webnovel

22

మన హీరోలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

పెన్నా నది ప్రవాహాన్ని చేరుకుంటారు.

దారిలో ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.

మహేంద్ర: ఓహో! గ్యారడోస్! ఇద్దరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి.

మధ్యాహ్నం అయింది కదా? నేను మన కోసం ఫుడ్ రెడీ చేస్తాను.

అని చెప్పి తన వీపుకి ఉన్న బ్యాగ్ తీసి చెట్టు కింద పెడతాడు.

ఓహో: ఏం తినాలని అనుకుంటున్నావ్?

గ్యారడోస్: నాకు ట్యూనా చేప కావాలి.

ఓహో: నిన్ను కాదు! గొట్టం! వీడ్ని!!

గ్యారడోస్: ఓ!!? ఓకే! ఓకే!

మహేంద్ర: మనం పెన్నా నది దెగ్గర ఉన్నాం కాబట్టి చేపలు పట్టుకొని తింటే బాగుంటుంది.

ఓహో: రే! గొట్టం!

గ్యారడోస్: ఎస్?

ఓహో: నేను చేపలు పడతా! నువ్వు వాటిని క్యాచ్ పట్టుకొని ఈ చెట్టు దెగ్గర తీసుకొచ్చి పాడేయ్!

గ్యారడోస్: ఓకే!!! ఓకే!!!!

ఓహో: ఒక్క చేప మిస్ అవ్వాలా.. నా సామి రంగా!! గాల్లో ఎగరేసి తిప్పి తిప్పి కొడతా!!

గ్యారడోస్ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి.

మెల్లగా గటకలు మింగుతూ, స్పీడుగా సరేనని తల ఊపుతాడు.

°°°

ఓహో వేగంగా ఎగురుతూ వెళ్లి నీటిలోకి డైవ్ చేస్తూ వెళ్లి మళ్ళీ బయటకు వస్తుంది.

ఓహో బీక్లో (నోట్లో) చాలా చేపలు ఇరుక్కొని ఉంటాయి.

ఓహో మీద ఉన్న నీరంతా వేడికి క్షణంలో ఆవిరయి పోతుంది.

ఓహో ఒక ఫైర్ టైప్ పోకిమాన్. కాబట్టి నీటిని క్షణంలో ఆవిరి చేసేస్తుంది. అందువల్ల తన రెక్కలు తడవ్వు.

ఓహో పై నుంచి చేపలను గ్యారడోస్ వైపుగా విసిరేసి తిరిగి నీళ్లలోకి డైవ్ చేస్తూ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తుంది.

గ్యారడోస్ చేపలను నోటితో క్యాచ్ పట్టి చెట్టు కింద కుప్పగా పార బోస్తాడు.

మహేంద్ర వాటిని ఒక్కో వైపు వేరు చేస్తూ చిన్ని చేప పిల్లల్ని పట్టుకొని తిరిగి నీళ్ళల్లో పడేస్తాడు.

గ్యారడోస్: ఎందుకు వాటిని పడేస్తున్నావ్ మహి?

ఓహో తిడతాడు!

మహేంద్ర: అవి మరీ చిన్న చేపలు. వాటిని తిన్నా మన కడుపు నిండదు.

అలాంటప్పుడు చంపడం ఎందుకు? అందుకే తిరిగి నీళ్లలో వేసేస్తున్నా.

ఇప్పుడు పెద్ద చేపలు తిందాం. చిన్ని చేపలు పెద్దయ్యాక తినొచ్చు.

గ్యారడోస్: ఓ.. ఓకే.. బయ్యా నన్ను తిట్టకుంటే చాలు..

ఓహో: ఒరే! తొట్టి!! చేపలు క్యాచ్ పట్టమంటే పెత్తనాలు కొడుతున్నావా?!

అని ఓహో గ్యారడోస్ని అరుస్తాడు.

గ్యారడోస్: వస్తున్నా వచ్చేస్తున్నా...

అని అంటూ పాక్కుంటూ వెళ్లి మిగతా చేపల్ని క్యాచ్ పడుతుంటాడు.

