webnovel

ఫరీద: నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్

ప్రొలోగ్: ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను.... కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?.... ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు ..... ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే .... అంతం అయ్యేది నా చావుతోనే .... ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా.. ఏ జాతి అయినా.. ఏ మతం అయినా.. నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను... ఇది నా కధ ... నా కధ కి మొదలు నేనే ... అంతము నేనే .... "నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ " "నా పేరే ఫరీదా"

SAVYASACHI · Fantasy
Not enough ratings
25 Chs

NOT: CH 04

Farruarts ©

•❅───✧❅✦❅✧───❅•

రీకాప్:

అతను ఆ రెండు ఆడ దెయ్యాలను పురుగులను చూసినట్టు చూస్తూ ఉంటాడు.

ఇదా,

"మీ ఇద్దరు అన్నీ మూసుకుని, నా ఫరీద అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పండి~ లేకుంటే.."

అని చెప్పి వెకిలిగా నవ్వుతూ ఉంటాడు.

ఇదా,

"దెయ్యాలను క్రూరంగా హింసించడం ఎలా అన్నది మీరిద్దరూ మీ కళ్ళారా చూస్తారు~"

ప్రస్తుతం:

అతను ఫరీదా తో చనువుగా ఉంటాడు కానీ, అసలుగా ఇదాకి సహనం చాలా తక్కువ.

ఇదా మాటలను విని ఆ రెండు ఆత్మలూ భయం తో వణుకుతూ ఉంటాయి.

ఆత్మ#1,

*మనం ఇప్పుడేం చేద్దాం?* అని భయంతో వణుకుతుంది.

ఆత్మ#2,

*అదే నాకూ అర్థం కావట్లేదు.* అని సంకోచిస్తుంది.

ఇదా వాళ్ళని చూసే చూపు వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతుంది.

అతని కళ్ళు బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి.

ఏ దిక్కు చూసినా చీకటి. ఆ ప్రదేశంలో ఉన్న ప్రెషర్కి వాళ్ళు కనీసం కదల లేకుండా నిలబడి పోతారు.

ఆత్మలను సైతం కను చూపులతో కదలకుండా చేస్తున్న వ్యక్తి కన్నెర జేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందోనని వాళ్లిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు.

అలా వాళ్లిద్దరి ముందు ఉన్నది సామాన్య మైన ఆత్మ కాదని, వాళ్ళు అతని మాట వినకుంటే, అతను తమ ఆత్మలను ఈ ప్రదేశంలో శాశ్వతం గా బంధించి హింసిస్తాడని వాళ్లకు అర్థమవుతుంది.

ఆత్మ#1,

*మనం వీళ్ళకి లొంగి పోదామా?*

ఆత్మ#2,

*ఒక వేళ మనల్ని నమ్మించి మోసం చేసి అంతం చేస్తే?*

ఆత్మ#1,

*అలా ఏమైనా జరిగితే ఆ తర్వాత ఆలోచించి చూద్దాం! మనకంటే వీళ్ళు చాలా శక్తి వంతమైన వాళ్ళు. వీళ్ళకి ఎదురు తిరిగటం కంటే లొంగిపోవటమే మేలు.*

ఆత్మ#2,

*సరే! నువ్వు చెప్పినట్టే అలాగే చేద్దాం..*

అని వాళ్లిద్దరూ లొంగిపోవాలని నిర్ణయించుకుంటారు. అలా వాళ్లిద్దరూ మోకాళ్ళ పైన కూర్చొని తల వంచి ఇదాకు నమస్కరిస్తారు.

ఆత్మ#1,

*మేము ఇద్దరం మీతో సహకరించడానికి ఒప్పుకుంటున్నాం!* అని అంటుంది.

ఆ విధంగా వాళ్లిద్దరు ఫరీదా తో మాట్లాడటానికి ఒప్పుకున్నారు.

ఇదా వాళ్ళని చూసి విలన్ లా చిరునవ్వు నవ్వుతాడు. అతని ఎడమ చేత్తో ఒక చిటిక వేస్తాడు.

అతను చిటిక వేయగానే వాళ్ళను చీకటి మింగేస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళు ఇద్దరూ భయంతో కేకలు వేస్తారు.

ఆ విధంగా చీకటి ప్లేస్ లో నుంచి బయటికి వస్తారు. ఇదా వాళ్ళ ఆత్మలను ఎక్కడ మింగేస్తాడోనని వాళ్లిద్దరూ హడలెత్తి పోతారు.

