవ్యసాచి: పిల్లి.... పిల్లి మాట్లాడుతోంది!?...

అసలిక్కడ ఏం జరుగుతోంది? ఎప్పటి నుంచి పిల్లులు మాట్లాడ గలుగుతున్నాయి?

అంటూ భయంతో వణుకుతూ ఉంటుంది.

భైరవ: నోరుమూయ్! గట్టిగా మాట్లాడకు!

సవ్యసాచి: బా.... నేను విన్నది నిజమే! నిజంగానే పిల్లి మాట్లాడుతోంది!

భైరవ: నోరుమూయ మంటే అర్ధం కావట్లేదా? నా పంజాలతో నీ గుండు బొక్కెట్టాలా?"

ఆమె రెండు చేతులతో నోరు మూసుకుని మూలన కూర్చుంటుంది.

పిల్లి ఆమె దెగ్గరకు నడుచుకుంటూ వెళ్లి ఎదురుగా కూర్చుంటుంది.

భైరవ: అద్ది! ఇప్పుడు కాముగా ఉన్నావ్!

ఓయ్! నీ పేరేంటి?

సవ్యసాచి: హహ్?.. ఏంటి?..

భైరవ: నీ పేరేంటని అడిగాను!

సవ్యసాచి:????????

భైరవ: నాకు ఓకే ప్రెశ్న రెండు సార్లు అడగాలంటే చిరాకు!"

అని కోపంతో గట్టిగా అరుస్తాడు.

సవ్యసాచి: న- నా పేరు సవ్యసాచి.

భైరవ: హా! సవ్యసాచి, ఆ కుర్చీ తీసుకుని రా!

సవ్యసాచి: హా? ఏ?

భైరవ: నాకు ఓకే ప్రెశ్న రెండు సార్లు అడగాలంటే చిరాకని ఇప్పుడేగా చిలక్కి చెప్పినట్టు చెప్పాను!?

నీ బుర్ర బొక్కెట్టే వరకూ నీకు బుద్ధి రాదా?.."

అని చిరాకుతో అరుస్తాడు.

సవ్యసాచి: సరే సార్!..

అని చెప్పి పరిగెట్టుకెళ్లి కుర్చీ తీసుకొచ్చి ముందు ఉంచుతుంది.

పిల్లి కష్టబడి ఆ కుర్చీ మీదకు ఎక్కి కూర్చుంటుంది.

భైరవ: అశ్చర్యంగా ఉంది. కుర్చీ ఎక్కడానికి ఇంత కష్టంగా ఉందేంటి?..

బాబోయ్.. నాకు ఆరోగ్యం బాగోలేదు. కనీసం కుర్చీ కూడా ఎక్కడం కష్టంగా ఉంది..!"

పిల్లి కుర్చీ మీద మనిషిలా కూర్చుంటుంది.

క్యూట్ పిల్లి..

సవ్యసాచి పిల్లిని చూసి మనసులో మురిసిపోతుంది.

భైరవ: నేను చెప్పేది జాగర్తగా విను! నేను మాట్లాడేటప్పుడు ఒక్క మాట నీ నోటి నుంచి వినబడినా తోలు తీస్తా!..

అని భయపెడుతూ తన పంజాలు చూపిస్తాడు.

సవ్యసాచి: సరే సార్!..

అని భయపడుతూ తల ఊపుతుంది.

భైరవ: ఛా! నేను ఎవరన్నది సులువుగా బయట పడిపోయింది.

హ్మ్?... అద్దం?...

బండ పిల్లి?...

ఆ పిల్లేంట్రా బాబూ అంతలా బలుసుంది. అది పిల్లా? పందా? మరీ అంతుంది!!??..

హ్మ్?... దాని మొఖం చూస్తే చాలా లావుగా ఉంది..

మరీ.. దాని పొట్టేమో... హా?..

.....

అంటే.. ఆ బలిసిన పంది ఆకారంలో ఉన్న పిల్లి... అది నేనే?!...

నేను... ది గ్రేట్ భైరవ.. ఒక బండ పిల్లా?...

Next chapter