webnovel

10

ఆమె వేగంగా పరిగెడుతూ వెళుతూ ఉంటుంది.

పైట చెంగులో ఉన్న భైరవ దారి చూపిస్తూ ఉంటాడు.

భైరవ: పర్లేదు. పిల్లి మాంస్టర్తో పోరాడేటప్పుడు కంటే ఇప్పుడు వేగంగా పరిగెడుతున్నావ్.

నా అంచనాల ప్రకారం కచ్చితంగా నీ శక్తి వేగమే!.

ఆవిధంగానే నీ మిగతా శక్తులు కూడా బలంగా మారుతున్నాయనుకుంటా.

సవ్యసాచి: నా వేగం పెరుగుతోందని నాకూ తెలుస్తోంది.

కానీ వేరే శక్తులు అంటున్నవ్. దేని గురించి?

భైరవ: నీ అబిలిటీతో శరీరాన్ని కదిపినప్పుడు నీ శరీరంలోని అవయవాలు, ఎముకలు, మసల్స్, నర్వస్ సిస్టం అన్నీ బలంగా మారుతాయి.

దాని ప్రకారం చూస్తే నీకు తెలియకుండానే నీ శక్తులు డెవలప్ అవుతూ వస్తున్నాయి.

సవ్యసాచి: ఓహో! అర్ధమవుతుంది.

భైరవ: రైట్ కి వెళ్ళు.

సవ్యసాచి: సరే.

ఆమె వేగంగా పరిగెడుతునప్పుడు జారి పడబోతుంది.

పక్కకు వేగంగా ఎగిరి దూకి, తిరిగి పరిగెడుతుంది.

భైరవ:... నీ శక్తిని ఎంత సేపు ఉపయోగించగలవు?

సవ్యసాచి: నేను కొన్ని గంటల క్రితమే నా శక్తులను ఉపయోగించాను.

కాబట్టి బహుశా మరో 2 సెకండ్స్ ఏమో..

కుంచం వేగం తగ్గించి వాడితే.. బహుశా ఎక్కువ సార్లే ఉపయోగించగలను.

భైరవ: హ్మ్.. 2 సెకండ్స్ ఆ...

సవ్యసాచి: ఇప్పుడు ఎటెల్లను?

భైరవ: నేరుగా వెళ్ళు.

సవ్యసాచి: కచ్చితంగా ఎలా చెప్పగలవ్?

భైరవ: చెప్పగలనంత!..

అతనికి ఆకాశంలో ఎరుపూ నలుపు రంగుల పొగలు కదులుతుండటం కనిపిస్తుంది.

భైరవ: నా అంచనా కరెక్ట్ అయితే..

ఆ కాట్ మాంస్టర్కి అవేకెనర్స్కి ఏదొక సంబంధం ఉండే ఉంటుంది.

బహుశా అది ఆ వ్యక్తిని వెతుకుతూ పారిపోయి ఉండుంటుంది.

సవ్యసాచి: ఏంటి? మనలాంటి అవేకనరా? నిజంగా?

భైరవ: ఒళ్ళు దెగ్గర పెట్టుకొని పదా!

@@@@

పిల్లి యొక్క వేగానికి తన శరీరానికి కట్టిన కట్లన్నీ తెగి దారిలో పడిపోతాయి.

తూగుతూ రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉంటుంది.

తన ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు.

"అది నువ్వేనన్నమాట!.

నేను పిలవగానే వచ్చావంటే నువ్వే అయ్యుండాలి.

ఏమైంది దీనికి?.

ఇంత బలహీనంగా ఉంది?

నేను ఉహించినట్టుగా ఏమాత్రం లేదు.

కనీసం నేరుగా నడవలేకుంది?...

ఈ పరిస్థితిలో పంజరం నుంచి ఎలా తప్పించుకొని ఉంటుందబ్బా?.."

అతని గొంతు విని పిల్లి స్పృహలోకి వస్తుంది.

తనని పంజరంలో బంధించి హింసించిన వ్యక్తి తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఇద్దరూ ఒకరేనని గుర్తు పడుతుంది.

భయంతో తోకను ముడుచుకొని బుసలు కొడుతుంది.

***హిస్స్***

"అబ్బబ్బా... ఎందుకు నన్ను తరమాలని చూస్తున్నావ్?..

కొంపదీసి ఎక్స్పెరిమెంట్ అప్పుడు పెట్టిన సీల్ విరిగి పోయిందా ఏంటి?."

***హిస్స్***

***హిస్స్***

"మరేంటి?.. దీని ఆకారం కూడా మెలమెల్లగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది?!"

***హిస్స్***

"నేను ముందే అనుకున్నా!

ఈ పిల్లి అవేకెన్ అయ్యింది. కికికి.."

***

వాళ్లిద్దరూ ఆ ప్రదేశానికి చేరుకుంటారు.

సవ్యసాచి: భైరవ మన పిల్లి అక్కడుంది..

ఆమె పరిగెడుతుండగా భైరవ ఆమెను ఆపుతాడు.

