webnovel

ఫరీద: నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్

ప్రొలోగ్: ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను.... కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?.... ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు ..... ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే .... అంతం అయ్యేది నా చావుతోనే .... ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా.. ఏ జాతి అయినా.. ఏ మతం అయినా.. నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను... ఇది నా కధ ... నా కధ కి మొదలు నేనే ... అంతము నేనే .... "నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ " "నా పేరే ఫరీదా"

SAVYASACHI · Fantasy
Not enough ratings
25 Chs

NOT: CH 23

──•~❉᯽❉~•──

అతను వేగంగా ఆ పాముని కుడి చేత్తో పట్టుకొని ఆకాశంలోకి దూరంగా విసిరేసాడు.

ఆ పాము పక్షుల మధ్యలో ఎగురుతూ, ఆనందంతో *అమ్మా! నేనూ పక్షిలా ఎగురుతున్నాను.. నన్ను చూసి గర్వపడు♡*

ఆ పాముని ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి ఎత్తుకు పోతుంది.

ఆ క్షణం లో ఫరీదా ఇదా గా మారుతుంది.

ఫరీద లోని ఇద ఆమెను ఆవహిస్తాడు. తనకు ముందే అతను ఫరీదను కాపాడటంతో ఇదా శాంతిస్తాడు.

ఫరీదాకు ఆమె జీవించిన గ్రహపు విషం వల్ల ఎటువంటి హాని కలగదు. కానీ ఈ గ్రహం లోని విషం యొక్క గుణగణాలు వేరు కనుక ఇదా రిస్క్ తీసుకోకుండా అప్రమత్తంగా ఉంటాడు.

ఫరీద శరీరం లోని ఇదా,

"నన్ను రెండో సారి కాపాడి నందుకు చాలా థాంక్స్!-"

"ఎవరు నువ్వు?"

ఇదా ఆశ్చర్యంతో తలగోక్కుంటూ,

*హా? ఏమయింది? నేనే!?"

ఎర్రటి కళ్ళతో,

"కాదు!... నువ్వూ తనూ వేరు!"

ఇదా,

*కికికికికి.. అబ్బా చెప్పిందానికల్లా తోక ఊపుకుంటూ వస్తుంటే అందరిలా ఎర్రోడివని అనుకున్నా~ పర్లేదు తెలివైనోడివే. ఆహా!క్షణంలో మాట తీరు, చూసే చూపు... మొత్తం మనిషివే పూర్తిగా మారిపోయావ్? ఏంటి కథ? (ఆట పట్టిస్తూ) నచ్చానా? అంటే నచ్చిందా?"

సూటిగా చూస్తూ,

"ఆఖరి సారిగా అడుగుతున్నాను! ఎవరు నువ్వు?"

విసుగుతో,

ఇదా,

*సరేలే~ ఎక్కువగా ఫీలయి పోకు~ నా పేరు ఇదా!. నేను ఈ పిల్లకి అన్నయ్యని! కావాలంటే కాసేపు తర్వాత తననే అడుక్కో~ నా గురించి ఎంత గొప్పగా చెప్తుందో. ఆ పాము సడెన్గా కనిపించే సరికీ నేను నా చెల్లిని కాపడుకుందామని బయటికి వచ్చాను అంతే~ ఇంకేం చెప్పాలి? హా?"

"..... అన్నయ్య..."

ఇదా ఆట పట్టిస్తూ,

"అవును బావా! నీకు నా చెల్లి నచ్చిందా? చెప్పు!? ఈ పిల్లని ఎలా పడేయాలో హెల్ప్ చేస్తా!"

"..."

ఫరీద ఇదా ను మైండ్ లోపల నుంచి బాగా తిడుతుంది.

ఇదా,

*అబ్బా! ఫర్రు బేబీ! తిట్టకే బాబు! (అతని వైపు మైకంగా చూస్తూ చెయ్యి ఊపుతుంది) సరే! బాయ్ హాన్సమ్!" -అని కన్ను కొడతాడుll.

"....."

ఫరీద చేతుల్లో మరిన్ని తిట్లు తిని ఇద్దరు తిరిగి శరీరం మార్చుకుంటారు.

ఫరీద,

"సారీ అబ్బాయ్! చెత్త ఎదవ! పిచ్చి-పిచ్చి మాటల్తో ఎప్పుడు చూసినా నాకు చిరాకు తెప్పిస్తుంటాడు. వాడు నీతో తప్పుగా ప్రవర్తించి అంటే క్షమించు-"

"పర్లేదు! ఫర్రు బేబీ"

ఫరీద గుండె ఝల్లుమంది.

ఫరీద తికమకతో,

"హా? ఏమన్నావ్??"

"అది మీ పేరు కాదా?"

ఫరీద అర్థం చేసుకుని నుదిటిపైన చమట తుడుచుకుంటూ,

"ఓహ్! అది నా పేరు అనుకున్నావా?! ఎవరినీ ఇంకోసారి బేబీ అని పిలవకు! తప్పుగా అనుకుంటారు."

