అద్దంలోని పిల్లి ప్రతిబింబాన్ని చూసి అశ్చర్యంతో శరీరంలోని బలాన్ని కొలిపోయి నేల మీద పడిపోతాడు.
సవ్యసాచి: పిల్లి?.. నీకేమైంది?.. హటార్తుగా ఎందుకలా పడిపోయావ్?
అని పిలుస్తూ కంగారుపడుతూ ఉంటుంది.
ది గ్రేట్ భైరవ... ఒక బలిసిన పిల్లిగా మారిపోయాడు.. ఈ విషయం లోకానికి తెలిస్తే.. నన్ను చూసి నవ్వుతారు..
సవ్యసాచి: ఏమైంది నీకూ?... నాకు కంగారుగా ఉంది.. ఒంట్లో ఎక్కడైనా నొప్పిగా ఉందా?..
అని అడుగుతూ కంగారుగా దెగ్గరికొచ్చి పిల్లిని చూస్తూ ఉంటుంది.
పిల్లి... నేనొక బండ పిల్లిని..
వేరే జంతువు రూపంలోకి మారుదామంటే నా ఒంట్లో బలం లేదు...
నేను తిరిగి వెళ్లే వరకూ ఈ అవమానకరమైన శరీరంలో ఉండాల్సిందేనా?...
ఛీ.. నా బతుకు చెడ..
అని ఆలోచిస్తూ ఉండగా ఆమె పిల్లిని చేతిలోకి ఎత్తుకొని వేగంగా ఊపుతుంది.
సవ్యసాచి: పిల్లి... ప్లీస్... చావొద్దు!....
భైరవ: ఆపెహే!...
సవ్యసాచి: నువ్వింకా బతికే ఉన్నావా?..
అని ఆనందంగా అడుగుతుంది.
భైరవ: లేకుంటే? చచ్చాననుకున్నావా?.. ముందు నన్ను కిందకు దింపెహే!
అని చిరాకు పడుతాడు.
సవ్యసాచి: హమ్మయ్య.. నీకేమైనా అయ్యిందేమోనని కంగారు పడ్డాను.. మంచిదయింది. నీకేం కాలేదు.
ఆమె అవేమీ పట్టించుకోకుండా పిల్లికి ఏమి కాలేదని ఆనందంతో మెల్లగా కిందకు దింపుతుంది.
సవ్యసాచి: నువ్వు అలా మాట్లాడుతూ సడెన్గా కింద పడిపోయేసరికి చాలా కంగారు పడ్డాను.
భైరవ: పడింది నేను. నీకేంటి నొప్పి?
ఈ అమ్మాయి చాలా విచిత్రంగా ఉంది.
పిల్లి తనను తాను అద్దంలోకి చూస్తాడు.
ఇదొక బండ పిల్లి శరీరం. ఈలోకంలో వేరే శరీరమే లేనట్టు ఈ బండ పిల్లిలోనే నేను దూరాలా?.. ఛీ.. నా మొఖం మీద పెరుగన్నంతో కొట్టా!..
సవ్యసాచి: పిల్లి సార్?..
భైరవ: భైరవ! నన్ను భైరవ అని పిలూ!
సవ్యసాచి: అలాగే సార్. భైరవ గారు నేను మిమ్మల్ని ఒక ప్రెశ్న అడగొచ్చా?
భైరవ: అడుక్కో!
సవ్యసాచి: నువ్వు పిల్లివి కదా? మనిషిలా ఎలా మాట్లాడ గలుగుతున్నావ్?
సవ్యసాచి: నీకు నట్టు లూసా? నేను మనిషిని కాబట్టే మనిషిలా మాట్లాడుతున్నాను.
సవ్యసాచి: అంటే నువ్వు మనిషివా?
అని అడిగి ఆలోచిస్తుంది.
భైరవ: నేను చూడటానికి పిల్లిలా మారానంతే. నేను కూడా నీలాంటి మనిషినే.
సవ్యసాచి: అంటే నువ్వు కూడా నాలా మనిషివే.. కాకుంటే పిల్లిలా రూపం మార్చుకున్నవంతే...
భైరవ: ప్రస్తుతానికి మాత్రమే.
నీ మట్టి బుర్రకి అర్ధం అయ్యేలా చెప్పడం కష్టం..
సవ్యసాచి: మనిషి పిల్లిలా మారటమా? నేను నమ్మలేక పోతున్నాను..
భైరవ: నీ గుడ్లు కాకులెత్తుకెళ్లాయా? ఇప్పటిదాకా చిల్లక్కు చెప్పినట్టు చెప్పినా నీ బుర్రకెక్కదా?
సవ్యసాచి: మనుషులు పిల్లిగా ఎలా రూపం మారుతారు? ఎలా సాధ్యం?
భైరవ: నీకు చెప్పినా అర్ధం కాదు.
సవ్యసాచి: అంటే నేను కూడా పిల్లిలా మారొచ్చా? ఎలా?
భైరవ: మారొచ్చు. కానీ అక్కర్లేదు.
సవ్యసాచి: ఏం? నాకు అర్ధం కాట్లా..
భైరవ: నీకు అర్ధం కనక్కర్లేదు.
