webnovel

13

భైరవ గాయపడి ఉన్న పిల్లిని తన శక్తితో హీల్ చేస్తూ ఉంటాడు.

హీలింగ్ పూర్తవుతుంది.

సవ్యసాచి: ఎలా ఉంది? తనకేం కాదు కదా?

భైరవ అలసటతో సోఫాలో కూర్చొని ఉంటాడు.

భైరవ: కంగారుపడకు. దాని ప్రాణానికి ఏం హానీ జరగదు.

బాగా తన్నులు తిని స్పృహ తప్పి పడుందంతే.

చాలా అలసిపోయాన్రా బాబోయ్...

నా నెత్తిమిదే ఎందుకిన్ని భారాలు వచ్చి పడుతున్నాయ్?...

సవ్యసాచి: హమ్మయ్య! తనకేం కాదు!

తనకు తగిలిన గాయాల వల్ల బతుకుతుందో లేదోనని చాలా భయపడ్డాను.

మంచిదయింది. తనకేం కాలేదు.

భైరవ: ఇది గనక మామూలు పిల్లి అయుంటే ఎప్పుడో చచ్చిపోయుండేది.

నీకు గుర్తుందా? ఇది ఢీ కొట్టుకున్నప్పుడు ఆ గోడ ఎలా బద్దలయిపోయిందో?

ఇది అవేకెన్ అవ్వడం వల్ల అలాంటి దెబ్బలను కూడా తట్టుకొని ఇంతవరకు బ్రతికి ఉండగలిగింది.

సవ్యసాచి: ఈ పిల్లి కూడా అవేకెండ్ ఆ?

భైరవ: అవునని అనుకుంటున్న.

ఆమె చాలా సంతోష పడుతుంది. స్పృహలో లేని పిల్లితో నవ్వుతూ మాట్లాడుతుంది.

సవ్యసాచి: నువ్వు కూడా అవేకెండ్ ఆ! వావ్!

నువ్వు కూడా నాలాగే అవేకెండ్ అని తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉంది పిల్లి...

భైరవ విసుగుతో ఆమెను చూస్తాడు.

ఈ పిల్ల అసలు ఏం వాగుతోంది?..

నాకు మొదలట్లో అనుమానం కలిగింది..

కానీ యముడు ముందు ఉన్నాసరే, ఈ పిల్లి యొక్క స్కిల్స్, పోరాడాలనే ఆత్మ విశ్వాసం చూసాక కన్ఫర్మ్ అని అర్ధం చేసుకున్నాను..

ఇది నిజంగానే ఒక అవేకెండ్ పిల్లి!

ఇప్పటిదాకా నేనిలాంటి అవేకెండ్ జంతువుని చూడలేదు!

కొందరు మామూలు జంతువుల మీద పరిశోధనలు చేసి బలవంతంగా అవేకెన్ చేస్తారని విన్నాను.

ఇది కూడా అవిధంగానే అవేకెన్ ఆయుంటుందా?..

మనం చాలా ప్రమాద స్థితిలో ఇరుక్కు పోయామే!..

అతను దీర్గంగా ఆలోచిస్తూ ఉంటాడు.

సవ్యసాచి: ఏమైంది నీకు?..

ఎందుకలా డల్గా ఉన్నావ్?

ఒంట్లో బాగోలేదా?

భైరవ తన పంజాలతో ఆమెకు మొట్టిక్కాయ వేస్తాడు.

భైరవ: నువ్వు అడ్డమైన వాటిల్లో వేలు పెడుతుంటే నేనే కదా నీ వెళ్ళు శుభ్రం చేస్తుంది? అలసిపోనా?

నీ వల్ల నా ఒళ్ళంతా హూనం అయిపోతోంది.

అని చిరాకుతో అరుస్తాడు.

సవ్యసాచి: నాకు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు.

కానీ పరిస్తుతుల ప్రభావం వల్ల తప్పట్లేదు.

నువ్వు అతన్ని కళ్లారా చూసావు కదా? మనం కనుక ఈ పిల్లిని అతనితో వదిలేసి ఉండుంటే కచ్చితంగా చంపేసుండే వాడు.

