webnovel

The Chosen-1

సమయం: 6:30 am

ఆంధ్రప్రదేశ్ లోని ఒక నగరమది.

ఒక ఇంట్లో గురక పెడుటూ ఒక అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది.

ఖాజా మస్తాన్: రే! దున్న!! ఎంత సేపు నిద్రపోతావ్?!

నిద్రలే!! లేకుంటే మొఖం మీద నీళ్లు కొట్టి లేపుతా నేను!!

అని గది బయట నుంచి వాళ్ళ నాన్న కేకలేస్తూ ఉంటాడు.

ఫరీద: వస్తున్నా... హా..... (*అవులిస్తూ)

అప్పుడే తెల్లారిందా?..

ఆమె లేచి కూర్చొని, ఒళ్ళు విరుచుకుంటుంది.

మంచం దిగి నేరుగా బయటకు వెలుతుంది.

ఫరీద: ఏంటి బాబా?! అలా కేకలేసావ్?.. మంచి నిద్రలో ఉంటే.. నీ గొంతు విని ఉలిక్కిబడి లేచా నేను.

ఆమె చిరాకుతో నిద్ర మత్తులో మాట్లాడుతూ, తల గోక్కుంటూ ఉంటుంది.

ఖాజా మస్తాన్: టైం చూసావా ఎంతయిందో? మీ అమ్మ మార్నింగ్ షిఫ్ట్కి 5 గంటలకి లేచి హాస్పిటల్కి వెళ్ళిపోయింది.

ఫరీద: ఇప్పుడేంటి? నేను ఆవిడ వెనకాలే తోకలా వెళ్లాలా?

ఖాజా మస్తాన్: ఎదురు మాట్లాడావంటే పళ్ళు రాలకొడతా!

వచ్చి వాకిళ్ళు చిమ్ము!!

ఫరీద: హా.....

ఆమె ములుగుతూ ఉంటుంది.

ఖాజా మస్తాన్: కర్ర తీసుకురమ్మంటావా? హా?

ఫరీద: చిమ్ముతున్న!! చిమ్ముతున్న!!.. (*గట్టిగా చెప్పి)

(తనలో తాను చిన్న గొంతుతో గొనుక్కుంటూ) బాబోయ్.. కుంచం ఉంటే నన్ను పొద్దున్నే కుక్కను బాదినట్టు బాదుండే వాడు..

ఆమె కంగారుగా వెళ్లి చీపిరి కట్ట తీసుకోని వాకిళ్ళు చిమ్ముతూ ఉంటుంది.

తన తమ్ముడు గట్టు మీద కూర్చొని ఉంటాడు.

షామీర్: అటు పక్క చిమ్ము! దుమ్ము ఎక్కువుంది.

ఇక్కడ కూడా చిమ్ము! మట్టి పేరుకుని పోయింది.

ఫరీద: నాకొచ్చే కోపానికి.. వీడ్ని కూడా చిమ్మేసి పడేస్తా!! దరిద్రం వదిలిపోద్ది!

ఆమె చిరాకుతో వాడి మీద దుమ్ము పడేలా చీమ్ముతూ ఉంటుంది.

వాడు పైకి లేచి, పక్కకు జరిగి నిలబడుతాడు.

షామీర్: బాబా!! అక్క నా మీద కావాలని దుమ్ము వేస్తోంది!!

వాడు అరవగానే వాళ్ళ నన్ను కోపంగా బయటకు వస్తాడు.

ఆమె దెబ్బలు పడతాయని భయపడి మాములుగా చిమ్ముకుంటూ వెళుతూ ఉంటుంది.

వాళ్ళ నాన్న తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతాడు.

షామీర్: హిహిహిహిహి....

వాడు నవ్వుతూ మళ్ళీ గట్టు మీద కూర్చొని ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు.

ఫరీద:... దుమ్ము కొట్టుకు పోతావ్!! శాడిస్ట్ ఎదవ!!

ఆమె తిట్టుకుంటూ చిమ్మడం పూర్తి చేస్తుంది.

Bab berikutnya