webnovel

ఫరీద: నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్

ప్రొలోగ్: ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను.... కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?.... ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు ..... ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే .... అంతం అయ్యేది నా చావుతోనే .... ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా.. ఏ జాతి అయినా.. ఏ మతం అయినా.. నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను... ఇది నా కధ ... నా కధ కి మొదలు నేనే ... అంతము నేనే .... "నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ " "నా పేరే ఫరీదా"

farruarts · Fantasy
Not enough ratings
39 Chs

1

──•~❉©Farruarts©❉~•──

ఇదొక ఫాంటసీ ప్రపంచం.

ఈ లోకంలో మ్యాజిక్ ఉంటుంది.

లెక్క పెట్టలేనన్ని మ్యాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి.

మన భూమి మీద ఉన్న జీవరాసులతో పాటుగా మన పూర్వ కథల్లో చూపే మాయా మృగాలు, శక్తులు కలిగిన మానవులు, ఇష్టం కొద్దీ మృగం నుండి మనిషిగా రూపాలు మార్చుకునే జంతువులూ, వింత శక్తులతో ఇతర ప్రపంచాల నుంచి వేరే ప్రపంచాలకు ప్రయాణించే వ్యక్తులతో నిండిన మాయా ప్రపంచం.

ఎలాగైతే మన లోకంలో వెలుగూ చీకటి ఉంటుందో,

అన్ని లోకాల్లోనూ మంచి ఉంటే చెడూ ఉంటుంది.

──•~❉᯽❉~•──

సమయం: ఉదయం 5:55 am.

ప్రదేశం: మనుషులు జీవించలేని అడవి.

──•~❉᯽❉~•──

ఇద్దరు కలిసి తమ కవల పిల్లలను ఎత్తుకొని అడవిలో పరిగెడుతూ ఉంటారు.

వాళ్ళ వెనుక నుంచి ఏనుగు ఆకారంలో ఉన్న మాంస్టర్స్ వెంటబడుతూ, కంటికి కనిపించిన చెట్లను ధ్వంసం చేసుకుంటూ వస్తుంటాయి.

ఆ పిల్లల తల్లి కన్నీళ్ల తో బిడ్డను ఎత్తుకొని పరుగులు తీస్తూ ఉంటుంది.

సీత: "నా ప్రాణాలు అడ్డు పెట్టయినా మన పిల్లలను కాపాడుకుంటాను."

ఆ పిల్లల తండ్రి మరో బిడ్డను ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటాడు.

రామ్: "నేను ప్రాణాలతో ఉండగా మన పిల్లలకు ఏమీ కానివ్వను. నన్ను నమ్ము సీత."

ఆమె అలసటతో ఒక చెట్టు కు ఆనుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటుంది.

సీత: "తెలుసు రామ్! సీత, రాముడిని కాకుంటే మరెవరిని నమ్ముతుంది?"

రామ్ తన చేతిలోని బాబును అతని భార్యకు ఇస్తాడు.

రామ్: "మన పిల్లలు పుట్టి వారం కూడా కాలేదు. ఇంత హడావిడిలో కూడా ఏమాత్రం ఏడ్చి గోల చెయ్యకుండా ఎంత బుద్దిగా ఉన్నారో చూడు."

ఆమె చిరు నవ్వు నవ్వుతుంది.

సీత: "వాళ్ళు చూడడానికే బుద్దిగా ఉన్నారు. మన పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు చేసే అల్లరికి కచ్చితంగా మన రాజ్యమంతా ఉలిక్కి పడుతుంది."

బాబు: "గు... గా... గు..."

తల్లిదండ్రులు ఇద్దరు ఆనందంతో పిల్లలను చూస్తారు.

రామ్: "మన బాబు ఎదో చెప్పాలని అనుకుంటున్నాడు. ఏంట్రా? చిట్టికన్నా?"

సీత: "వీడు అచ్చం మీలాగే ఉన్నాడండి. మాటలు రాక పోయినా ఎప్పుడూ ఏదోకటి మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు."

రామ్: "అంటే నన్ను వాగుడుకాయని అని అంటున్నావా?"

