webnovel

4

*****ఆరోజు రాత్రి వేల సమయం*****.

భైరవ గదిలో మంచం మీద పడుకోని దిక్కులు చూస్తూ ఉండుంటాడు.

సవ్యసాచి: భైరవ గారు. నేను పని మీద బయటకు వెళుతున్నాను.

భైరవ: ఎక్కడికి?

సవ్యసాచి: జంతువుల క్లినిక్కి. నేను రేపటికి సరిపడా పిల్లులు తినే స్నాక్స్ మాత్రమే కొన్నాను. భోజనం కొనలేదు.

అందుకే కొందామని వెళ్తున్నా!

భైరవ: ఇప్పుడా? ఇంత రాత్రి వేళప్పుడా?

సవ్యసాచి: ఆ.. నువ్వు కూడా నాతో రావొచ్చుగా?..

భైరవ: హా?.. నేనెందుకు?..

సవ్యసాచి: ఏ? నాతో రావొచ్చుగా?..

నేను నోరు జారి మీ గురించి ఎవరితోనైనా వాగుతానని మీకు భయంగా లేదా?

భైరవ: హా?..

ఈ తిక్కల్ది తనను తానే నమ్మొద్దని చెప్తుందేంటి?.. దీనికి నిజంగానే నట్టు లూసు.

భైరవ: సరే వస్తాలే! నేనొస్తుంది నిన్ను ఓ కంట కనిపెట్టడానికే.. ఎందుకంటే నేను నిన్ను మాత్రమే నమ్మలేను కాబట్టి..

సవ్యసాచి: భలే!..

అని ఆనందంగా చెప్పి పిల్లిని చేతిలోకి ఎత్తుకుంటుంది.

భైరవ:.... ఏం చేస్తున్నావ్...

అని చిరాకు పడుతాడు.

సవ్యసాచి: అంటే.. నీకు ఒంట్లో బాలేదు కదా.. బయట చలిగా ఉంటుంది.. అందుకే క్లినిక్కి ఎత్తుకొని తీసుకెలుదామని..

భైరవ: అదేం అక్కర్లేదు.. ఎంత ధైర్యం ఉంటే నన్నే పిల్లిని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటావ్!?...

నన్ను కిందకు దింపు!.. ది గ్రేట్ భైరవ నిన్ను ప్రాణాలతో వదలడు.. హిస్..

నన్ను కిందకు దింపు!... ఈ క్షణమే...

అని చెబుతూ చిరాకుతో పంజాలు విసురుతాడు.

*****కొన్ని నిముషాల తరువాత*****

సవ్యసాచి పిల్లిని తన డ్రెస్ పైన ఉన్న రగ్గులో పెట్టి నడుముకి కట్టుకొని, పిల్లి జారి పడిపోకుండా తన పొట్ట దెగ్గర చేతులతో పట్టుకొని వెళుతూ ఉంటుంది.

అచ్చం తల్లి తన బిడ్డను కట్టుకున్నట్టు.

సవ్యసాచి: హిహిహిహిహి...

అని నవ్వుతూ రోడ్డు పక్కన నడుస్తూ ఉంటుంది.

ఇంత చిరాకులో కూడా హాయిగా ఉందేంటి?...

కాన్సంట్రేట్!.. నేను పిల్లి రూపంలో ఉన్నంత మాత్రానా నేను నిజంగా పిల్లిని కాను..

నేను అలిసిపోయున్నానంతే...

దానితో పాటుగా పిల్లి రూపంలో మారటం నాకిదే మొదటిసారి... అందుకే నేనిలా ఫీల్ అవుతున్నాను..

మ్మ్...

పర్లేదు.. ఇలా ఉండటం కూడా బానే ఉంది...

అని ఆనుకుంటూ కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకుంటాడు.

*****కొన్ని నిమిషాల తరువాత జంతువుల క్లినిక్ దెగ్గరకు చేరుకుంటారు*****

సవ్యసాచి: హలో డాక్టర్ గారు.

జంతువుల డాక్టర్: సవ్యసాచి? ఈ టైం లో వచ్చావేంటి?

సవ్యసాచి: అదా... కాట్ ఫుడ్ కొందామని వచ్చాను... దానితో పాటుగా.. తనను చెకప్కి తీసుకొచ్చాను..

అని మొహమాటంతో తడబడుతూ చెబుతుంది.

ఈ పిల్ల నన్ను మోసం చేసింది.

అని వెనక్కు తిరిగి సవ్యసాచిని కోపంగా చూస్తాడు.

సవ్యసాచి చిరునవ్వు నవ్వుతుంది.

జంతువుల డాక్టర్: అవునా? సరే. పిల్లిని టేబుల్ మీద కూర్చోబెట్టు.

ఆమె టేబుల్ మీద పిల్లిని ఉంచుతుంది.

తను కూడా ఎటువంటి గొడవ చెయ్యకుండా సైలెంట్గా ఉంటాడు.

జంతువుల డాక్టర్: నేను ఈ పిల్లిని ఎప్పుడూ చూడలేదే? దీని పేరేంటి?

సవ్యసాచి: భైరవ.

జంతువుల డాక్టర్: ఇలాంటి పిల్లికి ఆ పేరు చాలా ఫాన్సీగా ఉందే..

అని వెటకారంగా అంటాడు.

నేనీడిని ఏసేస్తా!

అని ఆలోచిస్తూ భైరవ తనలోని కోపాన్ని అనుచుకుంటాడు.

జంతువుల డాక్టర్: సరే చూద్దాం!

అని చెప్పి పిల్లిని బుగ్గలు పట్టుకొని రైట్ అండ్ లెఫ్ట్ చూసి తోక వెనకాల పరీక్షిస్తూ ఉంటాడు.

ఆ తర్వాత పిల్లి నోరు తెరిచి చూస్తూ పరీక్షిస్తాడు.

చాలా అవమానంగా ఉంది...

అని భైరవ ఆలోచిస్తూ ఉంటాడు.

జంతువుల డాక్టర్: నాకు తెలిసి దీనికి ఏ సమస్యా కనిపించట్లేదు..

సవ్యసాచి: నిజంగా? నేను మొదటిసారి చూసినప్పుడు తన ఒళ్ళంతా రక్తంతో నిండి ఉనింది.

జంతువుల డాక్టర్: అవునా? కానీ రక్తం వచ్చేంతగా దీని ఒంటి మీద కొత్త గాయాలేమీ కనిపించట్లేదే?...

పాతగాయలు ఉన్నాయి గానీ వాటికి ఫస్ట్ ఎయిడ్ చేసినందువల్ల అన్నీ నయమయి పోయున్నాయి.

సమస్య ఏమీ లేదు. ఇంటికి తీసుకెళ్లొచ్చు.

సవ్యసాచి: హమ్మయ్య!.. మంచిదయింది తనకేం కాలేదు.

అని చెప్పి ప్రేశాంతంగా ఊపిరి తీసుకుంటుంది.

హ్మ్?.. ఈ తిక్కల్ది నా మీద దిగులు పడుతూనే ఉంది..

అని భైరవ మనసులో అనుకుంటాడు.

జంతువుల డాక్టర్: నిజం చెప్పాలంటే ఈ పిల్లి ఒళ్ళు తగ్గేవరకూ ఉపవాసం చేయిస్తే మంచిదని నా అభిప్రాయం.

అని చెబుతూ పిల్లిని సైడ్ నుంచి చూస్తాడు.

వీడి చావు నా చేతుల్లోనే...

అని భైరవ కోపంతో పళ్ళు కొరుకుతూ మనసులో అనుకుంటాడు.

సవ్యసాచి: హీహీహీ..