webnovel

ఫరీద: నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్

ప్రొలోగ్: ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను.... కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?.... ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు ..... ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే .... అంతం అయ్యేది నా చావుతోనే .... ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా.. ఏ జాతి అయినా.. ఏ మతం అయినా.. నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను... ఇది నా కధ ... నా కధ కి మొదలు నేనే ... అంతము నేనే .... "నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ " "నా పేరే ఫరీదా"

SAVYASACHI · Fantasy
Not enough ratings
25 Chs

NOT: CH17

──•~❉᯽❉~•──

ఫరీదా అబ్రాడ్ కి వెళ్ళడానికి అవసరమైన వన్నీ, ఆ నలుగురి స్థానంలో ఉండే షేప్షిఫ్టర్స్ చేత రెడీ చేయించుకుంటుంది. వాళ్ళు వీసా, పాస్పోర్ట్ మిగతా ముఖ్యమైన వస్తువులు డ్రైవర్ చేత పంపుతారు.

వీసా, పాస్పోర్ట్, ఎయిర్పోర్ట్ లో దించడానికి కార్, ఎట్సిట్రా.. అన్ని ఫరీద కు చేరుకున్నాయి.

రెండు రోజుల తర్వాత.

──•~❉᯽❉~•──

ఫరీద నిద్ర లేచి బయటికి వస్తుంది. బ్రష్ చేస్తూ దిక్కులు చూస్తూ, ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ వైపు చూస్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు.

ఫరీద,

"ఈ విధికి పట్టిన దరిద్రాలలో మరొకటి వదిలింది~"

ఒక రోజు క్రితం,

ఆ మేడ మీద ఉండే అమ్మాయి కాల్ డేటా, వాట్సాప్ డేటా, ఫేస్బుక్ డేటా, ట్విట్టర్ డేటా, ఇంస్టాగ్రాం డేటా, మిగతా అడల్ట్ ఆప్స్ డేటా మొత్తం హ్యాక్ చేసి (ఫోన్ హాక్ చేసి)  టెక్స్ట్ , ఆడియో, వీడియో మెసేజ్లు అన్నిటినీ అనామకుడి అకౌంట్ తో అతని భర్తకు ఆ నలుగురి లో ఒక షేప్షిఫ్టర్స్ చేత పంపించింది.

వాళ్ళ నలుగురికీ హోటల్లో, పబ్ల లో ప్రైవేటు రూమ్స్, బెడ్రూమ్, బాత్రూమ్స్, రహస్యంగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ చేసి వీడియోస్ వెబ్సైట్ లలో పెట్టడం, ఇతరుల మొబైల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ హాక్ చేయటం బాగా వచ్చు.

ఫరీద,

"చదువులు చదివితే ఏదయినా సాధించేలా ఉండాలంటారు. వీళ్ళ చదువు ఇలాంటి పనులకు ఉపయోగిస్తున్నారు."

"ఈ వెదవలు వీళ్ళ టాలెంట్ ను మన దేశం కోసం వాడితే మన దేశం ఎప్పుడో అన్ని దేశాలకు పోటీగా నెంబర్.1 గా మరుండేది. ఈ విషయం ఇప్పటికి పక్కన పెడదాం."

ఆ పిల్ల భర్త విషయానికి వస్తే, అతను మొదట్లో తను ప్రాణంగా అభిమానించిన భార్య తనను మోసం చేస్తూ ఎన్నో తప్పుడు పనులు చేస్తోందని బాధతో కుంగి పోయాడు. అతని భార్య చేసింది చిన్న తప్పు కాదు! పెద్ద నేరం! మోసం! అందుకని అతను కోపం, ఆవేశం తో అతని భార్యను తిట్టినా, కొట్టినా న్యాయమే! కానీ అతను మంచివాడు. ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకోడు~

ఫరీద,

"నేను ఊహించినట్టే వీడాకుళికి అప్లై చేసి ఆమెను పుట్టింటికి పంపేశాడు."

ప్రస్తుతం,

స్నానం చేసి, రెడీ అయ్యి, కుటుంబంతో చివరిసారిగా భోజనం చేసి మెట్లుదిగి లగేజీ తీసుకెళ్ళి కార్లో పెడుతుంది.

