webnovel

8

సవ్యసాచి ఇంటికి చేరుకుంటుంది.

ఆమె ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉపయోగిస్తూ ఉంటుంది.

సవ్యసాచి: హమ్మయ్య!..

ఆమె వల్ల గాయపడిన పిల్లికి వైద్యం చేసి సోఫా మీద పొడుకో బెట్టి ఉంటుంది.

సవ్యసాచి: నాకు చేతనైంది చేశాను..

ఇది.. సరిపోతుందంటావా?...

భైరవ: వాడికేం కాదులే.

భయం వల్ల స్పృహ తప్పి ఉన్నాడంతే.

అంతకు మించి ఏం లేదు.

భైరవ నడుచుకుంటూ వెళ్లి మరో సోఫాలో పనుకుంటాడు.

సవ్యసాచి: కానీ.. కనీసం క్లినిక్కి తీసుకెళ్తే మంచిదనిపిస్తుంది..

భైరవ: ఇంతకు ముందే చెప్పా..

ప్రస్తుతానికి ఇది తిరిగి మాంస్టర్ గా మారదానికి శక్తి లేకపోవచ్చు..

క్లినిక్కులో వైద్యం చేపించాక మాంస్టర్లా మారితే?

అప్పుడేం చేస్తావ్?.

సవ్యసాచి: నాకు అర్ధమయింది. కానీ.. అయినా సరే తనకేమైనా అవుతుందని దిగులుగా ఉంది.

భైరవ: గోనగడం ఆపు. వాడికేం కాదులే!

సవ్యసాచి: అలాగే భైరవ.

ఆమె ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సర్ది తీసుకుని వెళుతుంది.

@@@

అంటే..

ఒక మామూలు పిల్లి మాంస్టర్ లా మారడం..

కేవలం దాని శరీర ఆకారం మాత్రమే పెరగలేదు..

బలం కూడా పెరిగింది..

ఇది కచ్చితంగా సామాన్యమైన పిల్లులలో ఉండే పోలికల్లా లేవు..

అచ్చం అవేకెన్ అయినట్టే ఉంది.

సవ్యసాచి:.. భైరవ గారు...

అతను వెనక్కు తిరిగి చూస్తాడు.

సవ్యసాచి: పిల్లికి వైద్యం చేయడంలో బిజీగా ఉండటం వల్ల మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను..

భైరవ: ఏం మర్చిపోయావు?

సవ్యసాచి: అం... ఎలా చెప్పను.. మీకెలా చెప్పాలో అర్ధం కావట్లేదు...

ఈ పిల్ల నా సహనాన్ని పరీక్షిస్తోంది.

భైరవ: ఏం చెప్పాలను కుంటున్నావో చెప్పేహే!. ఓ నసుగుతూ ఉంటావ్.

సవ్యసాచి: అది.. ఇందాక పిల్లితో గొడవ పడేటప్పుడు చేశాను కదా? దాని గురించి..

భైరవ: గొడవ పడేటప్పుడు చేసిందా?..

వేగంగా కదలడం గురించా నువ్వు మాట్లాడుతుంది?

అసలీ పిల్లకేమైంది?

సవ్యసాచి: హా. అదే.. దీన్ని రహస్యంగా ఉంచుతారా ప్లీస్..

నేను అందరికంటే వేగంగా కదలగలనన్న విషయం బయట వాళ్ళకు తెలియడం నాకు ఇష్టం లేదు.

ప్లీస్ సార్.. మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను..

భైరవ: ఏ పిల్ల! నీ కళ్ళకు నేనెలా కనబడుతున్నాను?

ఎర్రోడిలా కనిపిస్తున్నానా?

రోడ్డు మీదకు వెళ్లి కంటికి కనిపించే వాళ్లందరికీ నా సొంత అవేకెన్ అబిలిటీస్ గురించి చెప్పుకోడానికి?

సవ్యసాచి: అబిలిటీస్?.. అంటే ఏంటి?

భైరవ:.... నువ్వొక అవేకెనర్ అయ్యుండీ కూడా అవేకెన్ అబిలిటీస్ అంటే ఏంటో తెలీదా?

సవ్యసాచి: నేను అవేకెనరా?.. అంటే అర్ధం ఏంటి?

భైరవ:... సరేలే. నాకర్థమైంది.

నువ్వొక అవేకెనర్ అన్న విషయం నీకు తెలీదు.

నీలాంటి రేర్ కాసేస్ కూడా ఉంటాయి.

అవేకెండ్ అయుండి కూడా అవగాహన లేకుండా మామూలు ప్రజల్లా జీవిచడం.