వాళ్ళ ఆత్మలకు ఎటువంటి హానీ కలగకుండా క్షేమంగా బయట పడటాన్ని చూసి వాళ్ళు శాంతిస్తారు.

బయటకు వచ్చాక వాళ్ళ కథను ఫరీదకు చెప్పటం మొదలు పెడుతారు.

వాళ్ళ గతం,

ఆమె పేరు అనిత. బైపీసీ చదువుతున్న ఒక ఇంటర్ విద్యార్థి. ఆమెకు చదువంటే చాలా ఇష్టం ఉండేది.

ఎప్పుడూ క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకునేది. ఆమె బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలన్నది ఆమె లైఫ్ గోల్.

ఆమెది పెద్ద కుటుంబం. అమ్మ, నాన్న, అన్నా, తమ్ముడు, నాన్నమ్మ, తాతయ్యలతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది.

ఓకే కూతురు కావటంతో ఇంట్లో తన అమ్మ నాన్న కూడా ఆమెను అన్నిట్లో సపోర్ట్ చేస్తూ ఉండే వాళ్ళు.

ఎప్పుడూ హుషారుగా ఉండేది. అందరితోనూ స్నేహంగా ఉండేది. ఆమెకు కుక్క పిల్లలు అన్నా పిల్లి పిల్లలు అంటే చాలా ఇష్టం ఉండేది.

దారిలో తనకు రోజూ కనిపించే కుక్క పిల్ల కోసం, పిల్లి పిల్లల కోసం ఎప్పుడూ కాలేజ్ కి వెళ్ళేటప్పుడు బిస్కెట్ పాకెట్స్ తీసుకెళ్ళేది.

అనితాను చూసినప్పుడల్లా కుక్క పిల్లలు పరిగెట్టుకొని వచ్చి తోకడిస్తూ ఆమెను చుట్టముట్టేవి.

ఒక రోజు ఎప్పటిలా కాలేజ్ కి వెళ్ళే తనకు దారిలో కుక్క పిల్లలకు తనకంటే ముందుగా ఒకరు బిస్కెట్స్ తినిపిస్తూ కనిపిస్తారు.

అతను ఎవరోనని ఆమె ఆలోచిస్తూ కాలేజ్ కి వెళుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ కీర్తన ఆమె కోసం కాలేజీ గేట్ దెగ్గర ఎదురు చూస్తూ కనిపిస్తుంది.

పరిగెట్టుకొని వెలుతూ ఆమె దెగ్గరకు చేరుకుంటుంది.

కీర్తన,

"అనితా ఏంట్రా లేటు? నీకోసం వెయిట్ చేసి చేసీ మోకాళ్ళు, అరికాళ్ళు నొప్పులు వచ్చేసాయి! చూడు!" అంటూ కంప్లైంట్ చేస్తుంది.

అనిత ఆమెను చూసి నవ్వుతూ ఉంటుంది.

అనిత,

"నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నాకోసం గేట్ దెగ్గర నిలబడొద్దని? కాలేజ్ లోపలికి వెళ్లి బెంచ్ లో కూర్చోవచ్చుగా? చూడు ఇప్పుడు కాళ్ళు నొప్పులోచేసాయి నీకు!" అంటూ కీర్తనకు క్లాస్ పీకుతుంది.

రోహిత్ పరిచయం అయ్యాడు. సేమ్ కాలేజ్ లో క్లాస్ స్టూడెంట్ కావడంతో తనతో ఫ్రెండ్షిప్ చేసింది. కొన్ని రోజులకు ఆ ఫ్రెండ్షిప్ కాస్తా ప్రేమగా మారింది.

వాళ్లిద్దరి ప్రేమను రహస్యం గా ఉంచమని రోహిత్ అనితను ఒప్పించాడు. అలా వాళ్ళు ప్రేమలో ఉండగా ఇద్దరు కలిసి ఒకటయ్యారు. అలా మామూలుగా సాగుతున్న వాళ్ళ ప్రేమకు మధ్యలో  కీర్తన అడ్డు పడింది.

కీర్తన, అనిత ఇద్దరు బాల్య మిత్రులు. ఇద్దరు ఎప్పుడూ ఏ మాత్రం రహస్యాలు ఒకరితో ఒకరు దాచి పెట్టే వారు కాదు.

అనిత గర్భవతి అయింది అన్న విషయం రోహిత్ కు చెప్పే సమయంలో రోహిత్ కీర్తన కు కడుపు చేశాడని, పెళ్లి చేసుకోమని అతనిని నిలదీయడం చూసిన అనిత కోపం తో వాళ్ళిద్ధరితో గొడవపడింది.