సీత: "(*నవ్వుతూ*) మరి కాదా?"

రామ్ సిగ్గు పడుతూ,

రామ్: "సరే.. కానీ, మన పిల్లల ముందు తిట్టకు సీతా! చూడు మన పాప ఏం చేస్తుందో!"

ఇద్దరూ పిల్లలను చూసి నవ్వుతారు.

సీత: "హహహ.. చుడండి! మన పాప తన అన్నయ్య ఎక్కువగా మాట్లాడి అమ్మను విసిగిస్తున్నాడని వాడి బుగ్గలు లాగి నోరు మూయిస్తోంది."

రామ్: "హహహ.. మన పాపకు అచ్చం నీ పోలికలే! చూడు!"

సీత: తన అల్లరి అన్నయ్య బుగ్గలను అస్సలు వదలట్లేదు.

రామ్: "అవును సీతా. మన పాపకు తన అన్నయ్యను ఎలా మందలించాలో బాగా తెలుసు. హహహ."

వెనుక నుంచి ఒక మాంస్టర్స్ వాళ్ళను చేరుకుని తల్లీ పిల్లల పైన దాడి చేస్తుంది.

రామ్ అతని పదునైన కత్తితో ఆ దాడిని అడ్డుకుంటాడు.

రామ్: "సీతా! నేను ఆ మాంస్టర్ లకు అడ్డుపడి కాస్త సమయం వరకూ ఆపగలను.

అప్పటివరకు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా మన పిల్లలను తీస్కొని ఆ వ్యక్తి దెగ్గరకు చేరుకో!"

అతని పొట్ట భాగంలో గాయమయి రక్తం కారుతూ వుంటుంది.

ఆందోళనలో,

సీత: "కానీ.. మీ గాయం.."

అతను నవ్వుతూ జవాబు ఇస్తాడు.

రామ్: "ఇప్పుడు మన పిల్లల ప్రాణాలు ముఖ్యం. ఆలస్యం చెయ్యకు! వెళ్ళు సీతా!"

అతను ఆ మాంస్టర్స్ ను అడ్డుకోవడానికి వెళతాడు.

సీత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక రహస్యమైన గుహ లోకి వెళుతుంది.

చీకటిలో ఒక 25 ఏళ్ళ వయసు గల స్త్రీ కాలు మీద కాలు వేసుకొని రాయి మీద పనుకుని ఉంటుంది.

సీత అడుగు జాడలు విని, ఆమె ప్రశాంతమైన గొంతుతో మాట్లాడుతుంది.

"హ్మ్?.. వచ్చావా!? నీ కోసమే ఎదురు చూస్తున్న."

సీత అలసటతో గోడకు ఆనుకుని ఆమెను చూస్తుంది.

సీత: "దయచేసి.. నా.. పిల్లలను... కాపాడు.."

ఆమె ఆలోచిస్తూ,

"హ్మ్..? నీ పిల్లను కాపాడితే నాకేంటి లాభం?"

సీత: "నీకేం కావాలో చెప్పు? డబ్బు? బంగారం? వజ్రాలు? కావాలంటే రాజ్యం అయినా ఇచ్చేస్తాను! నువ్వడగాలే నీకు ఏం కావాలన్నా ఇస్తాను! నా పిల్లల ప్రాణాలను కాపాడు!"

ఆమె బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది.

"సరే! కానీ, నేను ఒక్క బిడ్డ ప్రాణాలను మాత్రమే కాపాడుతాను. నా మనసు మారే లోపల ఏ బిడ్డ ప్రాణాలు కాపాడాలో నిర్ణయించుకో!"

ఆ తల్లి గుండె ఏ బిడ్డను కాపాడుకోవాలో తెలియక బాధతో కన్నీళ్లు కారుస్తుంది.

తన బాబు తన చెల్లి చెయ్యి పట్టుకొని కుదుపుతూ ఉంటాడు.

బాబు: "మ.. ఆ.. గ.. గు.."

ఆమె కన్నీళ్లు కారుస్తూ బాబుని చూసి నవ్వుతుంది.