సవ్యసాచి: భైరవ టీచర్ నాకొక డౌటు.

భైరవ: అడుక్కో.

సవ్యసాచి: అంటే.. మీరన్నట్టుగా నేనొక అవేకెనర్ అయ్యుండొచ్చా?..

నా అవేకెండ్ శక్తికి వేగంతో సంబంధం ఉందంటారా?

భైరవ: అవును.

సవ్యసాచి: నేనొక అవేకనర్?..

అలా అయితే.. నాలాంటి అవేకెండ్ శక్తులు ఉన్న మనుషులు కూడా ఉంటారా?

భైరవ: కచ్చితంగా!

ఒకడు నీ కళ్ళ ముందే ఉన్నాడు.

సవ్యసాచి: ఏంటి? భైరవ.. నువ్వు కూడా నాలాగే అవేకెండ్ వ్యక్తివా?..

భైరవ: హా! అదేగా నేను మొదటి నుంచి వాగుతోంది.

సవ్యసాచి: వావ్.

భైరవ: ఒక మామూలు మనిషి పిల్లిలా మారటం సాధారణమైన విషయం అనుకుంటున్నావా?

సవ్యసాచి: హా?..

ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

భైరవ:.. ఓయ్?.. ఓయ్!.. ఓ..య్...??!!

ఎందుకు ఏడుస్తున్నావ్?...

ఏమైందెహే?.

ఆమె కళ్ళు తుడుచుకుంటుంది.

సవ్యసాచి: సారీ..హిక్..

నేను మాత్రమే అందరికంటే వేరుగా ఉన్ననుకున్నా.. హిక్..

భైరవ: ఇప్పటి వరకూ.. నీ శక్తుల గురించి మరెవరికి తెలీదంటావా?

సవ్యసాచి: అవును సార్.

భైరవ: బాబోయ్. అదీ నిజమే.

ఒక వ్యక్తి మామూలు జీవితం గడపడం..

అందులోనూ, నీ సొంత శక్తి గురించి అవగాహన లేకుండా బ్రతకటం అంటే..

అంత సులభం ఏమీ కాదు.

సవ్యసాచి: అవును..

నా శక్తుల గురించి మా అమ్మకు తెలిసాక ఇంకెప్పుడు ఉపయోగించొద్దని నాకు చెప్పింది.

కానీ, ఒకసారి నా చిన్నప్పుడు ఆక్సిడెంటల్లీ ఉపయోగించాను.

నా స్నేహితులు నాపై ఇచ్చిన చూపులు ఉప్పటికి మర్చిపోలేను.

వాళ్ళు నన్ను రాక్షసి అని పిలవడం కూడా మర్చిపోలేను..

అప్పటి నుంచీ నా శక్తులను దాచుకొని బ్రతకడం మొదలుపెట్టాను.

నా చుట్టూ ఉన్న వాళ్లకు అనుమానం రాకూడదని నేనిప్పటివరకు చాలా ఇళ్ళే మారాను.

నా చిన్నప్పుడు ప్రతీ క్షణం భయపడుతూ ఉండేదాన్ని..

బహుశా నాకు ఏమైనా జబ్బు ఉందేమో అందుకే ఇలా ఉన్నానని చాలా ఏడ్చే దాన్ని.

ఎవరికైనా నా జబ్బు గురించి తెలిస్తే నన్ను చంపేస్తారేమోనని భయపడే దాన్ని..

ఒకవేళ నన్ను నా శక్తుల గురించి తెలుసుకుంటే నన్ను కిడ్నాప్ చేసి నా శరీరాన్ని ముక్కలుగా కోసి ఎక్స్పెరిమెంట్లు చేస్తారేమోనని అనుకునేదాన్ని..

అందుకే ఎప్పుడూ ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకున్నాను..

భైరవ:....

సవ్యసాచి: కానీ.. నాకున్నది జబ్బు కాదని..

నేనొక అవేకెనర్ అని..

నాకున్నవి అధ్బుత శక్తులని..

నాలాంటి మనుషులు కూడా చాలా మందే ఉన్నారని తెలిసాక ఆనందంతో ఏడుపొచ్చేసింది..

భైరవ:... హ్మ్.. ఏడిచింది చాల్లే.. ముక్కు తుడుచుకో.. చీవిడి కారుతోంది..

సవ్యసాచి: హిహిహిహిహి...

ఆమె ముక్కు తుడుచుకుంటుంది.

సవ్యసాచి: భైరవ గారూ.. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి..

నాకు అవేకెనర్స్ గురించి ఏమైనా నేర్పుతారా?.. ప్లీస్..