దాని వల్లే అలా చేయాల్సి వచ్చింది..

భైరవ: దేనివల్ల చేయాల్సి వచ్చిందన్నది ముఖ్యం కాదు!

నువ్వు ఒక అవేకనర్ తో గొడవ పెట్టుకున్నావ్!

దానితో పాటుగా వాడి పిల్లిని వాడి నుంచి ఎత్తుకొచ్చేసావ్!

వాడి పిల్లి వాడికి దొరికే వరకూ నిన్ను తరుమూతూనే ఉంటాడు.

అని కోపంతో గట్టిగా తిడతాడు.

సవ్యసాచికి అతని మాటలు అర్ధం కావు.

సవ్యసాచి: ఏంటి? అతనికి నా మీద అంత కోపం ఉందంటావా? మరీ ఒక పిల్లి కోసం మనల్ని అన్నాళ్ళు వెతకడం కష్టం కదా?

భైరవ ఆశ్చర్యంతో ఆలోచనల్లో పడతాడు.

ఈ పిచ్చిదానికి తను చేసిన పనుల గురించి ఏమాత్రం అవగాహన లేదు..

బలవంతంగా జంతువులను అవేకెన్ చేయడం చట్ట ప్రకారం నేరం..

గవర్నమెంటుకి తెలిస్తే అందులో ఇన్వొల్వయిన ప్రతీ ఒక్కరినీ జాలి చూపించకుండా ఉరితీసేస్తారు..

ఆ సైంటిస్ట్ గాడు అతని ఎక్స్పరిమెంట్ యొక్క ఎవిడెన్స్ కోలిపోయాడు..

దాన్ని తిరిగి సొంతం చేసుకోవడం కోసం ఎంత దూరమయినా వెళ్తాడు.. ఏమైనా చేస్తాడు..

వాడు ఏం చేస్తాడో ఎలా చేస్తోడో తెలీదు కనుక ఈ పిల్ల చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంది..

ఈ రహస్యాన్ని ప్రభుత్వం నుంచి దాచడానికి...

సవ్యసాచిని హత్య చేయడానికి కూడా వెనకాడరు!

ఈ పిల్లకి తను అవేకనర్ అన్న విషయం ఈమధ్యే తెలిసింది..

అప్పుడే ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కుంది..

ఇవన్నీ ఆమెకు అర్థమయ్యేలా చెప్పనా?..

నో!..

తను ఎవరో ఏంటో ఇప్పుడిప్పుడే తనకు తెలిస్తోంది.

ఇప్పుడు జరిగే విషయాలు ఆమెకు తెలియక పోవడమే మంచిది..

ఎందుకంటే.. ఆమెకు తిలిసినా ఏం మార్పు ఉండదు!.

భైరవ: హా!~

సవ్యసాచి: భైరవ గారూ.. మీరు నా పైన కోపంగా ఉన్నారా?

ఐం సారీ. మీరు అన్న మాటలను వినకుండా..

మిమ్మల్ని చాలా కంగారు పెట్టాను..

భైరవ: కంగారు పెట్టావా? నీగురించి కంగారు పడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ!

అసలు నేనెందుకు నీ గురించి కంగారు పడతాను? హా?

తిక్క తిక్కగా మాట్లాడకు!

నేనేం నీ కోసం కలవరపడట్లేదు! నాకోసం తప్పా నేనెవరి గుగిరించి ఆలోచించను!

నీ వల్ల నేను సమస్యల్లో పడ్డననే ఆలోచిస్తున్నా! ఇంకేం లేదు! అర్థమైందా!?

అని ఆవేశంతో గట్టిగా అరిచి చెబుతాడు.

సవ్యసాచి: స... సరే సార్...

భైరవ: ఉఫ్!.... సరేలే!~ ఎందుకయినా మంచిది ఇకనుంచి జాగర్తగా ఉండు!

నీ పనుల వల్ల ఒకరిని శత్రువు పెంచుకున్నావు.

వాడి పిల్లిని నువ్వు ఎత్తుకొచ్చావు కనుక దాని కోసం నిన్ను ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి.

సవ్యసాచి: ఓహ్? సరే సార్! హిహిహి...