కార్లో కూర్చుని చివరి సారిగా తన కుటుంబానికి వీడ్కోలు చెప్పి తన ప్రయాణం మొదలు పెడుతుంది.

కార్లో వెళుతూ ఉండగా,

ఇదా,

"బాధగా ఉందా ఫర్రు?"

ఫరీద కన్నీళ్లు తుడుచుకుంటూ,

".. హ్మ... కొంచం... కాదు! చాలా!... నేను వాళ్ళ కన్న కూతురిని కానని వాళ్లకు కూడా తెలీదు పాపం. ఇన్నాళ్లు నన్ను కన్న కూతురిలా పెంచి పెద్ద చేసారు కదా! అందుకే విడిచి పెట్టి వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది! మరి నీకు?"

ఇదా,

"హ్మ్?? నాకేం బాధగా లేదు~ హాయిగా ఉంది. పేరుకి అంత ఫీల్ అవుతున్నారే గానీ. నీకు ఉద్యోగం లేదని తెలిసినప్పుడు వాళ్ళు నిన్ను ప్రతిరోజూ తిట్టి మానసికంగా హింసించడం నాకు తెలియదు అనుకుంటున్నావా?"

ఫరీద,

"పర్లేదు వదిలేయ్! వాళ్ళూ మనుషులేగా~"

ఇదా,

"హా~ మనుషులే~ స్వార్ధపు మనుషులు! మాటల్లో కనిపించే ప్రేమ గుండెల్లో లేదు."

ఫరీద,

"కొప్పడకు బాబు! వాళ్ళు ఇన్నాళ్లు నన్ను పెంచి పెద్ద చేసారుగా దానికి బదులుగా ఈ డబ్బు ఇస్తున్నాను."

ఇదా,

"నీకెందుకు కోపం రబట్లేదో నాకు అసలు అర్థం కావట్లేదు!"

ఫరీద,

"ఎందుకంటే, నాకు తోడుగా నువ్వున్నావుగా!"

ఇదా సంతోషంతో,

"మరి నేను నస గాడ్నిగా! నన్ను భరిస్తావా?"

ఫరీద నవ్వుతూ,

"హా! నాకు నీ గోల తప్పుతుందా? కలిసి పుట్టాం, కలిసి పెరిగాం..."

ఇదా,

"చావులో కూడా కలిసే ఉందాం."

ఫరీద నవ్వుతూ,

"హ్మ్.. నాకు తప్పుతుందా!?"

ఫరీద లగేజ్ బ్యాగ్ ని తెరిచి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగి, బాటిల్ ను తిరిగి బ్యాగ్ లో పెట్టే సమయంలో బ్యాగ్ లోపల ఒక గోల్డెన్ బ్రేస్లెట్ కనిపిస్తుంది.

వాటర్ బాటిల్ ను పక్కన పెట్టి ఆ గోల్డెన్ బ్రేస్లెట్ ను చేతిలోకి తీసుకుంటుంది.

──•~❉᯽❉~•──

దీని పేరు,

"ట్రాన్స్మేరోలిన్ షీల్డ్"

షార్ట్కట్లో "షీల్డ్". ఆ గోల్డెన్ బ్రేస్లెట్, ఎర్రటి రంగు రూబీ లతో చూడటానికి నిజమైన బంగారముతో చేయబడినట్లు ఉంది. కానీ,..

దీనిలో పొదగబడి ఉన్న బంగారం, వజ్రాలు ఈ లోకం లోని బంగారం కంటే ఎన్నో రెట్లు విలువైనది, దృఢమైనది. ఈ బ్రాస్లెట్ ను  ఎన్ని పదునైన వజ్రాలతో కోసినా, అణుబాంబు పెట్టి పేల్చినా చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది.

ఈ బ్రాస్లెట్ వీల్డర్ యొక్క ఎంపిక ప్రకారం, రూపం, ఆకారం మారుతుంది.

ఈ బంగారం నేల నుండి పుట్టినది కాదు. ఈ ఎర్రటి వజ్రాలు కార్బన్ వల్ల తయారయినవి కావు.

