webnovel

ఫరీద: నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్

ప్రొలోగ్: ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను.... కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?.... ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు ..... ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే .... అంతం అయ్యేది నా చావుతోనే .... ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా.. ఏ జాతి అయినా.. ఏ మతం అయినా.. నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను... ఇది నా కధ ... నా కధ కి మొదలు నేనే ... అంతము నేనే .... "నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ " "నా పేరే ఫరీదా"

SAVYASACHI · Fantasy
Not enough ratings
25 Chs

NOT: CH 15

──•~❉᯽❉~•──

"IDA అతని గత జన్మల జ్ఞాపకాలలో కొన్ని సంఘటనలు ఫరీదకు చూపిస్తాడు.

ప్రతీ జన్మలో అతను చాలా క్రూరమైన, నీతి మాలిన, సిగ్గు లేని, భయం లేని, జాలి చూపించని, దయ కలగని, తాగు బోతు, తిరుగు బోతూ,... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు.. వాడికి నచ్చినట్టు బతికిన ఏకైక ప్రాణి.

కానీ దానితో పాటుగా... ప్రతి జాన్మలోనూ అతను అనాధ లాగానే బతికాడు. పిలిచి అన్నం పెట్టడానికి తెల్లి లేదు. తప్పు చేస్తే దండించడానికి తండ్రి లేడు. భుజం పైన ఎత్తుకు తిప్పడానికి అన్న లేడు. మంచి చెడ్డలు నేర్పించడానికి అక్క లేదు. అల్లరి చేస్తూ ఆడుకోవడానికి తమ్ముడు లేడు. బాధ్యతతో రక్షించు కోవడానికి చెల్లి లేదు.

ఆకలి, దాహం, ఒంటరితనం, నాకు తోడుగా ఎవరు లేరే అని మనసులో ఆవేదన, అందరూ తాము తమ కుటుంబం తో సంతోషంగా ఉండటం చూసి అసూయ, బలవంతులైన వారి చేతుల్లో దెబ్బలు తిని ఓడిపోవడం, నమ్మిన వ్యక్తి చేతుల్లో మోసపోయి వెన్నుపోటు తో మరణించడం.

మనసులో కోపం, క్రోధం, అసహ్యం, అసూయ,...

ఫరీద,

"హా? నేను ఇప్పటి వరకు చూసింది తన 13 జన్మల జ్ఞాపకాలు!? మరి ఇప్పుడు నేను చూస్తుంది ఈ జన్మ జ్ఞాపకాలు!!?"

Ida 13 జన్మలూ చాలా దారుణమైన జ్ఞాపకాలతో మూటకప్పి ఉన్నాయి. కానీ,

ఫరీద,

"నాతో ఉన్నప్పుడు మాత్రం,.. "

Ida జన్మ యొక్క పూర్తి జ్ఞాపకాలు చూడటం ముగించిన తరువాత, ఈ జన్మ లో ఫరీద తో ఉన్నప్పటి జ్ఞాపకాలు,..

మొదట్లో పగ, సంకోచన, విసుగు ,.... చూపే వాడు. కానీ నా వయసు పెరిగే కొద్దీ ida తన ఇష్టాలు, అలవాట్లు, భావాలు,... మొత్తం మార్చుకోవటం మొదలు పెట్టాడు.

ఈ క్షణం వరకూ తను చూసిన ida జ్ఞాపకాలను నమ్మ సఖ్యం కానివి.

ఫరీద చుట్టూ చీకటి అలుముకుంది.

ఫరీద,

"హా? ఏం జరుగుతోంది? నేను ఎక్కడున్నాను? చీకటిగా ఉంది?*

చీకటి ప్రదేశంలో నడుచుకుంటూ వెళుతూ ఒక ప్రదేశం లో ఆగింది.

ఎదురుగా అవే మెట్లు, అదే సింహాసనం, దాని చుట్టూ అవే వికారమైన, భయంకరమైన రూపాలు,..ఆ చీకట్లో, వాటి మధ్యలో ఆ సింహాసనం పైన కూర్చొని బంగారు రంగులో మెరుస్తున్న కళ్ళతో నన్ను సూటిగా చూస్తున్న ఒక వ్యక్తి.

ఫరీద,

"Ida?.. నువ్వేనా?"