సీత: "చెల్లిని పంపమని అంటున్నావా?"

బాబు చిరునవ్వు నవ్వుతాడు. ఆమె తన బాబు త్యాగం చూసి ఒక వైపు ఆనందంతో మరో వైపు బాధతో ఏడుస్తుంది.

సీత: "పాప... నా పాపను కాపాడండి!

ఆమె ఆ దృశ్యం చూసి చిరునవ్వు నవ్వుతుంది.

"హ్మ్.. ఇంట్రెస్టింగ్.. సరే! పాపనే గా~ కాపాడద్దాం! కానీ నాకు నువ్వు ఇస్తానన్నవి ఏవీ అక్కర్లేదు~"

సీత: "మరి నీకు ఇంకేం కావాలి?"

అని తడబడుతుంది.

"అది నీ పాప పెద్దయ్యాక తననే అడిగి తీసుకుంటా~"

ఆమె ఒక పోర్టల్ ను తయారు చేస్తుంది.

సీత తన పాపను చివరి సారిగా చూస్తూ కౌగిలించుకొని ముద్దులు పెట్టి ఆమెకు ఇచ్చేస్తుంది.

"నీ బాబుని కూడా ఇవ్వు!"

సీత అశ్చర్యపోతుంది.

సీత: "ఒక బిడ్డనే కాపాడుతానని అన్నావు?"

ఆమె తల ఊపుతుంది.

"నేను ఒక బిడ్డనే కాపాడుతానని అన్నాను. రెండో బిడ్డను పోర్టల్లో పంపనని చెప్పలేదే?"

అదే సమయంలో చాలా మాంస్టర్స్ వాళ్ళను చుట్టు ముట్టి ఉంటాయి.

తన ఇద్దరు పిల్లలను ఆమెకు అప్పజెప్పుతుంది.

సీత: "బాబు, చెల్లిని అంటి పెట్టుకొని ఉండు. పాపా అన్నయ్యను ఎప్పుడూ ఒంటరిగా వదిలి ఉండకు.

ఇద్దరూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ కలిసి ఉండండి."

- అని చెప్పి ఇద్దరు పిల్లలకు నుదిటి పైన ముద్దు పెట్టి ఆ గుహ నుంచి బయటకు వస్తుంది.

సీత తన భర్తను వెతుక్కుంటూ వెళుతుంది. తన భర్త ఆ మాంస్టర్లను కత్తితో సంహరిస్తూ కనిపిస్తాడు.

అతని శరీరం రక్త శ్రావం అవుతుండడం ఆమె గమనిస్తుంది. ఆమె కళ్ళు ఎర్ర బడుతాయి.

సీత అతన్ని చేరుకొని ఆవేశంతో తన పూర్తి శక్తిని ఉపయోగించి ఒక మ్యాజికల్ సర్కిల్ గీస్తుంది.

ఆ సమయం లో నేలను బద్దలు కొట్టుకుంటూ రక్త పిషాచాలు బయటకు వస్తాయి.

సీత కోపంతో ఆ మాంస్టర్స్ ను చూస్తుంది. ఆ పిషాచాలు మాంస్టర్ల పైన చీమల్లా పాకుతూ కరుచుకొని తింటూ ఉంటాయి.

ఆమె ఆ మేజిక్ పోర్టల్ ను కంట్రోల్ చెయ్యలేక పోతుంది. సీత ఒళ్ళంతా నరాలు చిట్లి రక్తం కారుతుంది.

ఆమె శక్తిని కోల్పోయి నేల మీద పడిపోతుంది. సీత రక్తం కక్కడం రామ్ చూసి, ఆమె వద్దకు పరిగెత్తుకొని వస్తాడు.

ఒక పెద్ద మాంస్టర్ అతని పైన దాడి చేస్తుంది. అతను దూరంగా వెళ్లి రాయికి ఢీ కొట్టి నేల మీద పడతాడు.

మెల్లగా పైకి లేచి ఆ మాంస్టర్ ని చంపి అలసటతో సీత వంక చూస్తాడు.

