సవ్యసాచి:??
బైరవ గొంతు సవరించుకుంటాడు.
బైరవ (పిల్లి): ఓ... నీకు పీడ కల వచ్చిందా?!
అని కవర్ చేసుకుంటూ అడుగుతాడు.
సవ్యసాచి: అవును.. ఇంకా నా చెస్ట్ హెవీ గానే అనిపిస్తోంది.
బహుశా ఆ ఇన్సిడెంట్ వల్లే నేమో..
నాకు చాలా కంగారుగా ఉంది..
బైరవ (పిల్లి): చేసిందంతా చేసేసి ఇప్పుడు కంగారుగా ఉందా నీకూ?! హా?!
సవ్యసాచి: హా.. నువ్వు చెప్పావుగా..
బైరవ (పిల్లి): ఓహో.. నా మాటలు నీ చెవిలో పడ్డాయా?! పిచ్చి పూ... లాగా నవ్వుతుంటే నీ చెవులు తుప్పట్టి పోయాయానుకున్నలే.
సవ్యసాచి: హహహ...
అని కవర్ చేసుకుంటూ నవ్వుతుంది.
బైరవ (పిల్లి): అబ్బబ్బా...
సవ్యసాచి: అం...
బైరవ (పిల్లి): ఇప్పుడేంటి?!
సవ్యసాచి: నా కోసం దిగులు పడుతున్నందుకు చాలా థాంక్స్.
నా కోసం ఒకరు దిగులు పడుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది.
అని నవ్వుతూ చెబుతుంది.
బైరవ (పిల్లి): ఆపుతావా!!?? నేనేం నీ కోసం దిగులు పడట్లా!!
అని సిగ్గు పడుతూ అరుస్తాడు.
సవ్యసాచి: హ్మ్? కాదా?
అని అమాయకంగా అడుగుతుంది.
బైరవ (పిల్లి): కచ్చితంగా కాదు!! ది గ్రేట్ బైరవ ఒకరి గురించి దిగులు పడటమా?! ఇంపొస్సిబల్!!
అది... హా!! ఇందుకే!!..
ఎందుకంటే, నువ్వు నాకు హెల్ప్ చేసావు కాదా అని జాలి పడ్డాను అంతే!! ఇంకేం లేదు!!
అని సిగ్గు పడుతూ చెప్తాడు.
సవ్యసాచి: ఓ... ఓకే?..
బైరవ (పిల్లి): నేను ఒకరి కోసం దిగులు పడటమా?! నేను నా గురించి తప్పా ఇంకెవరి కోసము ఆలోచించను!! ఎవరెలా పోతే నాకేంటి?
అని మొహం తిప్పుకొని ఆలోచిస్తూ ఉంటాడు.
సవ్యసాచి: నేను తప్పుగా ఆలోచించానా?..
అని తల గోక్కుంటూ ఉంటుంది.
బైరవ వెనక్కి తిరిగి చూస్తాడు.
బైరవ (పిల్లి): నీకంత భయంగా ఉంటే ఒక పని చేద్దాం!!
నేను నీకు ఒకటి నేర్పిస్తా!!
సవ్యసాచి: హ్మ్? ఏంటి?
బైరవ (పిల్లి): నీ శక్తులు ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాను!
సవ్యసాచి: నిజంగానే?? నీ వల్ల అవుతుందా??
బైరవ (పిల్లి): ఎస్!!
సవ్యసాచి: నిజంగా నాకు నువ్వు నేర్పిస్తావా?
బైరవ (పిల్లి): ఒకే మాట రెండోసారి అడగొద్దని ఎన్ని సార్లు చెప్పాను?!
సవ్యసాచి: సోరీ!!
@@@@
ఇద్దరూ మెట్లు దిగి బేస్మెంట్ లోకి వెళ్తారు.
బైరవ (పిల్లి): పర్లేదు. ఈ చోటు బానే ఉంది..
అని అంటూ చుట్టూ చూస్తుంటాడు.
సవ్యసాచి: బేస్మెంట్లో నాకు వడ్తువులేం పెద్దగా లేవు. సో, ఇక్కడ ఖాళీగా ఉంది. మొన్నే క్లీన్ చేశాను. అందుకే దుమ్ము కూడా లేదు.
బైరవ (పిల్లి): మంచిది! ఇంకేంటి? మొదలు పెడదామా?!
సవ్యసాచి: హ్మ్! ఓకే!
