webnovel

20

అతను మెలికలు తిరుగుతూ నవ్వుతూ ఉండగా తలుపులో నుంచి మెరుపు వేగంగా పరిగెత్తుకొని వెళ్లి బైరవ ఫుడ్ ప్లేట్ దెగ్గర చుట్టూరా చేరుతాయి.

బైరవ (పిల్లి) వాళ్ళ వేగాన్ని అశ్చర్యంతో చూస్తాడు.

బైరవ (పిల్లి): ఈ మూడు...

వాళ్ళ ఫుడ్ పూర్తి చేసేసి వచ్చినట్టు ఉన్నారు..

ఇంత త్వరగానే?..

అని ఆలోచిస్తూ వాటి వంక చూస్తూ ఉంటాడు.

మూడు పిల్లులు జొళ్ళు కార్చుకుంటూ బైరవ ఫుద్దునే చూస్తూ ఉంటాయి.

బైరవ (పిల్లి): దాన్ని తినాలని ఆలోచన కూడా చేయొద్దు!!

అని గట్టిగా అరుస్తాడు.

మూడు పిల్లులు అరుపులు విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాయి.

బైరవ ముగ్గిరిని కోపంతో చూస్తూ ఉంటాడు.

ఒక్కసారిగా భయంతో దూరంగా జరిగి నిలబడుతాయి.

బైరవ (పిల్లి): హ్మ్.. మీకు నా మాటలు బాగా అర్ధం అవుతున్నట్టు ఉంది.

అతని దృష్టి సోఫా మీద పనుకొని ఉన్న పిల్లి మీద పడుతుంది.

బైరవ (పిల్లి): ఫోర్స్ చేసి అవేకెన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం...

అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మూడు పిల్లులు వచ్చి బైరవని తలతో రుద్ది రుద్ది బ్రతిమాలుతాయి.

బైరవ:....

*meow* *meow* *meow*

*meow* *meow* *meow*

*meow* *meow* *meow*

...........

బైరవ: సరే!!!!!!...

తినండి!! అంతా తినండి!!

నన్ను మాత్రం వదిలేయండి!!!

అని గట్టిగా అంటాడు.

***

*ప్లేస్:- కాలేజ్

సవ్యసాచి తన బెంచ్ దెగ్గర కూర్చొని అవిలిస్తూ ఉంటుంది.

సవ్యసాచి: హమ్మయ్య..

టైంకి కాలేజ్ కి వచ్చేసా~

(అవులిస్తూ)

ఒళ్ళంతా అలసటగా ఉంది.

2 రోజుల నుంచి మంచి నిద్రే లేదు నాకు.

ఈ కొన్ని రోజుల్లో చాలానే జరిగాయి.

(ఆమె బైరవ (పిల్లి) తో ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. చిన్నగా స్మైల్ చేస్తూ,)

ఈ కొన్ని రోజులు బైరవతో ఉండటం..

నేను ఒంటరిగా ఉన్నప్పటి కంటే చాలా బాగా ఉంది.

అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది.

°°°

టీచర్: సవ్యసాచి!! సవ్యసాచి పైకి లేయ్!!

అని గట్టిగా అరుస్తాడు.

ఆమె టేబుల్ మీద తల పెట్టుకొని నిద్ర పోతూ ఉంటుంది. టీచర్ గొంతు వినగానే ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది.

ఆమె బుగ్గ ఎర్రగా కంది టేబుల్ అచ్చు పడి ఉంటుంది.

టీచర్: ఏమైంది నీకు?!

నువ్వు కాలేజ్కి చదుకోడానికి వస్తున్నావా?

నిద్రపోడానికి వస్తున్నావా?!

అని అడుగుతాడు. సవ్యసాచికి నిద్ర మత్తు వదిలి ఉండడు. దిక్కులు చూస్తూ ఉంటుంది.

సవ్యసాచి: హా?.. హ?..