ఎదురుగా ఉన్న వ్యక్తి గొంతు,

"Ida కాదు! Ida బేబీ!~ kekeke...."

ఫరీద కోపంతో మెట్ల పైకి పరిగెత్తుకు వెల్లి ida చెవి పట్టుకుని లాగి,

ఫరీద,

"పనికి మాలిన ఎదవ! నేనెంత భయపడ్డానో తెల్సా? ఇంకోసారి నీ పిచ్చి పూ.. జిత్తులమారి  ట్రిక్స్ నా పైన ఉపయోగించావో నీ తోలు తీసి ప్యాంటు, షర్టూ కుట్టించు కుంటా!"

IDA,

"Ow! Ow! Ow! Ow!.... నా చెవి.... గట్టిగా లగకే రాక్షసి!.. ఆహ్... నొప్పి..."

Ida చెవి వదిలి పెట్టీ,

ఫరీద,

"ఓయ్! మీ పిచ్చి మోకాలు, చేష్టలు చూసి ఇంకెవరైనా భయపడతారేమో! నాకు కోపం తెప్పిస్తే మీ అందరినీ కీమా కొట్టేసే మిషెన్ లో పడేస్తా!"

ఆ ఆకారాలు ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటూ,

మాస్టర్... మాస్టర్...

మాస్టర్... మాస్టర్...

మాస్టర్... మాస్టర్...

అని భయపడుతూ ida వెనుకకు వెళ్ళి దక్కుంటాయి.

Ida నవ్వుతూ,

"Farru బేబీ! నువ్వు కోపంలోనూ చాలా ముద్దుగా ఉన్నావ్! అవునులే! నా చెల్లంటే ఆమాత్రం అందం, పొగరు ఉండాలి!"

ఫరీద నవ్వాపుకుంటూ,

"సరే! సరే! పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించకు!"

Ida నవ్వుతూ వెళుతురిలోకి వచ్చి నిలబడతాడు, ఫరీద వెనక్కి తిరిగి ida మొకం చూస్తుంది.

ఫరీద,

"హా?"

Ida మొకం చూస్తూ,

*నల్లటి వెంట్రుకలు, వోల్ఫ్ కట్ హేర్ స్టైల్, చిన్న మచ్చ కూడా లేని తెల్లటి చర్మం, బంగారు రంగు కళ్ళు, మందపాటి కనుబొమ్మలు, షార్ప్ నోస్, స్ట్రాబెర్రీ రంగు పెదాలు, మహారాజుల వంటి గడ్డం, మీసాలు, షార్ప్ జాలైన్, అందమైన మొకం,....."

Ida, ఫరీద బుగ్గలను రెండు చేతులతో మెల్లగా లాగి,

Ida,

"ఏంటి? నేను అంత అందంగా ఉన్నానా? కళ్ళార్పకుండా చూస్తున్నావ్? నాకు దిష్టి తగులుతుందే,మో!? Kekeke.."

ఫరీద,

"గా ఫుగ్గలు ఫగుఉ.."

*అనువాదం:  నా బుగ్గలు వదులు..*

బుగ్గలు వదిలి,

IDA,

"నా అసలు రూపాన్ని చూడటం నీకు ఇదే మొదటిసారి కదా! అందుకే ఆశ్చర్య పోతున్నావా?!... అవునులే నేను అండగాడినే..."

అలా తనను తాను పొగడ్తలతో డబ్బా కొట్టుకుంటూ ఉండగా,

ఫరీద మొఖంలో అసంతృప్తితో,

ఫరీద,

"నీ మొఖం....."

IDA,

"ఏంటి farru బేబీ?"

ఫరీద నుదుటి మైన చెయ్యి పెట్టుకొని,

".... మనిద్దరికీ అస్సలు పోలికలు లేవు!"

IDA,

".... హ?"

ఫరీద కన్నీళ్లు పెట్టుకుంటూ,

"..నువ్వేమో సినిమా హీరోలా ఇంత అందంగా ఉన్నావ్! కానీ నేనేమో ఒక ఏవరేజ్... కాదు! నీ అందంలో 10% అందం కూడా నాకు లేదు!...."

IDA నవ్వు ఆపుకుంటూ,

"అరెరే! నువ్వు తప్పుగా అనుకుంటున్నావ్! నిన్ను నువ్వు అందంగా లేవని భ్రమ పడుతున్నావు! నువ్వు ఎంత అందంగా ఉంటావో నికే తెలీదు!.."

