webnovel

8

అతను ఇంటి నుంచి బయటకు వస్తాడు.

ఫరీద కనిపించదు. దిక్కులు చూస్తూ ఉండగా ఆమె గేట్ దెగ్గర నిలబడి ఉండటం గమనిస్తాడు.

ఖాజా మస్తాన్: రే!! దున్నపోతు!! అక్కడేం చేస్తున్నావ్?!

అని కోపంగా తిడుతూ ఆమె దెగ్గరకు వెళ్లి వెనుక నిలబడుతాడు.

ఇంటి పక్కన ఉన్న గొందిలో ఒక వ్యక్తి కూర్చొని ఉండటం గమనిస్తాడు.

అతని వెన్నులో వణుకు పుడుతుంది.

ఖాజా మస్తాన్: (*చిన్న గొంతుతో*) రేయ్!! శబ్దం చేయకుండా ఇంట్లోకి వెళ్ళు!! ఇప్పుడే!!

అని అంటాడు. అతని గొంతు భయంతో వణుకుతూ ఉంటుంది.

ఆమె వెళ్ళబోతూ ఉండగా కాలికి ఒక వస్తువు తగులుతుంది.

ఆ శబ్దం విని, వాళ్ళ ఎదురుగా ఉన్న వ్యక్తి వేగంగా వెనక్కు తిరుగుతాడు.

అతని నోరంతా రక్తంతో నిండి ఉంటుంది. అతని ఎదురుగా ఒక జంతువు చనిపోయి పడి ఉంటుంది.

ఆమె ఆ జంతువుని చూసి కళ్ళలో నీళ్లు తీస్తుంది.

అది వాళ్ళ పెంపుడు పిల్లి. కుంచం దూరంలో మరొక పిల్లి శవం కూడా రక్తపు మడుగులో పడుంటుంది.

ఆమెకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఆ సమయంలో పైకి లేచి వాళ్ళ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు.

అతని చేతులు, కాళ్ళు, మెడ, నడుము అన్నీ విరిగిపోయి ఉంటాయి.

అతని శరీరమంతా రక్తంతో తడిచిపోయి ఉంటుంది. ఒళ్ళు వణుకు పుట్టించేలా భయంకరంగా ఉంటాడు.

ఇద్దరూ భయంతో వెనక్కి అడుగులు వేస్తూ వెళుతూ ఉంటారు.

ఖాజా మస్తాన్ తన కూతురి చెయ్యి పట్టుకొని వేగంగా పరుగులు తీస్తుంటాడు.

ఆమె పరిగెడుతునప్పుడు జోంబి వేగంగా వచ్చి ఆమె చేతిని గొర్లతో గీకుతాడు.

ఆమె నొప్పికి గట్టిగా ఏడుస్తుంది. ఆమెను కాపాడటానికి జాంబికి ఎదురు పడి ఫరీదను ఇంట్లోకి పారిపోమంటూ ఉంటాడు.

జోంబి వాళ్ళిద్దరినీ చంపడానికి పళ్లతో, గోళ్ళతో దాడి చేయబోతుంది.

అప్పుడే షామీర్ ఏడుపులు విని కంగారుగా బయటకు వస్తాడు.

ఎదురుగా ఉన్న జోంబిని చూసి భయంతో దిక్కులు చూస్తాడు.

అతని కళ్ళకు ఒక కట్టెలు కొట్టే గొడ్డలి కనిపిస్తుంది.

Next chapter