──•~❉᯽❉~•──

ఒక షాపింగ్ మాల్ వద్ద కార్ ఆగుతుంది.

మాస్టర్ ..

ఫరీద స్పృహలోకి వచ్చి,

"హ్మ్?"

...షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నాము.

ఫరీద,

"హా?! సరే!"

ఈ డ్రైవర్ ఒక షేప్ షిఫ్టర్.

షాపింగ్ మాల్ లోకి వెళ్లిన కాసేపు తర్వాత షాప్ ఓనర్ వచ్చి ఫరిద ను పలకరిస్తాడు.

షాప్ ఓనర్,

"మాస్టర్, మీకు కావల్సిన వస్తువులన్నీ ఇక్కడ సమకూర్చి  ఉంచాను. భవిష్యత్తులో మీకు ఏమైనా వస్తువులు కావాలంటే నాకు ఆ లిస్ట్ ను తెలీపతీ ద్వారా పంపండి చాలు. క్షణంలో అన్నిటినీ సమకూరుస్తాను. మరి ఇక సెలవు తీసుకుంటాను."

షాపింగ్ మాల్ లో చుట్టూరా చూస్తూ లోపలికి వెళుతుంది.

షాప్ మేనేజర్ ఫరీద వద్దకు వచ్చి,

షాప్ మేనేజర్,

"మాస్టర్, ఇటు వైపు పదండి. మీకు కావలసిన వస్తువులను చూపిస్తాను. ఈ స్టోరేజ్ పోర్టల్ లో అన్నీ వస్తువులను పాక్ చేసి ఉంచాను. వీటితో పాటుగా మరేమైనా కావాలంటే దయచేసి నన్ను పిలవండి."

అని చెప్పి షాప్ మేనేజర్ వెళ్లి పోతాడు.

ఆ స్టోరేజ్ పోర్టల్ లో మరికొన్ని సామాన్లు చేర్చి అవసరమైన దుస్తులు ఇతర వస్తువులు కొన్న తర్వాత,

షాప్ వర్కర్,

"మాస్టర్, ఈ వస్తువులను మీ స్టోరేజ్ పోర్టల్ లో సమకూర్చడం జరిగింది. ఇక మీరు బయలుదేరడమే మిగిలింది. మీకు భవిష్యత్తులో కావలసిన వస్తువులన్నీ ఇలాగే పోర్టల్ లో సమకూర్చడం నా బాధ్యత. ఇక సెలవు."

షాప్ వర్కర్ వెళ్ళిపోతాడు.

షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చి కార్లో కూర్చుంటుంది. కార్ బయలుదేరుతుంది.

ఫరీద తన చేతికి ఆ గోల్డెన్ బ్రాస్లెట్ ధరించింది.

మీరు అనుకున్నది నిజమే. షాప్ మేనేజర్, షాప్ ఓనర్, షాప్ వర్కర్,.. వీళ్ళు అందరూ కూడా షేప్ షిఫ్టర్లే! అంతెందుకు షాప్ లో పని చేసే క్లీనర్, వాచ్మెన్... అందరూ షేప్ షిఫ్టర్లే!~

నేను, ఇదా మర్డర్ చేసిన ఆ నలుగురు డబ్బుతోనే ఈ షాపింగ్ మాల్ పెట్టించాను.

ఇంత డ్రామా ఎందుకు? ఎవరికైనా దొరికి పోతే సమస్యలో పడటానికి అవకాశం ఉందని మీరు అనుకోవచ్చు.

కానీ కథలో ప్రాబ్లమ్స్ లేకుంటే థ్రిల్ ఏం ఉంటుంది?

అందులోనూ నాకు డబ్బు అవసరం. ఆ నలుగురి పైనా ఆధార పడకుండా, ఒక షాపింగ్ మాల్ పెట్టించాను.

ఎందుకంటే,....

*బంగారు రంగులో ఫరీద కళ్ళు మెరుస్తూ ఉండగా, చిరు నవ్వు నవ్వుతూ*

"అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతోంది."

──•~❉᯽❉~•──

ఇంకా ఉంది...

─── ・ 。゚☆: *.☽ .* :☆゚. ───