**కొన్ని సంత్సరాల క్రితం**
సవ్యసాచికి ఆరెళ్ల వయసున్నప్పుడు.
సవ్యసాచి: అమ్మ, నేను నిజంగా మనిషిని కానా?
అమ్మ: లేదు తల్లీ. నువ్వు మనిషివే.. కానీ, కుంచం వేరు అంతే..
సవ్యసాచి: వాళ్ళు అన్నారు.. మనుషులెవరు నాలా వేగంగా కదల లేరంట..
అమ్మ: మాములుగా, అందుకే నువ్వు చాలా స్పెషల్ తల్లీ..
సవ్యసాచి: కానీ,.. నా ఫ్రెండ్స్ నన్ను రాక్షసి.. దెయ్యం.. అని పిలుస్తున్నారు..
అమ్మ:...
సవ్యసాచి: నాలా శక్తులు ఉండటం తప్పా అమ్మ?
అమ్మ: లేదమ్మా. ఇందులో ఎవరి తప్పూ లేదు.
నీ తప్పు కూడా లేదు.
సవ్యసాచి: మరీ.. ఎవరి తప్పు కాకుంటే, మనం ఎందుకు మళ్ళీ ఊరు వదిలి వెళ్లి పోతున్నాం?
అమ్మ:....
సవ్యసాచి: అందుకేనా, నాకు ఒక్క ఫ్రెండ్ కూడా ఉండట్లేదు?..
అమ్మ:...
ఆమె సమాధానం ఇవ్వలేక బాధతో సవ్యసాచిని కౌగిలించుకుంటుంది.
సవ్యసాచి: అమ్మ?...
--------------------
సవ్యసాచి ఒక ప్లే గ్రౌండ్ లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది.
చుట్టూ ఆమె వయసులో ఉన్న చున్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉంటారు.
ఆమె వాళ్ళని ఆసక్తిగా చూస్తూ ఉంటుంది.
*meow*
*meow*
మని పిలుస్తూ ఒక పిల్లి వస్తుంది.
సవ్యసాచి: హా?
పిల్లి నడుచుకుంటూ వచ్చి సవ్యసాచి ముందు కూర్చుంటుంది.
సవ్యసాచి: పిల్లి?
ఆమె పిల్లి అనగానే, ఆ పిల్లి సవ్యసాచి దెగ్గరకు వెళ్లి ఒళ్ళు రాసుకుంటూ ముద్దు చేయమని అడుగుతుంది.
సవ్యసాచి:....
సవ్యసాచి పిల్లిని చూసి భయంతో నీలుక్కుపోతుంది.
*meow*
సవ్యసాచి: ప-ప-ప-ప-... పిల్లి?.....
*meow*
....
అలా కాసేపు సవ్యసాచి చుట్టూ తిరుగుతూ ఒళ్ళు రాస్తూ ముద్దు చేయమంటుంది.
*meow*
సవ్యసాచి ఆ పిల్లిని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోతుంది.
పిల్లి కూడా సైలెంటుగా ఆమె ఎదురుగా కూర్చుంటుంది.
సవ్యసాచి:...
ఆమె ఆ పిల్లిని తాకుదామని మెల్లగా చేతిని చాపుతుంది.
పిల్లి ఆమె చేతిని గమనిస్తూ ఉంటుంది.
సవ్యసాచి ఆ పిల్లి కరుస్తుందేమోనని భయపడి చేతిని వెనక్కు తీసుకోబోతుంది.
అది గమనించి పిల్లి పైకి లేచి సవ్యసాచి చేతికి తన తల ఆనిస్తుంది.
సవ్యసాచి: వాహ్...
సవ్యసాచి సంతోషంతో నోరు తెరుచుకొని మరీ ఆశ్చర్య బోతుంది.
ఆమె సంతోషంతో మెల్లగా పిల్లి తలను నిమురుతుంది.
*purr*
*purr*
*purr*
ఆ రోజు తన జీవితంలో మొదటిసారిగా ఒక పిల్లితో స్నేహం చేస్తుంది.
సవ్యసాచి: హహహహ....
*purr*
*purr*
@@@@@@
ప్రస్తుతానికి వస్తే,
సవ్యసాచి క్లాస్ రూంలో బెంచ్ మీద తల పెట్టుకొని పనుకుంటూ ఉంటుంది.
టీచర్: సవ్యసాచి!!!!.....
