వాలెట్ బాలన్స్: 0
ఫరీద: హమ్మయ్య! జోబీలో పైసా లేదిప్పుడు! గుండెల్లో నుంచి బరువు తిరినట్టుగా ఉంది.
స్క్రీన్లో ప్రదేశాన్ని చూపిస్తుంది. అన్లోక్ చేయని ప్రదేశంలో చుట్టూ తెల్ల రంగులో మనిషి ఆకారంలోని బలూన్లు నిదానంగా అడుగులు వేస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉంటాయి.
స్టోరేజ్ మొత్తం విశాలంగా ఖాళీగా ఉంటుంది.
విత్తనాలు అమ్మే షాప్ స్టోరేజ్ పక్కనే ఉంటుంది. అందులో షాప్ ఓనర్గా ఒక స్కిన్ ఉన్న బాబ్ నిలబడి ఉంటుంది.
స్టోరేజ్ దెగ్గర 3 వర్కర్ బాబ్స్ నిలబడి ఉంటాయి.
ఆమె కొన్న విత్తనాల బస్తాలను మూడు బాబ్స్ స్టోరేజ్లోకి మోసుకొని వెల్తాయి.
51 తెల్ల బాబ్స్ ఒకే చోట లైన్లో నిలబడి ఉంటాయి.
ఫరీద: ఈ బాబ్స్ తో తలో 30 అడుగుల వరకూ మొక్కలను నాటించు.
ఆల్రెడీ ఉన్న మొక్కలు, చెట్లను హార్వెస్ట్ చేసేయ్. పిచ్చి మొక్కలు నరికించెయ్.
స్క్రీన్: ఓకే. వర్కర్స్ పనిని ప్రారంభించారు.
వర్కర్స్ అన్నీ తలో దిక్కులో వెళుతూ, మొక్కలు పెరిగే విధమైన రకంలో భూమిని దున్నుతూ, విత్తనాలు మోసుకొని వచ్చి, నాటడం మొదలు పెడతారు.
ఫరీద: మాములుగా కొన్ని విత్తనాలను నీళ్లలో నానబెట్టాక నాటుతారు కదా? అంతే కాదు. అన్నీ బాబ్ల దెగ్గరకి ఆ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి?
స్క్రీన్: వర్కర్లు పని చేయడానికి సిస్టమే మొత్తం వస్తువులను ఇవ్వడం జరుగుతుంది.
పుష్కలామైన మినరల్స్ ఉన్న నేల వల్ల మొక్కలు ఈ ప్రదేశంలో సులువుగా పెరుగుతాయి.
ఎటువంటి క్రిములు వీటిని చేరవు.
ఫరీద: సరేలే. ఇవన్నింట్లో లాజిక్ వెతికితే నా బుర్ర తుప్పట్టుద్దో ఏమో.
అవును ఇవి ఇప్పుడు నాటితే ఎప్పటికి కోతకి వస్తాయ్?
స్క్రీన్: ఎటువంటి పంట అయినా 24 గంటల తర్వాత పూలు, పండ్లు, కూరగాయలను ఇచ్చేస్తుంది. వర్కర్లు స్టోరేజ్లో భద్రపారుస్తారు.
స్క్రీన్లో హార్వెస్ట్ చేసినవి చూపించడం జరుగుతుంది.
ఫరీద: ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ అవ్వాలంటే 24 గంటలు ఆగాలా నేను?
స్క్రీన్: మొత్తం ప్రదేశంలోని హార్వెస్ట్ 24 గంటలకు ముందే కావాలనుకుంటే మనీ పే చేసి ఫాస్ట్ ఫార్వార్డ్ చేయొచ్చు.
ఫరీద: అచ్చం ఫార్మ్ గేమ్ ఆడినట్టే ఉంది..