ఫరీద: దీనికంటే గుడి మెట్ల దెగ్గర అడుక్కుతినడం మేలేమో...
ఆమె చొరకుతో ఏరిన వస్తువులను స్క్రీన్ లో ఇస్తూ ఉంటుంది.
స్క్రీన్: అలెర్ట్!! పర్సన్ లొకేషన్ దెగ్గర్లో ఉంది.
ఫరీద: బాబా! అమ్మ దెగ్గరలోనే ఎక్కడో ఉందని చూపిస్తోంది.
వాళ్లు ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు.
ఖాజా మస్తాన్: ఎక్కడ? ఎటు? డీటెయిల్స్ చెప్పూ!!
వాళ్లు ఇద్దరూ హడావిడి పడుతూ ఉంటారు.
ఫరీద: ఇటు! ఇక్కడే ఎక్కడో ఉందని లొకేషన్ చూపిస్తోంది.
@@@
ముగ్గురూ వెతుకుతూ వెళుతూ ఉంటారు.
ఒక ఇల్లు కనిపిస్తుంది. జోంబీలు ఆ ఇంటిని చుట్టు ముట్టి ఉంటారు.
ఫరీద: బాబా!! అమ్మ ఆ బాత్రూమ్లో ఉన్నట్టుగా లొకేషన్ చూపిస్తోంది..
అం.. అమ్మ ఏ మూలనో జోంబీ అయి నిలబడి ఉండదుకదా?...
అని చెబుతూ, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.
అటూ ఇటూ తల తిప్పి చూడగా, ఇద్దరూ ఆమెను గుడ్లప్పగించుకొని చూస్తూ ఉంటారు.
ఫరీద: ఏంటి? కొంపదీసి నన్ను వెళ్ళమనట్లేదు కదా?..
షామీర్: నువ్వు ఇన్ఫెక్ట్ అవ్వవు. కానీ మేమలా కాదుగా?
కాబట్టి నువ్వే వెళ్ళాలి!! పో!! వెళ్లి అమ్మను కాపాడు!
ఫరీద: హా?.. ఆవిడకి నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టంగా? ఎప్పుడు చూసినా నా కొడుకు బంగారం. నా కొడుకు వజ్రం అంటూ ముద్దు చేస్తూ ఉంటదిగా? నువ్వే పో! నేను పోను!
ఖాజా మస్తాన్: ఇప్పుడు నువ్వు వెళ్లి మీ అమ్మను తీసుకోని రాలేదో నీ వీపు పగలకొడతా!
ఫరీద: పోతున్నాన్నయ్య.. పోతున్నా... 🥲
పోకుంటే వీళ్ళే నాకు సమాధి కట్టేసేలా ఉన్నారు..
అని గొనుక్కుంటూ వెళుతూ ఉంటుంది.
ఫరీద: టైం స్టాప్ చెయ్యి.
ఆమె అలా అనగానే టైం ఆగిపోతుంది.
చిరాకుతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి ఒక్కో జోంబీని పక్కకు నెడుతూ తలుపుని తెరుస్తుంది.
వాళ్ళ అమ్మ ఇన్ఫెక్షన్కి గురై దాదాపుగా జోంబీగా మారిపోయి ఉంటుంది.
ఫరీద: హా... ఇప్పుడెలా?.. ఈవిడ దాదాపుగా జోంబీలా మారిపోయింది..
ఇప్పుడు ఈవిడని ఇక్కడే వదిలేయాలా?..
ఆమె అలా ఆలోచిస్తూ, వాళ్ళ అమ్మ చేతికి ఉన్న గాయాన్ని గమనిస్తుంది.
ఆమెకు కోపంతో కళ్ళు ఎర్రబడుతాయి. కంట్లో నీళ్లు తిరుగుతుంటే, కళ్ళు తుడుచుకొని, ఆమె చేతిని పట్టుకొని గాయాన్ని పరిశీలిస్తూ ఉంటుంది.
ఫరీద: ఈవిడకి ఇద్దరు పిల్లలుండొచ్చు.. కానీ నాకు అమ్మ ఒక్కట్టే ఉంది.. ఈవిడ చనిపోతుంటే చూస్తూ ఊరుకోలేను..