అని గట్టిగా అరుస్తాడు.
సవ్యసాచి వెంటనే ఒక్కసారిగా ఉల్లిక్కిపడి నిద్ర లేస్తుంది.
సవ్యసాచి: బా...
టీచర్: నేనిక్కడ గొంతు చించుకొని క్లాస్ చెబుతుంటే నీకు నిద్ర ఎలా వస్తోంది?
అని కోపంతో అరుస్తాడు.
సవ్యసాచి:.....
ఆమెకు ఏం చేయాలో అర్థంకాక గుడ్లప్పగించి టీచర్నే చూస్తూ ఉండిపోతుంది.
టీచర్: నువ్వు మంచి స్టూడెంట్ కనుక మాములుగా అయుంటే నిన్నేం అనేవాడిని కాను.
కానీ, నువ్వు రెండు రోజుల నుంచి వరుసగా నా క్లాస్ లో నిద్ర పోతున్నావ్!
సవ్యసాచి:....
అంటే.. క్లాస్ అయిపొయిందా?..
-మని తిక్క మొఖంతో, నిద్ర మత్తులో అడుగుతుంది.
ఆమె మొఖం చూసి టీచర్ దిగులు పడుతాడు.
టీచర్: ఆ?.. హా!! ఇప్పుడే బెల్ గొట్టారు..
సవ్యసాచి? నీకేమైనా ఒంట్లో బాగోలేదా?..
అలా ఏమైనా ఉంటే చెప్పూ...
సవ్యసాచి నిద్ర మత్తులోనే తూగుతూ ఉంటుంది.
సవ్యసాచి: హా? నాకు ఒంట్లో బానే ఉంది సార్..
హ.. క్లాస్ అయిపొయింది కదా?..
అని మెల్లగా చెబుతుంది.
టీచర్: హ్మ్?....
ఆమె సడెన్గా లేచి నిలబడుతుంది.
సవ్యసాచి: సార్!.. నేను త్వరగా వెళ్ళాలి!! వెళ్లొచ్చా!????
అని పెద్ద గొంతుతో అడుగుతుంది.
క్లాస్ రూమ్ అంతా దద్దరిల్లిపోతుంది.
ఆమె గొంతు విని టీచర్ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడుతాడు.
టీచర్: ఏంటి?...
ఆమె బాగ్ తీసుకోని క్లాస్ బయటకు పరిగెత్తుతుంది.
క్లాస్ మొత్తం ఆమె వెళ్లిన దారినే చూస్తూ ఉండిపోతారు.
టీచర్: సవ్యసాచి!!!!!.....
అని గట్టిగా అరుస్తూ పిలుస్తాడు.
ఆమె వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళబోతుంది.
సవ్యసాచి: బైరవ నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటాడు.
అని ఆలోచిస్తూ వేగంగా పరిగెడుతూ ఉండగా ఒకరిని ఢీ కొడుతుంది.
సవ్యసాచి: అం... ఐమ్ సోరీ..
ఆమె ఎదురుగా ఉన్న అమ్మాయి కుంచం కూడా కదలదు.
సవ్యసాచి: నీకేం కాలేదుగా? దెబ్బేమైనా తగిలిందా?..
అని కంగారు పడుతూ అడుగుతుంది.
ఆమెకు సమాధానం ఇవ్వకుండా సవ్యసాచిని గమనిస్తుంది.
సవ్యసాచి: సోరీ.. నేను చూసుకోలేదు... పరిగెడుతూ వస్తున్నానా....
సవ్యసాచి మాట్లాడుతూ ఉండగా ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.
సవ్యసాచి: హ?...
....
ఆ అమ్మయి.. ఏం అనలేదే...
తనే కదా.. పోయిన నెల కాలేజ్కి కొత్తగా చేరింది?..
సవ్యసాచి: ఐమ్ రియల్లీ సోరీ!... నాకు పనుంది! బాయ్!!!!....
అని పెద్ద గొంతుతో చెప్పి వెళ్లి పోతుంది.
.....
ఆమె సవ్యసాచి మాటలు విని కూడా పట్టించుకోకుండా కోరిడోర్ దెగ్గర వెళుతూ ఉంటుంది.
*Bzzzzzz....*
*Bzzzzzz....*
*Bzzzzzz....*
ఆమె ఫోన్ రింగ్ అవుతుంది.
ఆమె కాల్ అటెండ్ చేస్తుంది.