".....సరే.."

ఫరీద,

"అది నా పేరే! నా పూర్తి పేరు ఫరీద! ఫర్రు, ఫరీ, బేబీ అని వాడు నన్ను పిలుస్తుంటాడు మేమిద్దరం క్లోస్ కాబట్టి వాడు నన్ను అలా పిలుస్తాడు అంతే~ నువ్వు అపార్థం చేసుకోకు."

".... క్లోస్?"

ఫరీద మాట మారుస్తూ,

"సరే! ఇక ఈ కట్టెలు చాలు! వెళ్దామా?"

"సరే"

కట్టెలు అన్నిటినీ గాలి బాలూన్ని ఎత్తినట్టు ఒక్క చేత్తో ఎత్తుకొని నిలపడుతాడు. ఫరీదా ఆశ్చర్యంతో అవి అంత బరువు ఉండవేమో అని భావించి, ఒక కట్టెను చేత్తో పైకి ఎత్తుతుంది. ఆ బరువు చాలా ఉండటం తో మోయలేక కింద పడేస్తుంది.

ఫరీద,

"అబ్బా! ఇంత బరువు ఎలా మోస్తున్నావు? నేను ఒక్క కట్టెను కూడా పైకి ఎత్త లేక పోయాను!"

"నాకు అలవాటు"

ఫరీద,

"అవునులే~ నేనూ నీతో ఇలాగే అడవిలో ఉండి రోజూ కట్టెలు మోస్తూ సాధన చేస్తే నాకూ నీలా కండలు వస్తాయా?"

*తనను తాను అతనిలా కండలతో ఊహించుకుని*

"ఛా!! వద్దులే! అప్పుడు నేను అమ్మాయిలానే ఉండను~ ఇలా ఉంటేనే మావళ్ళు మగరాయిడిలా మాట్లాడుతావు అని తిట్టే వాళ్ళు ఇక కండలు పెంచితే నాకు అబ్బాయికి బదులుగా అమ్మాయిని చూసి పెడతారు."

*మర్చిపోయా నేను వాళ్ళ దృష్టిలో చనిపోయాను కదా~*

ఫరీదా ఆలోచనలు అర్థం కాక పోవటంతో అతను అయోమయంలో పడతాడు.

ఫరీద,

"నువ్వు అవి మోయక్కర్లేదు~ ఇలా ఇవ్వు ఈ షీల్డ్ లో వాటిని ఒక్కొక్కటిగా పడేయ్!"

ఫరీదా చెప్పినట్టే అతను చేస్తాడు. అతను ఆ చెక్కలు తన చేతిలోకి వెళ్ళటం చూసి ఆశ్చర్యపోతాడు.

ఇదా,

*ఏంటి ఫరీ? అతనికి చెమటలు పడుతుంటే ఒక సారి చూద్దామని అనుకున్నా! మొత్తం చెడకొట్టేసావ్!*

ఫరీద నవ్వుతూ,

*నీ వక్రబుద్ధి నుంచి నా కొత్త ఫ్రెండ్ నీ ఎలా కాపాడుకోవాలో నాకు తెల్సు! కికికికికి!*

ఇద్దరు కలిసి అడవి దారిలో వెళుతున్నప్పుడు ఫరీదా కు ఒక చోట నేల బొగ్గు కనిపిస్తుంది.

ఆ చుట్టూరా కొంచం తడిగా, కొంచం పొడిగా ఉంటుంది. ఫరీదా ఆసక్తితో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ నేల బొగ్గుని మట్టి నుంచి తవ్వి చేతిలోకి తీసుకుంటుంది. నేల బొగ్గు పైకి తడిగా ఉన్నా లోపల మాత్రం గట్టిగా రాయిలా కనిపిస్తుంది.

ఫరీదా మొఖంలో ఆసక్తి చూసి అతను కూడా నేల బొగ్గుని తవ్వడానికి సహాయం చేస్తాడు.

అవసరమైనంత నేల బొగ్గు తీసుకొని స్టోరేజ్ లో పెట్టి బయలు దేరుతారు.

దురంలో నుంచి ఫరీదాకు మంచి వాసన తెలుస్తుంది. దెగ్గరకు వెళ్లి తాకి చూడగా అది గంధపు చెట్టు అని తెలుస్తుంది.

కానీ ఏ లోకంలో అయినా గంధపు చెట్లను నరకడం తప్పు. అందుకే ఫరీదా నిట్టూర్పుతో అక్కడి నుంచి బయలుదేరుతుంది.

నది చుట్టూరా రంగులతో మెరిసేటి చిన్న చిన్న ముక్కలుగా పడి ఉన్న క్రిస్టల్స్, వజ్రాలు, బంగారపు ముక్కలు కనిపిస్తాయి. కానీ ఫరీదా వాటిని చూసి కూడా చూడనట్టు ఆశ చంపుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది.

