బైరవ (పిల్లి) మాత్రం దిక్కులు చూస్తూ బోర్ కొడుతోందని ఆలోచిస్తుంటాడు.
ఎదురుగా అల్మరాలో క్యాట్ ఫుడ్ డబ్బాలను చూసి టేబుల్ ఎక్కి కూర్చొని జొళ్ళు కార్చుకుంటూ తోక ఊపుతూ ఉంటాడు.
డాక్టర్: పరీక్షించి చూస్తే...
బాగానే ఉన్నట్టు ఉన్నాడే..?
ఎముకలు అన్నీ మామూలుగానే ఉన్నాయి.
పళ్ళు శుభ్రంగానే ఉన్నాయి.
పాత గాయాల మచ్చలు తప్పా కొత్త గాయాలు ఏమీ లేవు.
మొత్తం బాగానే ఉంది.
సవ్యసాచి: హమ్మయ్య!~
వీడికి ఏం ప్రాంబ్లమ్ లేదు.
అని అంటూ గుండె తెలీక చేసుకుంటుంది.
డాక్టర్: కాకుంటే...
ఆ ఎర్ర పిల్లి మాత్రం..
కొన్ని నెలల పాటు ఒక పూట ఉపవాసం ఉంచి, ఎక్సర్సిస్ గట్రా చేయిస్తే మంచిది అని నా అభిప్రాయం.
8 కేజీలు ఉంటుందేమో అది..
అంత లావుగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు!
వాళ్లు ఇద్దరూ బైరవ (పిల్లి) ని చూసి మాటలతో అవమానించడం విని కోపం అనుచుకుంటూ భగ భగా మండిపోతూ ఉంటాడు.
బైరవ (పిల్లి): ఏసేస్తా ఈ నా కొ@కుని!!!...
అని మనసులో అనుకుంటూ, డాక్టర్ని కోపంతో చూస్తాడు.
నల్ల పిల్లి, సవ్యసాచి ఇద్దరూ బైరవ (పిల్లి) మొఖంలోని ఎక్స్ప్రెషన్లు చూసి డాక్టర్ ని కోపంతో ఏమైనా చేస్తాడేమోనని తడపడుతారు.
డాక్టర్ అవన్నీ తెలియకపోవడంతో నార్మల్గా చేతులు వాష్ చేసుకోని శానిటైస్ చేసుకుంటూ ఉంటాడు.
సవ్యసాచి దృష్టి మరో వైపుగా మళ్ళుతుంది.
ఆమె ఎదురుగా చాలా గాయపడిన కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కనిపిస్తాయి.
వాటికి వైద్యం చేసి అబ్సర్వేషన్లో పెట్టి ఉంటారు. అవి అన్నీ నిద్రలో ఉంటాయి.
సవ్యసాచి: హహ్?..
డాక్టర్ గారు, ఏమైంది? ఇన్ని జంతువులు కేర్ యూనిట్ లో ఉన్నాయేంటి?..
అని దిగులు పడుతూ అడుగుతుంది.
డాక్టర్: అవన్నీ గాయపడ్డాయి.
ఎవరో ఏంటో తెలీదు గానీ, చాలా రోజులుగా నా హాస్పిటల్ తలుపు బయట జంతువుల్ని, చికిత్సకు కావాల్సిన డబ్బులని ఉంచి వెళుతున్నారు.
సవ్యసాచి: హా? అలా ఎలా వదిలి వెళుతున్నారు?..
డాక్టర్: హా!~ నేను అన్నిటికీ చికిత్స చేశాను. వాటిలో రెండు అర్జెంట్ కేసులు కూడా ఉన్నాయి..
నాకు దొరికినప్పుడు అన్నీ చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి..
సవ్యసాచి: వాటిని అబ్యూస్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయా?...
అని తబడుతూ అడుగుతుంది.
డాక్టర్: అబ్యూస్ అంటే.. కచ్చితంగా చెప్పలేను గానీ...
ఏ జంతువు ఒంటి మీద కనిపించే గాయాలు ఏమీ కనిపించలేదు నాకు. కాకుంటే..
వేరే సమస్యలు నాకు కనిపించాయి..
సవ్యసాచి: ఏ సమస్యలు డాక్టర్ గారు?..
ఆమె తడబడుతూ గుటకలు మింగుతుంది.
డాక్టర్: నా దెగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు గానీ, నేను పరీక్షంచగా తెలిసిందేంటంటే...
....