భైరవ: ఆగు!..

ఆమె ఉలిక్కి పడి ఆగుతుంది.

సవ్యసాచి: హహ్?

భైరవ: అక్కడికెళ్లి దాక్కో!

ఆమె మొహానికున్న మూసుకుని గట్టిగా పట్టుకొని పక్కకు లాగుతాడు.

వాళ్లిద్దరూ గోడ చాటు నుంచి తొంగి చూస్తారు.

సవ్యసాచి: భైరవ ఏమైంది నీకు? మన పిల్లి ఎదురుగానే ఉంది.

భైరవ: నీకు కళ్ళు దొబ్బాయా?

పిల్లి పక్కనే చెట్టంత మనిషి నిలబడి ఉన్నాడు కనిపించట్లేదా?

సవ్యసాచి: అతనా?

భైరవ: హా! వాడే!

వాడు కూడా మనలా అవేకెనరే.

సవ్యసాచి: మనలా అవేకెనరా?...

భైరవ: హా! వాడి దెగ్గరికేళ్తే నీ చర్మం వొలిచి కడ్రాయర్ కుట్టించుకుంటాడు.

సవ్యసాచి: కడ్రాయరా? నా చర్మంతోనే ఎందుకు? షాప్లో కూడా అమ్ముతారు కదా? పాపం డబ్బుల్లేవేమో?

భైరవ: వెళ్లి నీ దెగ్గరుండే వాటిల్లో జత దానం చేయ్ పో!

సవ్యసాచి: కానీ నా సైజు అతనికి సరిపోతుందంటావా?

భైరవ ఆమె అమాయకత్వం చూసి నోరు వెల్లబెట్టి చూస్తాడు.

భైరవ:.... ఆపేహే నీ కడ్రాయర్ గోలా!

వాడి దెగ్గరికెళ్లాలని ఏమాత్రం ఆలోచించకు.

ముఖ్యంగా నీ ఎదురుగా ఒక అవేకనర్ ఉన్నప్పుడు.

నా అంచనా ప్రకారం ఆ పిల్లికి వాడికీ ఏదో సంబంధం ఉంది.

మంచిదైంది. వీడు నన్ను తరుముతున్న పోరంబోకుల్లో ఒకడు కాడు. -భైరవ

ఇతను పిల్లి కోసం వచ్చాడా? -సవ్యసాచి

వీడు శక్తులు ఉపయోగించి పిలిచాడంటే పిల్లి కోసమే ఆయుంటుంది. -భైరవ

~~~హిస్స్~~~~

పిల్లి కోపంతో ఆ వ్యక్తి మీద కోరలతో దాడి చేయడానికి పరుగులు తీస్తుంది..

కోపంతో అతని మీద ఎగిరి దూకి పంజాలతో దాడి చేయబోతుంది.

"హీహీ!"

అతను కన్నింగ్గా నవ్వుతాడు.

పిల్లి గాలిలో ఎగిరి అతని మీదకు దూకబోతుండగా అతని శక్తి తో చేతిని పైకి ఎత్తి కదుపుతాడు.

అతని చేతిని కదుపుతున్నప్పుడు గాల్లో ఉన్న పిల్లి కదులుతూ గోడకు వెళ్లి కొట్టుకుంటుంది.

బలంగా దెబ్బ తగలటం వల్ల నోటి నుంచి రక్తం వాంతు చేసుకుంటుంది.

"ముందే అనుకున్నా! ఇది ఒక్క దెబ్బకే చావదని!"

అతని కళ్ళు ఎర్రగా మెరుస్తాయి.

మరి కొన్ని సార్లు పిల్లిని గోడకు, నేలకు వేసి బలంగా కొడతాడు.

పిల్లి నొప్పికి గట్టిగా అరుస్తుంది.

అతని శక్తితో పిల్లిని గాల్లో లేపి నిలపెడతాడు

"దీన్ని కూడా తట్టుకుంటుందా? చూద్దాం!"

ఎంతో ఎత్తు నుంచి నేల మీదకు విసిరి కొడతాడు.

పిల్లి గాయాలతో వణుకుతూ మెల్లగా కదులుతుంది.

"అరే అరే.. పైకి లే!.. లేవవా?"

అతని శక్తితో పిల్లిని గాల్లోకి లేపి గోడకేసి కొడుతూ ఉంటాడు.

***

సవ్యసాచి గుండె జల్లు మంటుంది.

భైరవ: అరే ఛా! ఆ భోగ్గాడు బాగా పవర్ఫుల్ స్కిల్స్ ఉన్న అవేకెనర్లా ఉన్నాడు.

అతని చేతి వెళ్ళ చిన్న కదలికలను ఉపయోగించి ఇంత ధ్వంసం చేస్తున్నాడంటే వీడు సామాన్యుడు అయుండడు.

వాడి శక్తి యొక్క కదలికలను బట్టి చూస్తే...

వీడు సైకోకెనెటిక్ ఆ?..