webnovel

17

సైంటిస్ట్ కోపంతో ల్యాబ్ లోని వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటాడు.

సైంటిస్ట్: దీనిమీద ఏందుకు పని చెయ్యట్లేదు?!

దాని మీద పని చేసిందిగా?!

సేమ్ ప్రొసీజరే వాడానుగా?! ఏం?!

ఇదే ఎందుకు పని చేయట్లా?!

విన్నీ!! నిజంగానే ఎక్స్ప్రిమెంట్ చేసిన జంతువులు అన్నీ చచ్చిపోయాయా?

పారిపోయిన పిల్లి మాత్రమే ఎలా బ్రతికింది?!

అస్సలు అర్ధం కావట్లా!!

విన్నీ (వెన్నెల): ఎస్ సర్.

నేను కాన్ఫర్మ్ చేశాను. అన్నీ ఎనిమల్స్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయాయి.

సైంటిస్ట్ కి చాలా కోపం వస్తుంది. టెన్షన్ తో తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు.

సైంటిస్ట్: గాడ్ డమ్మీట్!! నిజంగానే అన్నీ చచ్చాయా??!! ఇప్పుడెలా?.. నేనేం చేయను?!! నాకేం అర్ధం కావట్లా!!..

విన్నీ (వెన్నెల):.....

సైంటిస్ట్: కావాలి.... నాకు ఇంకా టైం కావాలి...

కానీ... వాళ్ళకి నా ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్స్ చూపించాల్సిన టైం ఇదీ...

ఇంకో వైపు ఏమో ట్రాకర్స్ కూడా ఫాలో చేస్తున్నారు..

ఏం చెయ్యను నేను.....

విన్నీ!! ఎక్స్ప్రిమెంట్ కోసం ఇంకొన్ని ఎనిమల్స్ తీస్కునిరా!!

విన్నీ (వెన్నెల): ప్రొఫెసర్, మన దెగ్గర ఉన్న ఎనిమల్స్ అన్నీ అయిపోయాయి.

సైంటిస్ట్: అన్ని అయిపోయాయా?! అయితే కొత్తవి అపట్టుకొని రా!

విన్నీ (వెన్నెల): ఈ ఏరియాలో జంతువులు కనిపించకుండా పోవడం చాలా మంది గమనించ్చినట్టు ఉన్నారు.

పోలీస్ కంప్లైంట్స్ ఎక్కువ్వయ్యాయి. ఎటు చూసినా పోలీసులు తిరుగుతూ ఉన్నారు.

సైంటిస్ట్: నోర్ముయ్!! అధికప్రసంగి!!!

అని కోపంతో అతని ఆరా శక్తిని ఆమె మీదకు పంపి అటాక్ చేస్తాడు.

ఆమెకు మొహం మీద తగులుతుంది. బ్లడ్ కారుతుంది.

విన్నీ (వెన్నెల):.....

సైంటిస్ట్: ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు చెప్తావ్!?

విన్నీ (వెన్నెల): ఐమ్ సారీ సార్.

సైంటిస్ట్: ఈ ఏరియాలో కాకుంటే ఇంకోటి! ఏదొక ఏరియా నుంచి ఎత్తుకొనిరా!!

అన్నీ వివరంగా చెప్పాలా నీకూ?!

పనికిమాలిన @#₹%&&....

అని తిడుతూ గది నుంచి బయటకు వెళుతుంటాడు.

సైంటిస్ట్: ఇక్కడి దాకా రావడానికి నేను చాలా కష్టపడ్డాను! మధ్యలో వదలడం కుదరదు!!

అని ఆలోచిస్తూ వెళ్తాడు.

@@@

*ప్లేస్*

"సవ్యసాచి ఇల్లు"

---------------------

సవ్యసాచి ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది.

ఆమె చుట్టూ పిల్లి పిల్లలు పనుకొని ఉంటాయి.

బైరవ తన యోగా చేస్తూ ఎనర్జీని హీల్ చేస్తూ ఉంటాడు.

మెల్లగా కళ్ళు తెరుస్తాడు.

బైరవ (పిల్లి):  ఛా!! సరిపోయిన శక్తిని అబ్శార్బ్ చేయలేక పోతున్నా!

