webnovel

2

మస్తాన్: ప్లీస్ అమ్మి!

పర్వీన్: ప్లీస్ అమ్మి!!

పండు: ప్లీచ్ అమ్మి!!....

ఆమె సరే అని చెప్పి నవ్వేస్తుంది.

ఫాతిమా: సరే అయితే~ ఎక్కడికి వెళ్దాం? మీరే చెప్పండి.

మస్తాన్: బీచ్కి వెళ్దామా?

ఫాతిమా: సరే~ వెళ్దాం.

@@@

నలుగురూ కలిసి రెడీ అయ్యి బీచ్ కి వెళ్ళడానికి సిద్దమవుతారు.

ఆటో ఆపి అందులో ఎక్కి ప్రయాణం సాగిస్తారు.

కొన్ని నిమిషాల తరువాత బీచ్కు చేరుకుంటారు.

ఆటో దిగి, బీచ్ ఎంట్రన్స్ లోపలకు వెళుతూ ఉంటారు.

ఆదివారం కావడంతో బీచ్ అంతా జనంతో హడావిడిగా ఉంటుంది.

ఫాతిమా: పర్వీన్, నాన్న చెయ్యి, నా చెయ్యి వదలొద్దమ్మ!

ఏవండీ మీరు బాబుని ఎత్తుకుంటారా? నన్ను ఎత్తుకొమంటారా?

మస్తాన్: నేను ఎత్తుకుంటాను లేమా! పాప చెయ్యి పట్టుకో, నేను కూడా మరో చెయ్యి పట్టుకుంటాను.

ఈ గుంపులో జాగర్తగా ఉండకుంటే మనం తప్పిపోతాం.

ఫాతిమా: సరేనండి.

పర్వీన్: బాబా! బాబా!! నీళ్లు!! నీళ్లు బాబా!!

అని నవ్వుతూ ఎగురుతూ ఉంటుంది.

పండు: బాబా, ఇన్ని నీళ్లు ఇక్కడ ఎవరు పోశారు బాబా?

అంటూ అశ్చర్యంగా నోరు తెరుచుకొని చూస్తుంటాడు.

పర్వీన్: హా? ఒక పెద్ద డైనోసార్ వచ్చి పాస్ పోసింది. పోయి మునుగు!

పండు: చీ.... నువ్వు అబద్దం చెప్తున్నావ్!

పర్వీన్: నిజమేంటో?

పండు: ఒక్క డైనోసార్ వచ్చి ఇంత పాస్ ఎలా పోస్తుంది?

డైనోసార్ ఫ్రెండ్స్ కూడా కలిసి పోసుంటారు.

అని అమాయకంగా నోట్లో వేలు పెట్టుకొని చెప్తాడు.

పర్వీన్: యాక్! డైనోసార్కి డైపర్ వేసేయాలి. ఇంత సుస్సు ఎలా పోసాయో!

అని చెబుతూ పండు తో మాట్లాడుతూ ఉంటుంది.

మస్తాన్, ఫాతిమాలు పిల్లల మాటలు వింటూ నవ్వు అప్పుకుంటూ ఉంటారు.

అవి డైనోసార్ సూసు కావు. మామూలు ఉప్పు నీళ్లని పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పి నీటిలో ఏడిపిస్తూ ఉంటారు.

ఫాతిమా నీటి అలలు తగిలే చోట కూర్చొని బాబుని ఒడిలో కూర్చోపెట్టుకొని ఆడిస్తూ ఉంటుంది.

మస్తాన్ తన పాప చేతిలు పట్టుకొని నీటిలో ఆడిస్తూ, పెద్ద అలలు రాగానే పైకి ఎత్తేస్తూ ఏడిపిస్తూ ఉంటాడు.

కాసేపు ఆడుకున్న తరువాత పిల్లల కోసం ముంజి కాయలు కొని తినిపిస్తూ ఉంటారు.

తింటూ ఉండగా ఆమెకు ఇసకలో ఏదో కనిపిస్తుంది.

అదొక చిన్న శంఖం. దాన్ని చెవిలో పెట్టుకొని గాలి శబ్దం వింటూ తన తమ్ముడితో ఆడుకుంటూ ఉంటుంది.

పర్వీన్ ఆడుకుంటూ ఉండగా షంఖం నుంచి ఒక నీలిరంగు ముత్యం జారి కింద పడుతుంది.

నీటి అలలు ఆ ముత్యం పైన ఉన్న ఇసుకని శుభ్రంగా కడుగుతుంది.

ఆమె ముత్యాన్ని చేతిలోకి తీసుకోని తినే వస్తువు అనుకొని నోట్లో పెట్టుకొని నములుతూ, బుగ్గలో పెట్టి చెప్పరిస్తుంది.

ఉప్పు రుచి తప్పా మరేమి రుచి లేకపోవడం వల్ల బయటకు ఊసేయబోతుంది.

నీటిలో నిలబడి ఉన్న ఒక వ్యక్తికి ఢీ కొడుతుంది.

అతన్ని ఢీ కొట్టిన కంగారులో ఆ నీలి రంగు ముత్యాన్ని గుట్టుక్కున మింగేస్తుంది.

ఆమె కింద పడి అతని వైపు చూస్తుంది.

*Grrr*

మని శబ్దం చేస్తూ వింతగా నడుస్తూ వెళుతూ ఉంటాడు.

పర్వీన్ అతన్ని చూసి "అంకుల్ సోరీ" అని పిలుస్తుంది.

*Grrr*

కాని అతను పట్టించుకోకుండా కుంటి వాడిలా కుంటుతూ వెళుతూ ఉంటాడు.

ఆమె తిరిగి ఇసకలో ఇల్లు కడుతూ ఆడుకుంటూ ఉంటుంది.

ఆ వ్యక్తి కాలు విరిగి, ఒళ్ళంతా ఎండి పోయి చర్మం గట్టిగా మారిపోయి ఉంటుంది. అచ్చం జోంబి లాగా...