ఇద్దరూ కలిసి అడవి లోకి షికారుకు వెళతారు. ఫరీదా కొత్త-కొత్త చెట్లు, పళ్ళు, పూలు, జంతువులు, పక్షులను చూసి సమయాన్ని వినోదంతో గడుపుతుంది. 

ఇద్దరూ ఇంటికి చేరుకొని వంట సామాగ్రిని సమకూరుస్తారు. ఫరీదా వంటకు కావలసిన వస్తువులన్నీ లిస్ట్ రాసి షేప్ షిఫ్టర్లకు పంపి వస్తువులను అందుకుంటుంది.

ఫరీద,

*ఓకే! ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి! వండటమే మిగిలింది.*

"ముందు నేను ఎక్కడ పెట్టిన కూరగాయలు అన్నిటినీ ఇలా కోసి పెట్టాలి. రా ఇద్దరం కలిసి కొద్దాం!"

ఇద్దరు కలిసి పనులు పంచుకొని వంట చేయటం మొదలు పెడతారు.

ఇద్దరూ కలిసి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిరపకాయలు,..... మొదలుగునవి కోసి పక్కన పెట్టుకుంటారు.

ఫరీద,

".....నాకంటే నువ్వే వేగంగా పని చేస్తున్నావ్~"

"...."

ఫరీద,

"సరే! ఇప్పుడు సరిపడా బియ్యం కడిగి పెట్టుకోవాలి."

*5 కేజీ బియ్యం వేద్దాం~ నేను ఇక్కడి నుంచి వెళ్ళాక నాకూ, ఇతనికి, తాత కి మరో రెండు పూటలు తినడానికి ఉంటది*

"ఈ చికెన్ నీ శుభ్రంగా కడుగు"

*2½ కేజీ చికెన్ సరిపోతుందా? సరిపోద్దిలే!*

బిర్యానీ ఉడుకుతున్నప్పుడు,

ఫరీద,

"అబ్బాయ్! ఇలా రా!"

అతను ముందుకు వస్తాడు. ఫరీదా గరిటెతో కొంచం అన్నం తీసి రుచి చూడమని అతనికి చూపిస్తుంది.

ఫరీద,

"ఇందులో నీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసి చెప్పు"

అతను దిక్కులు చూసి వెళ్ళబోతాడు.

ఫరీద,

"ఏమైంది? ఇక్కడికి?"

"నా చెయ్యి మురికిగా ఉంది."

ఫరీద,

"అంతేగా~ ఇలారా నా చెయ్యి సుబ్రంగానే ఉంది. ఆ పట్టు!"

అతనికి ఒక అన్నం ముద్ద తినిపిస్తుంది.

ఫరీద,

"ఎలా ఉంది? ఉప్పు సరిపోయిందా? ఏమయినా ఎక్కువ తక్కువలు ఉన్నాయా?"

"బాగుంది."

ఫరీద సంతోషంతో,

"కదా! ఇక అన్నం ఉడికి పోయింది కాబట్టి ఇక కట్టెలు తీసేసి కాసేపు ఆవిరి పోనివ్వాలి... అంతే!"

అలా ఇద్దరు కలిసి బిరియాని వండటం పూర్తి చేస్తారు.

ఫరీదా వండిన అన్నం లో నుంచి కొంచం-కొంచం గా పక్కకు తీసి కారేజ్ బాక్స్ పాక్ చేసి ఉంచుతుంది.

అది అతను చూసి,

"ఇవి.. ఎవరికీ?"

ఫరీద,

"..మా తాతకి! నేను చేసిన వంట కనుక పంపకుంటే నా పైన అలుగుతాడు."

*ముసలోడు పెట్టే ఆ బుంగ మూతి మాత్రం అచ్చం కోతి మూతిలా కామెడీగా ఉంటుంది. కికికికికి*

"ఈ కుంచమే అతనికి. ఇదంతా మనకే!"

ఇదా,

*మరి నాకూ?*

ఫరీద నవ్వుతూ,

*నేల మీద పడి నాకు! కికికికికి*

అతను ఆ లంచ్ బాక్స్ వైపు చూసి గట్టిగా పిడికిలి బిగిస్తాడు.

ఇద్దరూ తినడానికి ప్లేట్ లో అన్నం సిద్ధం చేస్తుంది.

ఫరీద,

"ఇదిగో తిను!"

అతని చెయ్యి వైపుగా చూసి,

ఫరీద,

"ఏమైంది? నీ చేతికి రక్తం ఏమిటి?"

అతను కూడా తన చెయ్యిని చూసి ఆశ్చర్యపోతాడు. తన జీవితంలో ఇతరులను గాయపరచడమే గానీ ఇతరుల కోసం తనను తాను ఎప్పుడూ గాయ పరుచుకోలేదు.

──•~❉᯽❉~•──

ఇంకా ఉంది...

─── ・ 。゚☆: *.☽ .* :☆゚. ───