సీత నోట్లో నుంచి రక్తం కారుతున్న సమయంలో ఆమె ఇలా అంటుంది..

సీత: '.. మన పిల్లలు ఇక సురక్షితమైన ప్రదేశంలో టెలిపోర్ట్ అయ్యుంటారు.. '

ఆమె భర్త గుండెలో, పొట్ట దెగ్గర బలమైన గాయాలై ఉంటాయి. కాసేపటి వరకూ అతని శరీరం కదపలేక పోతాడు.

ఆ గుండె నొప్పిని భరిస్తూ తన భార్య వద్దకు పరిగెత్తుకు వెల్లి ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని ఆ అడవి నుంచి బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు.

సీత: '..నాకు ఒక్కసారైనా మన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే చూడాలని ఉంది, కానీ మనకి ఆ అదృష్టం లేదు..'

ఆమె భర్త నవ్వుతూ ఇలా అంటాడు..

రామ్:' ..వాళ్లిద్దరి అల్లరిని భరించడం మనిద్దరి వల్ల కాదేమో..'

సీత: 'ఎందుకలా అంటున్నారు? మన పిల్లలకేం తక్కువ?'

రామ్: 'మనిద్దరిలో ఎవరి పోలికలైన మన పిల్లలకి వస్తే వాళ్ళ చుట్టు ఉండే వాళ్ళ సంగతి అంతే..'

అతని భార్య అతని మాటలకు నవ్వుతూ,

సీత:'..అదేం కాదు! మన పిల్లలు మనం ఊహించిన దానికంటే గొప్ప వాళ్లవుతారు.!'

రామ్: 'అవును! వాళ్ళు ఇద్దరు.. సీతా?'

అలా మాట్లాడుకుంటూ వెళుతున్న సమయం లో ఆమె గొంతు ఆగి పోయింది. అతని గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం ఆపేసింది. 

అతని చేతులు వణుకుతూ ఉంటాయి.

రామ్: 'వద్దు... లేదు.. నీకేం కాకూడదు.. ఏమైనా మాట్లాడరా.. సీతా!'

అతని భార్య అలా రక్తం కక్కుకొని చనిపోతుంది.

రామ్: 'నన్ను ఒంటరి వాడ్ని చెయ్యొద్దు..'

మోకాళ్ళ పైన కూర్చొని, ఆమె చావును జీర్ణించుకోలేని రామ్ తన భార్య పేరును గట్టిగా పిలుస్తూ కేకలు వేస్తాడు.

'సీతా!'

అని గెట్టిగా పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు.

──•~❉᯽❉~•──

ఉదయం 6:00 am.

──•~❉᯽❉~•──

వెంటనే నిద్ర నుంచి మేల్కొని,

గట్టిగా ఊపిరి తీసుకుంటూ..

'.హా.. హా... ఆ... హా!...'

నుదిటి పైన చెయ్యి పెట్టుకొని,

'మళ్ళీ అదే పిడ కలా..'

ఫోన్లో టైం చూసి,

'కాలేజ్ కి టైం అయింది కదా...'

బ్రష్ చేస్తూ,

'మార్చి పోయా! నేను మ్యాథ్స్ 2బి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను కదా..'

తనలో తాను మాట్లాడుకుంటూ..

'ఏంటో నా జీవితం~ దారుణంగా 2బి ఫెయిల్ అయిపోయా..'

చుట్టు కుటుంబ సభ్యులు తనను తిడుతూ ఉంటారు.

'ఏంట్రా బాబూ... వీళ్ళు పొద్దున్నే నా పైన కచేరి పెట్టారు!'

దూరంలో ఒక మిద్ది కింద రోడ్ లో బైక్ మీద కూర్చొని పైకీ చూస్తూ ఒక అబ్బాయి మిద్దె పైన ఉన్న అమ్మాయికి సైట్ కొడుతూ ఉంటాడు.

ఆ అమ్మాయి అది చూసి సిగ్గు పడుతూ వాళ్ళ మిద్ధి పైన తిరుగుతూ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటుంది.

