webnovel

33

ఫరీద: సరేలే. ముందుగా నాకు టమాటాలు, ఉల్లిపాయలు, బియ్యం, గోధుమ... లాంటి మొక్కలు పెంచగలిగే చోటుని చూపించు.

స్క్రీన్లో ఒక చోటుని చూపిస్తుంది.

స్క్రీన్: ఈ ప్రదేశం మీ షరతులకు తగ్గట్టుగా ఉంటుంది.

ఫరీద: అంటే ఇప్పుడు నేనే వ్యవసాయం చేసుకోవాలా ఏంటి?..

స్క్రీన్: అవసరం లేదు. మీరు విత్తనాలు కొని చల్లితే చాలు. అవి వాటంతట అవే పెరిగి పెద్దవుతాయి.

ఫరీద: మరి హార్వెస్ట్ ఎలా? నాకు అంత ఓపిక లేదే..

స్క్రీన్: మీకు నచ్చినట్టుగా పని వాళ్ళను కొనొచ్చు.

ఫరీద: మనుషులను కూడా కొనచ్చా?

ఆమె అశ్చర్యపోతుంది.

స్క్రీన్: వీళ్ళు మనుషులు కారు. పనులలో నైపుణ్యం కలిగి ఉన్న రంగు రంగుల బాలూన్స్.

వీళ్ళను బాబ్స్ అని అంటారు.

అచ్చం మనిషి ఆకారంలో ఉంటాయి. పనులను మనుషులకంటే ఎక్కువ నైపుణ్యంతో చేస్తాయి. వీటికి ఆకలి, దాహం, నిద్ర లాంటి గుణగణాలు ఉండవు.

మీరు పని అప్పజప్పగానే పనిలో లీనం అయిపోతాయి.

ఫరీద: ఓకే! ఓకే! అర్ధమయింది. మనుషులు అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది గానీ బలూన్స్ అయితే ప్రాబ్లెమ్ లేదులే.

ఒక్కో బలూన్ మనిషి యొక్క ఖరీదు ఎంత?

స్క్రీన్: వాళ్ళ నైపుణ్యం, లెవెల్ బట్టి ఖరీదు ఉంటుంది.

మామూలు వర్కర్ ధర,

1 బాబ్ (lvl-1) = 1 లక్ష రూపాయలు.

LOCKED..

LOCKED..

LOCKED..

....

చోటుని ఇంక్రిస్ చేసినప్పుడు రాండంగా ఒక్కో బాబ్ దొరుకుతుంది. అప్పుడు అన్లోక్ అయిన బాబ్స్ మీరు కొనొచ్చు.

ఈ బాబ్కి అన్ని రకాల పనులను వీటికి చెప్పొచ్చు.

లెవెల్ అప్గ్రేడ్ చేసి స్కిన్ ఇస్తే, ఆ స్కిన్ కి తగ్గట్టుగా వాళ్ళ పని స్పీడ్, ఎఫిషియన్న్సీ ఉంటుంది.

ఫరీద: అలాగే. ఈ చోటు ధర ఎంత?

స్క్రీన్: 10 లక్షలు. మీరు కొనగానే ఫ్రీగా ఒక బాబ్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది.

ఫరీద: హా! మరి హార్వెస్ట్ చేసిన సామాన్లు?

స్క్రీన్: మీ ఫార్మ్ లో స్టోర్ చేయబడుతుంది. మీకు 100×100 మీటర్ల చోటు ఇవ్వడం జరుగుతుంది.

ఫరీద: సరిపోయింది. అన్నిటిని డబ్బుతో కొనాల్సిందేనా?~

డైరెక్టుగా నా స్టోరేజ్ లో పంపేయొచ్చుగా?!

స్క్రీన్: మీ స్టోరేజ్ లో పెట్టిన కూరగాయలు, ఇతర సామాన్లు కుళ్ళుపోవడం, చెడిపోవడం, లేదా చనిపోవడం జరుగుతాయి.

కాని ఫార్మ్ లో అలా జరగదు. ఎప్పటికీ తాజాగానే ఉంటాయి.

ఫరీద: హ్మ్... ఇప్పుడు నా దెగ్గర 10.5 బిలియన్ ఉంది అన్నావ్ కదా?!

వీటితో ఎంత ప్రదేశం, ఎన్ని బాబ్స్, ఎంత స్టోరేజ్ అన్లోక్ చెయ్యొచ్చు?

Next chapter