webnovel

32

ఆమె క్యాచ్ పట్టుకుంటుంది. బ్యాగ్ జిప్ తీసి అందులో చెయ్యి పెడుతుంది.

ఫరీద: టైం స్టాప్.

సమయం ఆగిపోతుంది.

ఫరీద: మనీ బ్యాలెన్స్ ఎంత ఉంది?

స్క్రీన్: 20.5 బిలియన్ రూపీస్.

ఫరీద: హా?.. 20.5 బిలియన్ రూపీస్ అంటే ఎన్ని సున్నాలు ఉంటాయబ్బా?.. (*ఆలోచిస్తూ)

ఏమోలే~ స్టోరేజ్ మొత్తం ఫ్రీ చేయడం కావాలి ముందు.

స్క్రీన్: ఒకేసారి స్టోరేజ్ స్పేస్ అన్లోక్ చేస్తే తక్కువ ధరలోనే అవుతుంది.

ఫరీద: ఎంత అవుతుంది?

స్క్రీన్: 10 బిలియన్ రూపీస్ వాడితే హద్దు లేనంత స్పేస్ ఇవ్వబడుతుంది.

ఫరీద: 10 బిలియన్ రూపీసా?.. (*ఆలోచిస్తూ)

అంతేనా? మొత్తం డబ్బులు అడుగుతావునుకున్న. సరే. అలాగే కానివ్వు!

స్క్రీన్: 10 బిలియన్ రూపాయలు ఉపయోగించి స్టోరేజ్ స్పేస్ పూర్తిగా అన్లాక్ చేయబడింది.

ఇకనుంచి హద్దులు లేకుండా స్టోరేజ్ స్పేస్ ఉపయోగించవచ్చు.

ఫరీద: యా! ఒకే! నెక్స్ట్ ఏంటి? ఇంకా 10.5 బిలియన్ రూపాయలు ఉన్నాయి.

నాకు డబ్బాంతా ఖర్చు పెట్టేసేయాలని చేతులు దురద పుడుతున్నాయి.

నా దెగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని తెలిస్తే మా వాళ్లు నన్ను చెట్టుకి కట్టేసి వాళ్లకు నచ్చినట్టుగా వాడేస్తారు.

స్క్రీన్: ప్రదేశాలను బయ్ చేయండి.

ఫరీద: ప్రదేశాలా?.. కొంపదీసి.. నేను బటన్ నొక్కగానే ప్రాణమే లేని కొత్త లోకంలోకి వెళ్ళిపోను కదా?

స్క్రీన్: మీకు నచ్చిన వాతవరణం గల ప్రదేశాన్ని ఎంచుకొని కొనవచ్చు.

ఆతర్వాత ఆ చోటులోని ప్రదేశాన్ని పెద్దగా చేయవచ్చు కూడా.

ఫరీద: అచ్చం ఈ స్టోరేజ్ లాగేనా?.

స్క్రీన్: అవును. మీకు ఇంకో బోనస్ ఏమిటంటే మీరు కొనే ప్రదేశంలో ఆ ప్రదేశానికి తగ్గట్టుగా మొక్కలు, చెట్లు, చేపలు, పక్షులు, జంతువులు మొదలుగొనవి సంపాదించవచ్చు.

ఫరీద: వారేవా!! ఇది కదా నాకు కావాల్సింది!!!

ఇంకెందుకు ఆలస్యం?! కోనేయ్!!

స్క్రీన్: ఒక ప్రదేసాన్ని అన్లోక్ చేసిన వెంటనే 1×1kmపొడవు, వెడల్పు గల చోటు ఇవ్వబడుతుంది.

ఒక్కో ప్రదేశం యొక్క ధర ఆ ప్రదేశాన్ని, వాతావరణాన్ని బట్టి ఖరీదు ఉంటుంది.

ఫరీద: సరేలే. ముందుగా నాకు టమాటాలు, ఉల్లిపాయలు, బియ్యం, గోధుమ... లాంటి మొక్కలు పెంచగలిగే చోటుని చూపించు.

స్క్రీన్లో ఒక చోటుని చూపిస్తుంది.

Bab berikutnya