'ఆ పిల్లకి ఫోన్లో ఒకడు, ఇంట్లో ఒకడు, ఇంటి బయట ఒకడు.. కలికాలం~'

ఆ అమ్మాయికి కొత్తగా పెళ్లయింది. అరేంజ్ మ్యారేజ్ కావటంతో ఆమెకు తన భర్త అంటే ఇష్టం లేదు. అందుకే భర్తను మోసం చేస్తూ అఫైర్స్ మెయింటెయిన్ చేస్తోంది.

'నాకు పరిగెత్తుకెళ్లి ఈ పిల్ల గురించి వాళ్ళ భర్తకు చెప్పాలని ఉంది.

కానీ ఆ పిల్ల భర్త అమాయకుడు ఈ విషయం తెలిస్తే వాడి గుండె టపాకాయలా పేలిపోతుంది.

దాని వల్లే, నాకెందుకులే అని కాముగా ఉన్నాను.

'అయినా ఈ రెండు ఎదవలకి పెళ్ళైన అమ్మాయితో సరసాలేంటో~ ఈ ఊరిలో వేరే అమ్మాయిలే లేరా వాళ్ళకి?'

"నేను కూడా సింగల్ దాన్నే! నన్ను ఎవడూ చూడడేం? నాకేమైనా నెత్తి మీద రెండు కొమ్ములున్నాయా ఏంటి?"

ఆ అమ్మాయిని దీర్ఘంగా చూస్తూ,

'ఆ పిల్ల చుట్టు చాలా ప్రేతాత్మలు కోపంగా చూస్తున్నాయి,..'

పల్లు తోమడం పూర్తి చేసి ఇంట్లోకి వెల్లి స్నానం చేస్తూ..

అవును నాకు ఆత్మలు, ప్రేతత్మలు చూసే శక్తులను ఉన్నాయి.

నాకు 5 సమత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆత్మలు ప్రేతత్మాలు కనిపించడం మొదలైంది.

చిన్నప్పుడు, మొదట్లో ఇదంతా చూసి భయపడేదన్ని.

ఆ తర్వాత కొంత కాలం వరకూ ఇదంతా నా భ్రమ అనుకొని పట్టించుకోలేదు.

కానీ, నా వయసు పెరిగే కొద్దీ నా చుట్టు కనిపించేవి నా భ్రమ కాదు వాస్తవం అని అర్థం చేసుకున్నాను.

నాకు లాగా నా తల్లిదండ్రులకు కూడా ఈ శక్తులు ఉన్నాయేమో అని అనుకున్నాను. కానీ,

నాకు 6 సంత్సరాలు ఉన్నప్పుడు,

'అమ్మ, నాన్న మీకు దెయ్యాలు, ఆత్మలు కంటికి కనిపిస్తున్నాయా?'

నా ప్రశ్న విన్నాక మా ఊరిలో నన్ను తీసుకెళ్ళని గుడి లేదు. నేను వెళ్ళని దర్గా లేదు. కట్టని తాయత్తు లేదు.

వాళ్ళ రియాక్షన్ ఇప్పటికీ మర్చిపోలేను.

నాలాంటి శక్తులు మా అమ్మ నాన్నలకు లేవు, వాళ్ళు అందరిలా మామూలు మనుషులు.

మరి నాకు ఈ శక్తులు ఎలా వచ్చాయి? ఎవరి నుంచి వచ్చాయి?

నాకు ఆ కలకు సంబందం ఏమైనా ఉందా?

ఒక వేళ వాళ్లకూ నాకూ సంబందం ఉంటే నేను వాళ్ళకేమౌతాను?

ఆ కవల పిల్లలు ఏమయ్యారు?

ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎందుకు ఆ పిల్లలను పోర్టల్ లో పంపారు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ నాకు తెలీదు!

నాది మధ్య తరగతి కుటుంబం.

నేను నా శక్తులతో డబ్బు, ఆస్తి, అంతస్తు సంపాదించొచ్చు. కానీ, డబ్బు కోసం వీళ్ళను ప్రమాదం లో పడేయలేను.

ఈ లోకం లో నాలాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు.

