webnovel

31

పర్వీన్: నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయ్... నాకు ఏం రావు.. హిక్.. సారీ అమ్మి... సారీ...

అని సారీ చెబుతూ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది.

మాములుగా అయితే ఏ తల్లిదండ్రులు అయినా చదువు విషయంలో, డబ్బుల విషయంలో తేడా వస్తే కోపంతో కొడతారు.

కాని, ఫాతిమా అలాంటిది కాదు. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలన్నది తన చిన్ననాటి కోరిక.

10త్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. స్కాలర్షిప్ డబ్బులతో పై చదువులు చదవాలనుకున్న తన కలను తన తల్లిదండ్రులు చెరిపేశారు.

తనకు బదులుగా తన తమ్ముడిని పై చదువులు చదివించడం కోసం ఆ డబ్బులు వాడేసారు.

తల్లిదండ్రుల పెత్తనం వల్ల అటు తను చదువు ఆగిపోయింది. తన తల్లిదండ్రులు తమ్ముడి పైన ఖర్చు డబ్బులూ వృధా అయిపోయాయి.

చదువు పేరుతో పట్నం వెళ్లి ప్రతీ నెల డబ్బులు అడుగుతూ ఉండేవాడు.

అలా 3 ఏళ్ళ వరకూ ఫాతిమా, తన తల్లిదండ్రులు ముగ్గురూ సంపాదించిన డబ్బంతా వాళ్ళ కొడుకు మీదే ఖర్చు పెట్టే వాళ్లు.

ఫాతిమా పెళ్లిడుకొచ్చిందని పెళ్లి సంబంధాలు కూడా చూసారు.

వాళ్లు మిడిల్ క్లాస్ కావడంతో పెళ్లి చేసే స్థోమత కూడా వాళ్లకు ఉండేది కాదు.

అప్పుడే, పట్నంలో చదువుకుంటున్నాడనుకున్న వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకోని ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోని వస్తాడు.

ఇంట్లోని ఆడపిల్లకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఏంటని చుట్టు పక్కలున్న వాళ్లు తిట్టి పోస్తారు.

అప్పుడే, ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటారని 48 ఏళ్ల వయసు, 3 పిల్లలున్న వ్యక్తి యొక్క సంబంధం గురించి బంధువుల నుంచి తెలుసుకుంటారు.

ఎదురు కట్నం, ఆస్తి అంతస్థు ఉన్న సంబంధం అని ఆమె తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు.

అలా నిరాశతో ఉన్న ఫాతిమాకు మస్తాన్ గుర్తొస్తాడు. ఆమె పరిగెట్టుకుంటూ వెళ్లి అతని చూసి ఏడుస్తుంది.

మస్తాన్ ఒక మెకానిక్. తల్లిదండ్రులు లేరు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ గవర్నమెంట్ స్కూల్ లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు.

ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. పెద్దవాళ్ళను ఎలాగయినా వాళ్ళ ప్రేమ విషయం చెప్పి ఒప్పించాలని ప్రయత్నిస్తారు.

ఫాతిమా తల్లిదండ్రులు ఆమె ప్రేమను ఒప్పుకోరు. వాళ్లు చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుంటే తనను చంపేసి ఇంట్లోనే పతేస్తారని బెదిరిస్తారు.

ప్రాణం పోయినా మస్తాన్ ను తప్పా ఎవరినీ పెళ్లి చేసుకొనని తెగేసి చెప్పేస్తుంది.

వాళ్లు కోపంతో ఫాతిమా చెంప మీద కొట్టబోతారు.

మస్తాన్ అడ్డుగా రాగ ఆ దెబ్బ అతనికి తగులుతుంది.

...

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.

Chương tiếp theo