ఫరీద ఏడుస్తూ,

"నువ్వేమో తెల్లగా ఉన్నావ్! కానీ నేను మాత్రం చామంచాయ రంగులో ఉన్నాను...."

IDA కళ్ళు తుడుస్తూ,

"ఆహ్! Farru! నీ చుట్టూ ఉన్న అందరూ అమ్మాయిలు తెల్లగా ఉన్నవారే అందమైన వారని ప్రచారం చేయటం వల్ల నువ్వూ వాళ్ళలా తప్పుగా అనుకుంటున్నావు! నువ్వు నా చెల్లివి! చర్మం రంగు కుంచం వేరుగా ఉండొచ్చు కానీ మనిద్దరి అందానికి ఏమాత్రం తేడా లేదు!"

ఫరీద ఏడుపు ఆపుకుంటూ,

"హా? నిజంగా నా?.."

IDA ఫరీద ముక్కును కేర్చీఫ్ తో తుడుస్తూ,

"అవును! అసలు నీకు ఇలాంటి పిచ్చి డౌట్లు ఎందుకొస్తున్నాయి?"

ఫరీద,

"అంటే,.. చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్స్ అందరికీ ఎవరోకరు కనీసం ఒక్కసారైనా ప్రపోజ్ చేసి ఉంటారు! కానీ నాకు ఇప్పటి వరకు ఒక్క అబ్బాయి కూడా *sniff* కనీసం పువ్వు కూడా ఇవ్వలేదు *sniff*"

IDA కంగారు పడుతూ,

"ఓహో! హహహ... అవును కదా.. అయితే ఏమయింది?.. పువ్వు ఇవ్వనంత మాత్రాన నువ్వు అందగత్తెవి కాకుండా పోవు..-"

Ida ను సూటిగా చూస్తూ,

ఫరీద,

"... నీకు నా లవ్ లైఫ్ తో సంబందం లేదు కదా?"

IDA కంగరుతో వెనక్కి అడుగులు వేస్తూ,

"... లేదు!.. అవును.. కాదు.. నాకు.. ఏం సంబంధం లేదు.. నేను.."

ఫరీద సూటిగా కళ్ళలోకి చూస్తూ,

"హు? నిజం చెప్పు నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా?"

IDA భయపడుతూ,

"లేదు!? నేనేం దస్తాను? నాకేం తెలీదు!.. నేనెప్పుడూ ఎవరినీ బెదిరించలేదు.."

Ida తన చేతులతో నోరు ముసుకుంటాడు.

ఫరీద కోపంతో ida జుట్టు పట్టుకొని,

"నాకు ముందే తెలుసు! పనికి మాలిన ఎదవ!.."

ఫరీద, ida ను నేలమీద తోసి కొడుతూ ఉంటుంది.

ఫరీద కోపంతో,

"నీ వల్ల నేను ఎన్ని సార్లు బాధపడ్డనో తెల్సా నీకు? అందరికీ బాయిఫ్రెండ్స్ ఉన్నారు! నాకు తప్ప! నా మొకం దరిద్రంగా ఉందని ఎవరు నా జోలికి రావట్లేదేమోనని చాలా దిగులు పడేదాన్ని!.."

IDA తన్నులు తింటూ నవ్వుతూ,

"..క్షమించే తల్లి! అబ్బా!.. గట్టిగా కొట్టకెే!"

అలా ida ను తిడుతూ, కొడుతూ ఉండటం చూసి,

*ఇప్పుడూ తన్నులు తింటుంది మన మాస్టర్ ఈ నా?*

*నాకూ అదే అనుమానం..*

*మన మాస్టర్నీ పర్మిషన్ లేకుండా మనం తల ఎత్తితేనే మనల్ని శిక్షిస్తారు! అలాంటిది ఈ అమ్మాయి చేతుల్లో దెబ్బలు తింటూ కూడా నవ్వుతున్నారు?*

*మన మాస్టర్ మారిపోయి మంచోడిలా మారి పోయాడా ఏంటి?*

*అదే నిజమైతే మనకి నచ్చినట్లుగా ఇతన్ని వాడుకోవచ్చు.. kekekekeke*

──•~❉᯽❉~•──

ఇంకా ఉంది...

─── ・ 。゚☆: *.☽ .* :☆゚. ───