బైరవ (పిల్లి) పాత సోఫా ఎక్కి కూర్చుంటాడు. సవ్యసాచి నెల మీద పద్మాశనంలో కూర్చుంటుంది.
బైరవ (పిల్లి): జాగర్తగా విను!
నీ శక్తులని చిన్నప్పటి నుంచి గుడ్డిగా వాడటం వల్లే ఇప్పటిదాకా అప్గ్రేడ్ అయ్యావు.
ఇక నుంచి నేను చెప్పే పద్దతిలో నీ శక్తులు వాడటం చేస్తే నీ శక్తులు మరింత ఏఫిషియంట్ గా వాడగలుగుతావు.
నేను నేర్పే వాటితో రాత్రికి రాత్రే సూపర్ హీరో అయిపోతావని మాత్రం కలలు కనకు! అర్థమైందా??!!
ఏ శక్తి కూడా కొన్ని రోజుల్లో పెరిగిపోదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా కాలం పడుతుంది.
నీ పట్టుదల, టాలెంట్ ఎంత ఉంటుందో అంతే నీ శక్తి కూడా పెరుగుతుంది.
సవ్యసాచి: అంటే.. నా మీద పని చేయకపోవడానికే ఎక్కవ అవకాశాలు ఉన్నాయన్నమాట!?
బైరవ (పిల్లి): ఏమో. నీ టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది మరీ.
శక్తిని రోజూ వాడుతూ పెంచుకోవడం వేరు. ఆ శక్తిని డెవలప్ చేయటం వేరు.
నా మెథడ్స్ తో అంత లెవెల్కి రావటానికి నీకెన్ని ఏళ్ళు పడుతుందొ నేను కూడా చెప్పలేను.
సవ్యసాచి: నీవల్ల ఎలా అయింది?
బైరవ (పిల్లి): ఆ మెథడ్ కనిపెట్టిందే నేను పాపా!
సవ్యసాచి: ఓ...
బైరవ (పిల్లి): ఇలా దెగ్గరికి రా!!
సవ్యసాచి: ఓకే!
ఆమె జరిగి ఎదురుగా కూర్చుంటుంది.
అతను తన శక్తిని ఆమెలోకి పంపుతాడు.
సవ్యసాచి: వావ్.. ఇదీ.. అచ్చం ఆరోజు లాగే అనిపిస్తోంది..
అని ఆలోచిస్తుంది.
బైరవ: నీ గుండె చప్పుడు గమనించు. నేను పంపే శక్తి నీ నరాల్లోకి రక్తం లా ప్రవహించడం గమనించు.
వాటిని గమనించి ప్రవాహాన్ని ఫీల్ అవ్వు! ఆ శక్తి ఎలా ఉంటుంది. ఎలా ఫీల్ అవుతోందో గుర్తు పెట్టుకొని నేర్చుకో.
నీ అంతట నువ్వే ఆ శక్తిని వాడటం అలవాటు చేసుకో.
సవ్యసాచి: ఓకే!
బైరవ (పిల్లి): మొదలుపెట్టు!
అతని శక్తిని ఆమెలోకి పంపుతూ ఉంటాడు. ఆమెకు గుండెలో నొప్పి వస్తుంది.
సవ్యసాచి: ఆహ్... నొప్పి...
బైరవ (పిల్లి): ఓపిక పట్టు!!
*పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది.*
@@@@..ష్వా.... @@@@
బైరవ (పిల్లి): నేను చెప్పింది నేర్చుకోడానికి టైం పట్టుద్ది. కొన్ని నెలలు ప్రాక్టీస్ చేస్తూ ఉండు.. అప్పటికయినా...
అని అంటూ ఉండగా,
సవ్యసాచి: వావ్!! నీ మెథడ్ తో ఈ శక్తిని నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను!
బైరవ (పిల్లి): హా?
అని షాక్ అయిపోతాడు.
సవ్యసాచి: ఈ పవర్ నువ్వు చెప్పినట్టే మూవ్ అవుతోంది..
అని చెబుతూ లేచి నిలపడుతుంది.
సవ్యసాచి: అంటే, ఇలా చేయాలన్నమాట!
ఆమె చుట్టూ మెరుపు తరంగాలు విలువడుతూ ఆమె అధీనంలో ఉంటాయి.
బైరవ (పిల్లి): అప్పుడే... ఎలా?...
అని టెన్షన్ పడుతాడు.