మొత్తం నిజం తెలుసుకున్న కీర్తన,అనితలు రోహిత్ తమను నమ్మించి మోసం చేశాడని తమ తల్లిదండ్రులకు చెప్పి పోలీసు కంప్లయింట్ చేస్తామని బెదిరించారు.

రోహిత్ వాళ్ళు ఇద్దరు అన్నంత పని చేస్తారేమోనని భయంతో వాళ్ళని పెళ్ళిచేసుకుంటానని వళ్ళిద్దరితో మాట్లాడి ఒప్పించాడు. రోహిత్ తన ఇంటికి తీసుకెళ్ళి తన అమ్మ,నాన్నలకు పరిచయం చేస్తానని అనితను, కీర్తనను కాలేజ్ అయ్యాక తన ఇంటికి వెళ్లి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి రమ్మని రోహిత్ ఒప్పించాడు.

అనిత, కీర్తన లకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అవి జంతువులైనా, పక్షులైనా, మనుషులైనా... పసిపిల్లలకు ఎటువంటి హానీ చెయ్యలేరు.

వాళ్ళిద్దరూ బాల్య మిత్రులు కావటంతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోకుండా రోహిత్ ను పెళ్లి చేసుకోవటానికి ఇద్దరు ఒప్పుకున్నారు.

వాళ్ళ ఇంట్లో ఒకరి ఇంటికి ఒకరు వెళ్తున్నారని అబద్ధం చెప్పి వెళ్లారు.

సొసైటీ ఏమనుకున్నా తమకు పర్లేదని భావించి ఇద్దరు రోహిత్ ఇంటికి కలిసి వెళ్ళారు.

ఇంటికి వెళ్లి రోహిత్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. వాళ్ళు కొప్పడకుండా పెళ్లికి ఒప్పుకున్నారు. అది విని ఇద్దరు మిత్రులు సంతోషించారు. వాళ్ళ ఇద్దరి ఇంటికి తమ వచ్చి తన తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడుతామని కీర్తన,అనితలను ఒప్పించారు.

ఇద్దరు అమ్మాయిలు ఒకరిని పెళ్ళిచేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అందులోనూ ఇద్దరు రోహిత్ వల్ల ప్రెగ్నెంట్ కూడా అయ్యారని తెలిస్తే ఇద్దరి ఇళ్లలో గొడవలు జరుగుతాయని వాళ్ళు సైలెంట్ గా ఉందామని రోహిత్ వాళ్ళను ఒప్పించాడు.

అలా ఆనందంగా సమయం గడిపాక, వాళ్ళను భోజనం చేసి వెళ్ళమని రోహిత్ తల్లిదండ్రులు ఒప్పించారు. వాళ్ళు చెప్పినట్టు భోజనం చేసి ఆరంజ్ జూస్ తాగి, కీర్తన,అనిత లు వాళ్ళ ఇళ్లకు బయలు దేరబోయారు..

అలా ఆరంజ్ జ్యూస్ పెదాలకు తగలగానే వాళ్ళకే తెలీకుండా ప్రాణం కోల్పోయారు.

వాళ్ళు తాగిన ఆ ఆరంజ్ జ్యూస్ లో సైనైడ్ కలిపారు. ఒక్క చుక్క సైనైడ్ నాలికకు తగలగానే ఎంత పెద్ద ఏనుగు ప్రాణం అయినా సరే క్షణం లో పోతుంది.

వాళ్ళు చనిపోయాక కూడా వాళ్లకు జరిగిన మోసం సహించలేక యమ భటులు ఇచ్చిన 11 రోజులు గడువును వదిలి రోహిత్కు, అతని తల్లిదండ్రులకు శిక్ష పడాలని వాళ్ళ వెంటే ఉన్నారు.

వాళ్ళిద్దరూ చనిపోయి 2 yrs అవుతోంది. వాళ్ళ శవాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు దొరకలేదు.

మొదట్లో రోహిత్ ను పోలీసులు అనుమానించినా వాడు తెలివిగా తప్పించుకున్నాడు. పోలీసులకు వాళ్లిద్దరి జాడ ఇప్పటికీ మిస్టరీ గా మిగిలిపోయింది.

ఇలా వీడి వళ్ళ చాలా మంది అమ్మాయిలే మోస పోయి ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు అబార్షన్ చేయించుకుని అన్నీ మర్చిపోయి తమ జీవితం కంటిన్యు చేస్తున్నారు.

──•~❉᯽❉~•──

ఇంకా ఉంది...