గాయం వల్ల మాత్రమే కాదు. ఇలాంటి పరిస్థితిలో చాలా ఎనర్జీ వాడేసాను.

దానితో పాటుగా..

నా గాయాలు మానక ముందే నా శక్తులని సవ్యసాచికి ఇచ్చాను.

అని ఆలోచిస్తూ ఉండగా సవ్యసాచి నవ్వుతున్న మొఖం గుర్తొస్తుంది.

బైరవ (పిల్లి):  ఉఫ్... అప్పుడు నాకింకో ఛాయస్ కనిపించలేదు.

నేను కనుక నా శక్తులు ఇవ్వకుండా ఉండుంటే ఈ పిల్ల పరిస్థితి ఏమయ్యేదో దేవుడికే తెలియాలి..

కానీ ఆ ముసలోడి గురించే నా దిగులంతా.

ఫోర్స్ చేసి అవేకెన్ చెయ్యడం చట్టనిత్య నేరం. అలాంటిది ఈ పిల్ల వాడి లాంటోడితో గొడవ పెట్టుకుంది.

సవ్యసాచి కనిపిస్తే ప్రాణాలతో వదులుతాడని అనిపించట్లేదు.

ముసలోడు కనుక మనసు మార్చుకొని పారిపోతే వాడికి మంచిది!..

అలా కాదని సవ్యసాచి జోలికి వస్తే....

సవ్యసాచి పరిస్థితి ఏంటి?...

అని ఆలోచిస్తూ ఆమెను గమనిస్తాడు.

సవ్యసాచి: ఆర్గ్..... క్క్స్.....

అని నిద్రలో కలవరిస్తూ ఉంటుంది.

బైరవ (పిల్లి):  పిడకల కంటుందా ఏంటి? మొఖం మట్టగడిసలా పెట్టింది?..

అని అనుకుంటూ ఉంటాడు.

సవ్యసాచి: ఆగ్..... ష్.... 

బైరవ (పిల్లి):  ఇంత జరిగాక ఈ పిల్లకి పీడ కలలు రావటం మాములేలే...

పాపం... అమాయకురాలు...

అని ఆలోచిస్తూ ఉంటాడు.

సవ్యసాచి: బైరవ..... నాకు ఊపిరి ఆడట్లేదు....

ఏదో.... దెయ్యం... నా గుండెల మీద కూర్చొని పీక నొక్కినట్టుగా అనిపిస్తోంది..... హ్హ్....

అని కళ్ళు మూసుకొనే నిద్రలో కలవరిస్తూ ఉంటుంది.

బైరవ (పిల్లి):.....

సవ్యసాచి: ఆ..... నా ప్రాణం పోయేలా ఉంది....

అని నిద్రలో కలవరిస్తుంది.

బైరవ ఏంటని ఆలోచిస్తూ తనను తను చూసుకుంటే ఆమె పొట్ట మీద పనుకొని ఉంటాడు.

మూడు పిల్లులు నిద్ర నుంచి లేచి బైరవని చూస్తాయి.

బైరవకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి.

మెల్లగా పక్కకు దూకి కూర్చుంటాడు.

సవ్యసాచి: హా!!.....

అని లేచి కూర్చుంటుంది.

బైరవ (పిల్లి):... నేనెప్పుడు ఆ పిల్ల మీదెక్కి కూర్చున్నాను?...

నాకేం తెలీదు బాబోయ్...

అది నేను కాదు...

అని ఆలోచిస్తూ ఉంటాడు.

సవ్యసాచి: హా... హా... ఇప్పుడే ప్రాణం లేచొచ్చినట్టుంది..... హా.... హా....

అని గట్టిగా ఊపిరి పిలుస్తూ ఉంటుంది.

సవ్యసాచి: నాకొక పిడకల వచ్చింది..

ఎవరో నా మీద కూర్చొని పీక పట్టుకున్నట్టు....

నాకు ఊపిరి ఆడలేదు... హా... హా...

అని కంగారుగా మాట్లాడుతుంది.

బైరవ (పిల్లి):  నీ యంకమ్మ!!

నేనేం అంత బరువెమ్ లేనే బాబూ!!

నేనేం నీ పీక పట్టుకోలేదు!!

అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు.

Chapitre suivant