webnovel

19

మొబైల్ ఆన్ చేయగానే ఫోన్ కాస్తా మాయం అయిపోయి ఎదురుగా ఒక పెద్ద నీలం రంగు స్క్రీన్ ప్రత్యక్షం అవుతుంది.

ఫరీద: ఒడినీయమ్మ!...

ఆమె ఎదురుగా ఉన్న స్క్రీన్ లో తను ఉన్న చోటు యొక్క మ్యాప్ చూపిస్తుంది.

అందులో మనుషులు పచ్చ రంగు చుక్కల్లో, జోంబీలు ఎరుపు రంగు చుక్కల్లో, ఇన్ఫెక్ట్ అయిన వాళ్లు ఆరంజ్ రంగు చుక్కల్లో కనిపిస్తూ ఉంటారు.

అలాగే పవర్స్ పొందిన వాళ్లు పసుపు రంగు గల చుక్కల్లో కనిపిస్తారు.

ఫరీద: అంటే.. మాలాగే చాలా మంది శక్తులు పొందారాన్నమాట!

మరీ.. నా ఓవరాల్ శక్తులు ఏంటి?..

ఆమె ఆలోచిస్తూ స్క్రీన్ ను చూస్తూ ఉంటుంది.

ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చూపిస్తుంది.

స్క్రీన్:

ఇమ్మ్యూనిటి= ఇన్ఫినిటీ.

టైం స్టాప్= ఆటోమేటిక్.

హీలింగ్= డైలీ 2 సార్లు.

...

అన్లోక్డ్..

..

అన్లోక్డ్..

..

అన్లోక్డ్..

..........

ఫరీద: ఓహో... అంటే ఇవా నా పవర్సు!? పర్లేదు. బానే ఉన్నాయ్~

నాకు ఇమ్మ్యూనిటీ అన్లిమిటెడ్గా ఉందని చూపిస్తోంది కదా?

మరీ.. ఈ హీలింగ్ డైలీ 2 సార్లు ఏంటి?.

నాకు అర్ధం కావట్లా!

సరేలే. వెళదాం ఇంకా!~

ఆమె దిక్కులు చూస్తూ ఉంటుంది.

ఫరీద: ఎలాగో ఇంటిదాకా వచ్చాను కదా? కొన్ని సామాన్లు మోస్కొని వెళ్దాం.

అలా గొనుక్కుంటూ, బెడ్ రూంలోకి వెళ్లి ఆమె తన కాలేజీ బ్యాగ్ను ఖాళీ చేస్తుంది.

అందులో చెత్తా చెదారంతో పాటుగా డబ్బుల హుండీ కూడా ఉంటుంది.

ఆమె ఆ హుండీని తీసుకోని చూస్తూ ఉంటుంది. అందులో మొత్తం చిల్లరే ఉంటుంది.

ఫరీద: ఎంతో కష్టబడి డబ్బులు దాచుకున్నాను.. మొత్తం వేస్ట్ అయిపోయాయి ఇప్పుడు.

ఆమె దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది.

స్క్రీన్: మనీ డిటేక్టెడ్. అన్లోక్ స్కిల్స్.

స్క్రీన్లో చాలా స్కిల్స్ లాక్ అయి ఉంటాయి.

డబ్బులు ఉపయోగించి వాటిని అన్లోక్ చేయమని చూపిస్తుంది.

ఆమె చేతిలో ఉన్న డబ్బాలోని డబ్బులను బయటకు తీసి మంచం మీద పోస్తుంది.

స్క్రీన్: సరిపోవు.

ఫరీద: ఇవి సరిపోవా?.. మా ఇంట్లో ఇంకెక్కడైనా డబ్బులున్నాయేమో వెతుకుతా!..

తన ఇల్లంతా వెతికితే కుంచం చిల్లర, కొన్ని నోట్లు దొరుకుతాయి.

వాటిని మంచం మీద పోస్తుంది.

స్క్రీన్: 5000₹ కలెక్టెడ్. ఒక స్కిల్ అన్లోక్ అయింది.

ఫరీద: హా? ఇదేం స్కిల్లు?...

Chương tiếp theo