°°°°

అలా చాలా చేపలు పడుతారు.

మహేంద్ర: ఈ చేపలతో చేపల మార్కెట్ పెట్టొచ్చు.. ఇన్ని అవసరమా?

ఓహో: దారిలో పనికొస్తాయిలే అందుకే ఇన్ని పట్టాను.

మనుషులు వండుకొని తింటారు కదా? వండుకొని తినూ.

మహేంద్ర: ఓకే! థాంక్స్! మీరిద్దరూ కూడా తినండి.

నేను వంట సామాన్లు రెడీ చేసుకుంటాను.

ఓహో: నేను చేపలు పట్టేటప్పుడే నా వాటా తినేసాను.

గ్యారడోస్: నేను కూడా...

ఓహో: హ్మ్???

అని గ్యారడోస్ని గుర్రుగా చూస్తాడు.

మహేంద్ర: పర్లేదులే ఓహో! మనోడేగా తింటే తిననీ~

ఓహో: సరేలే~ ఈసారికి వదిలేస్తున్న! ఇంకోసారి పర్మిషన్ లేకుండా తినూ.. నీ నోరు రెండు ముక్కలు చేసేస్తా!

గ్యారడోస్: 😰 సరే...

°°°

మనోహర్ చొక్కా, ప్యాంటుని విప్పేసి షార్ట్స్ వేసుకుంటాడు.

ఓహో:?

గ్యారడోస్:?

అని కొషన్ మొకాలతో చూస్తారు.

మహేంద్ర: వీటిని నేను ఒక్కడినే ఒకేసారి తినలేనుగా?

అందుకే క్లీన్గా కోసి వేస్ట్ వేరు చేయాలి. లేకుంటే పాడయిపోతాయి.

ఫిష్ నుంచి వేస్ట్ వేరు చేసి సాల్ట్ పూసి ఎండపెడితే 6 మంత్స్ వరకు నిలువ ఉంటాయి.

క్లీన్ చేసేటప్పుడు బ్లడ్ డ్రెస్సుకి అవ్వకూడదు కదా? అందుకే విప్పి నిక్కర్ వేసుకున్నాను.

మీ డౌట్లు తీరాయా?

ఓహో/ గ్యారడోస్ ఇద్దరూ అవునని ఒకేసారి తలలు ఊపుతారు.

ఓహో: నేనూ సహాయం చేస్తాను.

గ్యారడోస్: నేను కూడా!!

ఓహో: ఎందుకు? సహాయం చేస్తా అని చెప్పి నువ్వే అన్నీ తినేయడానికా?

గ్యారడోస్: ఈసారి అలా ఏం చేయనులే..

మహేంద్ర: గ్యారడోస్. నువ్వు ఫిష్ తల, పేగులు తింటావా?

గ్యారడోస్: అవే నా ఫేవరెట్!!

మహేంద్ర: అయితే వీటిని వేరు చేసాక మొత్తం నువ్వే తిను.

గ్యారడోస్: అయ్!!!

°°°

ముగ్గురూ కలిసి పని చేస్తూ ఉంటారు.

ఓహో తన కాలి గొల్లతో చేపల నుంచి వేస్ట్ వేరు చేసి, ముక్కుతో వాటి తలా, రెక్కలు వేరు చేసి చేపలను కుప్పగా ఉంచుతాడు.

గ్యారడోస్ వాటిని నోటితో తీసుకెళ్లి నీళ్లలో శుభ్రంగా కడిగి ఒడ్డుకు తెచ్చి నేల మీద పరిచి ఉన్న పెద్ద ఆకు మీద వేస్తాడు.

మహేంద్ర వాటిని తీస్కొని కత్తితో మధ్యలోకి కోసి లైన్గా ఎండలో పరుస్తాడు.

***

మహేంద్ర: వీటిని క్లీన్ చేసి పరచడం వరకూ సరే! దేంట్లో మోసుకొని వెళ్ళాలి?

నా బ్యాగ్లో ఇన్ని చేపలు పట్టవు కదా?..

అని ఆలోచిస్తూ ఉంటాడు.

次の章へ