నా శక్తుల గురించి ఈ లోకానికి తెలిస్తే నన్ను వాడుకొని నా శక్తులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని మాత్రం తెలుసు.

అందుకే నా తల్లితండ్రులకు కూడా ఈ విషయం గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే,

అమ్మ,

"ఒక్క పని చెయ్యడానికి కూడా పనికిరాదు!"

తమ్ముడు,

"అక్కకి పెళ్లి చేసి ఇంట్లో నుంచి తరిమేద్దాం అమ్మా!"

నేను,

*సచ్చినోడు*

నాన్న,

"ఎప్పుడూ మీ అమ్మ చేతిలో తిట్లు తినే బదులుగా ఇంటి పనీ వంట పనీ చెయ్యొచ్చుగా?!"

నేను,

*నా సంక చేస్తా!*

──•~❉©Farruarts©❉~•──

ఇంకా ఉంది...

హలో ఫ్రెండ్స్!! నేను farruarts(😉)

నేను ట్రెడిషనల్, డిజిటల్ బొమ్మలు వేస్తుంటాను. (Hobby)

ప్రతిలిపి కామిక్లో ఈ కధని manhwa స్టైల్ లో గీయాలని అనుకుంటున్నాను.

కానీ వాళ్ళు నాలాంటి self-taught ఆర్టిస్టులు అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు. ఫ్యూచర్లో వాళ్ళు అప్డేట్ ఇస్తే అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ ఇస్తాను. చదివేవాళ్ళు వెళ్లి చదవచ్చు.

ఇంతకీ ఈ స్టోరీ ఎలా ఉంది? బాగుందా?

మరీ రాజమౌలి సినిమా అంత

గొప్పగా కాకున్నా కుంచం పర్లేదుగా?

ఇట్స్ ఓకే! ఏదొక రోజు నా స్టోరీ ఆయనకి ఇచ్చి సినిమాలో ఛాన్స్ కొట్టేయాలన్నదే నా లైఫ్ గోల్.

నాతో పాటుగా మీరు కూడా నా జర్నీలో ఒకరిగా ఉండండి.

నేను ఫ్యూచర్లో ఎలా ఉంటానో తెలుసుకోవాలి అని నాకూ ఆతృతగా ఉంది.

ఇలా కింద స్మాల్ సైడ్ స్టోరీస్ కూడా రాస్తాను.

చదివి నవ్వేసుకోండి :}

స్టోరీ నచ్చితే రేటింగ్ ఇచ్చి ఫాలో చేయడం మర్చిపోకండి.

నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం.

──•~❉©Farruarts©❉~•──

హలో ఫ్రెండ్స్! నేను మీ "సవ్యసాచి"

నా స్టోరీని చదివి అభిమానిస్తున్నందుకు చాలా థాంక్స్

కానీ ఈ మధ్య మీరు చదివి వెళ్లి పోతున్నారే తప్పా, చాప్టర్ గురించి కామెంట్ చెయ్యట్లేదు!

໒( ˵ •̀ □ •́ ˵ )

మీరు కామెంట్ చేసి చెప్తేనే కదండీ నేను రాసే కధలో ఏమైనా లోపాలు ఉన్నాయా? లేవా? అనేది నాకూ తెలిసేది!!

( ╥ ﹏ ╥ )

అలాగే చాలా మంది మన ఛానల్ని ఫాలో చెయ్యట్లేదు.

అందరికీ నచ్చే విధంగా స్టోరీ కంటిన్యూ చేస్తూ ఉండాలంటే నాకూ మీ నుంచి మోటివేషన్ దొరకాలి కదండీ?

మీరు స్టికర్స్ రూపంలో గానీ కనీసం కామెంట్ రూపంలో గానీ సపోర్ట్ ఇస్తే అదే నాకు చాలండి.

( ˚  ˃̣̣̥ ⌓ ˂̣̣̥  )づ♡

నెక్స్ట్ చాప్తర్ లో కలుద్దాం.

( ˶ ᵔ ᵕ ᵔ ˶ )

* Have a good day *

( *ᴗ͈   ˬ ᴗ͈  )ꕤ*.゚

farruartscreators' thoughts