భైరవ ఆమెను కోపంతో చూస్తాడు.

ఒక్క పని చేతకాని దద్దమ్మ!

అదే సమయంలో ఆమె మొబైల్ లో అలార్మ్ రింగ్ అవుతుంది.

**ట్రింగ్**

సవ్యసాచి: హో! అప్పుడే టైం ఉదయం 7 అయిపోయిందా?!

ఆమె కంగారుతో పరిగెత్తుతూ తల దువ్వూకుంటూ జడ వేసుకుంటూ ఉంటుంది.

దుస్తులు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళబోతుంది.

భైరవ: ఓయ్!? ఏమైంది? ఎక్కడికీ అంత హడావిడిగా వెళుతున్నావ్?

నేనిక్కడ మాట్లాడుతున్నానుకదా?! హా?

సవ్యసాచి: స్కూల్కి!

భైరవ: హా? స్కూలా?

సవ్యసాచి: చూస్తుంటే మనం పిల్లిని నయం చేయడానికే రాత్రంతా మేలుకునే సమయం గడిపేసినట్టున్నాం.

ఆమె పక్క గదిలోకి వెళ్లి దుస్తులు మార్చుకుంటూ చెబుతూ ఉంటుంది.

దుస్తులు మార్చుకొని వేగంగా బయటకు వచ్చి పిల్లుల ఫుడ్ ప్లేట్స్ లో నింపుతూ ఉంటుంది.

రోజంతా సరిపోయే అంత ఆహారాన్ని మీకోసం ఉంచాను.

మిగల్చకుండా మొత్తం తినేయండి.

ఆమె బ్యాగ్ తీసుకొని తలుపుల దెగ్గరకు పరిగెడుతుంది.

భైరవ: హా? స... సరేలే..

ఆమె ఒక్క క్షణమ్ ఆగుతుంది.

భైరవ: హా?

సవ్యసాచి: ఒకవేళ నేను ఇంట్లో లేనప్పుడు తను మేలుకుంటే? అప్పుడెలా?

ఇంతకు ముందులా గొడవ చేస్తుందేమో?

భైరవ: నీకంత కంగారుగా ఉండుంటే దీన్ని నాకు వదిలేయ్! ఈ పిల్లిని నేను కాపలా కాస్తా!

సవ్యసాచి: హహ్?

భైరవ: ఈ సమయంలో ఈ పిల్లికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చాలా అవసరం.

ప్రస్తుతం నాలుగు కాళ్ళ మీద నిలబడి కూర్చోవడానికి కూడా దీనొంట్లో బలం లేదు.

అందులోనూ ఈ పిల్లి ఎంత ఆరోగ్యంగా ఉన్నాసరే నా పంజాలకున్న వెంట్రుకల్లో అర వెంట్రుక కూడా పీకలేదు.

నేను ది గ్రేట్ భైరవ అన్న విషయం మర్చిపోయావా?

సవ్యసాచి: వావ్! భైరవ! నువ్వు సూపర్ హీరోవి! చాలా పవర్ఫుల్!

అతను సవ్యసాచి పొగడ్తలు విని చాలా గర్వంగా నవ్వుతాడు.

భైరవ: అదంతా నాకు మామూలే!

ఎప్పటి నుంచో చాలా మంది నన్ను పొగిడే నిజాలే అవి~

సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలని కాదు గానీ!

నేను హీరోలకే హీరోని తెలుసా!?

మాములుగా నీలాంటి వాళ్ళకి నాతో మాట్లాడటానికి కూడా అవకాశం దొరకదు తెలుసా!.

సవ్యసాచి: వావ్! భైరవ! నువ్వు నిజంగా హీరోలకే హీరోవా?

కానీ...

నువ్విప్పుడు బండ పిల్లి అన్న విషయం నీకు గుర్తుంది కదా?

అతను కోపతో పిల్లిలా బుసలు కొడతాడు.

*హిస్స్*

భైరవ: నోరు మూయ్!...

అని గట్టిగా అరుస్తాడు.

ఆమె వేగంగా ఇంటి బయటకు పరిగెడుతుంది.