సవ్యసాచి: మరైతే నువ్వు పిల్లిలా ఎందుకు మారావ్?
భైరవ: నీకు తెలియాల్సిన అవసరం లేదు.
సవ్యసాచి: మరెందుకు నువ్వు రక్తపు మడుగులో పడున్నావ్?
భైరవ: అది నీకు అనవసరం.
*****a moment of silence *****
భైరవ: చూడు పిల్లా! నా దరిద్రం వల్ల నీకు దొరికాను.
నీకది మాత్రం తెలిస్తే చాలు.
మరేం తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి నా బుర్ర తినకు.
నీకు నాగురించి తెలియకపోవడమే మంచిది.
సవ్యసాచి: సరే సార్..
****a moment of silence again****
పిల్లి పొట్ట ఆకలికి గుర్రుమంటుంది.
సవ్యసాచి: నువ్వు నిన్న రాత్రి నుంచి స్పృహ తప్పి ఉన్నావ్ కదా?!..
దానితో పాటుగా నీకు దెబ్బలు కూడా తగులున్నాయి..
నువ్వేమైనా తింటే నీ ఒంటికి మంచిది.
అని చెబుతూ పాల ప్లేట్, కాట్ ఫుడ్ ఉన్న ప్లేట్లను పిల్లి ఎదురుగా ఉంచుతుంది.
భైరవ: నీకు ఇందాకే చెప్పాకదా? నేను ప్రస్తుతానికే పిల్లిలా రూపం మార్చుకున్నానని?
నేను మనిషినని తెలిసి కూడా పిల్లులు తినే తిండి తినమని నాకు చెబుతున్నావా?
సవ్యసాచి: భైరవ గారు. మీరు ప్రస్తుతానికే పిల్లిగా మారారని నాకు గుర్తుంది.
మీరెప్పుడయినా తిరిగి మనిషిలా రూపం మార్చుకోవచ్చు.
కాకుంటే మీరు ఇప్పుడు పిల్లే కదా?
భైరవ: అవును..
సవ్యసాచి:.. పిల్లులు మనుషులు తినే ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిది కాదు.
మరీ ముఖ్యంగా మీకు ఒంట్లో బాలేనప్పుడు అస్సలు మనిషులు తినే ఆహారం తినకూడదు.
భైరవ: హ్మ్... అదీ కరెక్టే...
సవ్యసాచి: సరే. మీరు తింటూ ఉండండి. ఈ హడావిడిలో నిన్న రాత్రి పిల్లులకి భోజనం పెట్టలేక పోయాను.
బయట మిగతా పిల్లి పిల్లలు ఆకలితో ఉండుంటాయి.
నేనెళ్ళి వాటికి భోజనం పెట్టొస్తానే?..
అని చెప్పి మెట్లు దిగి బయటకు వెళ్లి పోతుంది.
భైరవ: హ్మ్.....
ఆ పిల్ల చెప్పిందీ నిజమే!
మనుషులు తినే తిండి పిల్లులు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని ఎవరో చెప్తుంటే విన్నాను.
నేను పూర్తిగా పిల్లిగా రూపం మార్చుకున్నాను కాబట్టి కాట్ ఫుడ్ తినడమే నాకూ మంచిది.
సరేలే.. ముక్కు మూసుకొని అయినా తినేస్తాను.
మరీ కష్టంగా అనిపిస్తే కళ్లు మూసుకొని గట గటా నమిలి మింగేస్తాను.
కానీ.. నేను.. ది గ్రేట్ భైరవ కాట్ ఫుడ్ తినడమా?...
సిగ్గు చేటు..
లేదు.. ఇదంతా నా ఆరోగ్యం స్థిరపడటం కోసమే!...
హహ్?...
ఏంటిది?...
ఇంత రుచిగా ఉంది?...
చాలా రుచిగా ఉంది..
అని ఆలోచిస్తూ గపాగపా నమిలి తినేస్తాడు.
పొట్ట ఫుల్ గా తిని నేల మీద దొర్లుతాడు.
అరే ఛా!..
lనేనీ దిక్కుమాలిన కాట్ ఫుడ్ మొత్తం తినేసాను..
లేదు.. నేనేం తినలేదు.. ఆ కాట్ ఫుడ్ దానంతట అదే నా నోటి నుంచి పొట్టలోకి వెళ్ళిపోయింది..
అదే సమయంలో అతని పొట్ట మళ్ళీ ఆకలికి గుర్రు మంటుంది.
ఛీ! దీనమ్మా జీవితం.. ఇప్పుడేగా బొచ్చెడు తిండి తిన్నది? మళ్ళీ ఆకలా?..
ఇది కడుపా? చెరువా?.. తోసేకొద్ది లోపలికి పోడానికి?
ఎక్కువ సమయం లేదు. నేను తిరిగి మనిషిలా కూడా మారలేక పోతున్నాను..
ఇప్పుడు కనుక నేను వాళ్ళకు దొరికితే కోడి ఫ్రై లాగా పిల్లి ఫ్రై అంటూ కూరొండుకొని వారం తింటారు.
నేను నా శరీరానికి శక్తిని తిరిగి పొందే వరకూ రహస్యంగా దాక్కుని ఉంటేనే మంచిది.